Begin typing your search above and press return to search.

రాజ‌కీయం ఇంత‌క‌న్నా దిగ‌జార‌దు.. ఏం జ‌రిగిందంటే!

రాజ‌కీయాల్లో దిగ‌జారుడు త‌నం గురించి త‌ర‌చు చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది.

By:  Garuda Media   |   20 Oct 2026 9:00 PM IST
రాజ‌కీయం ఇంత‌క‌న్నా దిగ‌జార‌దు.. ఏం జ‌రిగిందంటే!
X

రాజ‌కీయాల్లో దిగ‌జారుడు త‌నం గురించి త‌ర‌చు చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. కానీ, తాజాగా జరిగిన ఓ ఘ‌ట‌న ''ఇంత‌క‌న్నా దిగ‌జార‌దు'' అనే వ్యాఖ్య‌లు చేసేలా చేసింది. దీనికి కార‌ణం.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున 2024లో ఎంపీగా విజ‌యం సాధించిన నాయ‌కుడు.. తాజాగా బీజేపీ కండువా మార్చుకోవడంతో 15 సంవ‌త్స‌రాల వివాదాన్ని బీజేపీ ప్ర‌భుత్వం రాత్రికి రాత్రి ప‌రిష్క‌రించి.. స‌ద‌రు నాయ‌కుడికి ఉప‌శ‌మ‌నం క‌ల్పించింది. ఇది పూర్తిగా వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మైన‌ప్ప‌టికీ.. బీజేపీ ప్ర‌భుత్వం ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవ‌డం వివాదానికి దారి తీసింది.

ఏం జ‌రిగింది?

యూస‌ఫ్ ప‌ఠాన్‌.. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌. 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ‌న తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ(మ‌మ‌తా బెన‌ర్జీకి చెందిన పార్టీ) త‌ర‌ఫున బ‌హ‌రంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ ఏడాది ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో తృణ‌మూల్ ఎంపీలంతా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత కుంప‌టి పెట్టుకుని బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కానీ, ప‌ఠాన్ మాత్రం నిన్నటి వ‌ర‌కు అలా చేయ‌లేదు.

ఇక‌, ఆయ‌న‌కు 2012లో గుజ‌రాత్ ప్ర‌భుత్వం వ‌డోద‌ర ప్రాంతంలో సుమారు 965 చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లాన్ని కానుక‌గా ఇచ్చింది. ఆయ‌న ప్ర‌తిభ‌కు ఇది కానుక అని అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. అప్ప‌టి సీఎం ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నే!. అయితే.. కేటాయింపుల‌కు సంబంధించిన జీవోను ఇవ్వ‌లేదు. ఇక‌, అప్ప‌టికి ప‌ఠాన్ రాజ‌కీయాల్లోకి రాలేదు. దీంతో ఈ వ్య‌వ‌హారం అలా ఉండిపోయింది. కానీ, ఈ స్థలం విష‌యం మాత్రం వివాదంగా మారింది. ఎప్పుడైతే.. ప‌ఠాన్ తృణ‌మూల్ కాంగ్రెస్ పంచ‌న చేరిపోయారో.. గుజ‌రాత్‌లోని బీజేపీ ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంది.

ఈ స్థ‌లం ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చిచెప్పింది. దీంతో యూస‌ఫ్ హైకోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. పైగా అత‌నిపై `క‌బ్జాకోరు` అనే ముద్ర ప‌డింది. క‌ట్ చేస్తే.. తాజాగా యూస‌ఫ్ ప‌ఠాన్‌.. తృణ‌మూల్‌ను వ‌దిలేసి.. బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. ఇది జ‌రిగిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న‌కు అనుకూలంగా గుజ‌రాత్‌లోని బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. స‌ద‌రు స్థ‌లాన్ని.. ఆయ‌న‌కు కేటాయిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిపై ఎలాంటి వివాదాలు లేవ‌ని పేర్కొంటూ వ‌డోద‌ర క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ ప‌రిణామాల‌పై నెటిజ‌న్లు స్పందిస్తూ.. రాజకీయాలు దిగ‌జారిపోవ‌డానికి ఇంత‌కన్నా ఏమీ మిగ‌ల్లేద‌ని పెద‌వి విరుస్తున్నారు.