బైక్ వెనుక కూర్చొని.. వైసీపీ యువనేతను గొంతు కోసి చంపేశారు
అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ఒకరిని దారుణంగా హత్య చేసిన వైనం సంచలనంగా మారింది.
By: Garuda Media | 25 Sept 2025 9:22 AM ISTఅనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ఒకరిని దారుణంగా హత్య చేసిన వైనం సంచలనంగా మారింది. పక్కా ప్లాన్ తో బైక్ వెనుక కూర్చొని.. గొంతో కోసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం గ్రామ పొలిమేర ప్రాంతంలో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. 34 ఏళ్ల సతీష్ రెడ్డి జీ కొట్టాల వాసి. పామిడిలో తన పని ముగించుకొని రాత్రి వేళలో టూవీలర్ మీద ఇంటికి వస్తుండగా.. అతడి గొంతు కోసి చంపినట్లుగా పేర్కొన్నారు.
బికొట్టాలకు చెందిన దేవన కాశీ విశ్వనాథ్ రెడ్డికి ముగ్గురు కొడుకులు. వ్యవసాయం చేసే అతడికి సతీష్ రెడ్డి చిన్నకొడుకు. బీటెక్ చదివి.. ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటాడు. తన అన్నతో కలిసి 30 ఎకరాల్లో చినీతోట,. వేరుశెనగ పంటల్ని సాగు చేస్తుంటాడు. స్థానికంగా ఎవరితోనూ విభేదాలు లేని సతీశ్ ను ఇంత దారుణంగా చంపేయటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.
ఎవరో సతీశ్ బైక్ వెనుక కూర్చొని గొంతుకోసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎడమ వైపు వెళ్లాల్సిన దానికి బిన్నంగా కుడివైపున ఉండటం.. సతీశ్ పడిపోయిన చెప్పులు వేర్వేరుచోట పడి ఉండటంపలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మత్యనే వైసీసీ కేంద్ర కార్యాలయంలో అతడ్ని రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యనే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఎంతో సంతోషంగా ఉన్న అతడు.. హత్యకు గురి కావటం సంచలనంగా మారింది
