అతను నాశనం అయిపోవాలి... క్రిస్మస్ సందేశం
తమ దేశం శాంతిని కోరుకుంటోందని వోలోడిమిర్ జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. అయితే దాని కోసం తాము ప్రార్ధిస్తూనే ఉంటామని అన్నారు.
By: Satya P | 26 Dec 2025 12:22 AM ISTఎంత కోపం కసి ప్రతీకారం ఉంటేనే కానీ ఆ మాట రాదు. ఒక దేశ అధ్యక్షుడి మనసులో నుంచి ఈ మాటలు వచ్చాయి. ఆ దేశం ఉక్రెయిన్ అయితే అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ. ఆయన క్రిస్మస్ పండుగ వేళ ఇచ్చిన సందేశం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక రోజు కాదు ఒక ఏడాది కాదు ఏకంగా నాలుగేళ్ళుగా ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. అది మామూలు యుద్ధం కూడా కాదు భీకరమైనది. అటు రష్యా దళాలు ఉక్రెయిన్ పని పట్టాలని భారీ ఎత్తున దండయాత్రలే చేస్తూ వచ్చాయి. దానికి ప్రతిగా ఉక్రెయిన్ ఏ మాత్రం తగ్గకుండా పోరాడుంది. ఈ నేపథ్యంలో సహజంగానే అధిక నష్టం ఉక్రెయిన్ దే అవుతోంది. ఆస్తి ప్రాణ నష్టం అత్యధికంగా ఉంది. ఇవన్నీ పంటి బిగువున భరిస్తూ వస్తున్న వోలోడిమిర్ జెలెన్‌స్కీ నుంచి వచ్చిన ఘాట్ హాట్ ట్వీట్ ఇలాగే ఉంది. అతను నాశనం అయిపోవాలి అని. పేరు ఎత్తలేదు కానీ ఆ అతడు రష్యా అధినేత పుతిన్ అని అంటున్నారు.
శాంతి కావాలంటూ :
తమ దేశం శాంతిని కోరుకుంటోందని వోలోడిమిర్ జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. అయితే దాని కోసం తాము ప్రార్ధిస్తూనే ఉంటామని అన్నారు. అలాగే శక్తిమేరకు పోరాడి సాధిస్తామని కూడా స్పష్టం చేశారు. రష్యా తమ మీద చేస్తున్న దాడుల పట్ల వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశరు. రష్యా పెడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా నుంచి ఇచ్చిన వీడియో సందేశంలో రష్యా మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. రష్యా నాలుగేళ్ళ యుద్ధంతో ఏమి సాధించింది అంటే భౌతికంగా మాత్రమే నష్టం చేసింది. కానీ ఈ రోజుకీ రష్యా ఆక్రమించుకోలేనిది అతి ముఖ్యమైనది ఎంతోఉంది. బాంబులు సైతం ధ్వంశం చేయలేనివి అవి అని అంటూ అవే ఉక్రెయిన్ ప్రజల హృదయం అని ఆయన అన్నారు. అందుకే ఉక్రెయిన్లు ఐక్యత చాటుకున్నారని బలంగా నిలబడ్డారని ఒకరి పట్ల ఒకరు విశ్వాసం పెంచుకుని కష్టాలను పంచుకుని ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు. అందుకే అందరి మనసుల్లో ఉన్న ఒకే ఒక కోరిక అంటూ అదే అతను నాశనం అయిపోవాలి అని చెప్పుకొచ్చారు ఉక్రెయిన్ ప్రజలు అందరూ తమలో తాము గా కోరుకునేది అనుకునేది ఇదే అని వోలోడిమిర్ జెలెన్‌స్కీ గట్టిగా చెప్పారు.
తాజాగా దాడులు :
ఒక వైపు ప్రపంచం అంతా క్రిస్మస్ వేడుకలకు సిద్ధపడుతున్న వేళ మంగళవారం కూడా ఉక్రెయిన్ మీద రష్యా క్షిపణులు ప్రయోగించిందని డ్రోన్ల దాడిలో ముగ్గురులు ప్రాణాలు పోగొట్టుకున్నారని వోలోడిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు. అంతే కాదు కీలకమైన చోట్ల విద్యుత్ సరఫరా కూడా దెబ్బ తిందని అన్నారు. ఇదీ రష్యన్ల నిజ స్వరూపం అని మరోసారి పండుగ వేళ కూడా చాటుకున్నారని ఆయన అన్నారు. దేవుడు అన్న నమ్మకం ఉంటే ఎవరూ ఇలాంటివి చేయరు కానీ చేస్తున్నారు అంటే వారిని ఏ మాత్రం విశ్వాసం లేదని అర్ధం అని పుతిన్ మీద పరోక్షంగా వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర విమర్శలు చేశారు.
