Begin typing your search above and press return to search.

మాజీ సీఎం కొడుక్కి వైసీపీ షాక్ ఇస్తుందా ?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకట గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేసి కూటమి ప్రభంజనంలో ఓటమి పాలు అయ్యారు నిజానికి ఆయన 2019 ఎన్నికలకు ముందే పార్టీలో చేరారు.

By:  Raja Ch   |   19 Aug 2025 9:32 AM IST
మాజీ సీఎం కొడుక్కి వైసీపీ షాక్ ఇస్తుందా ?
X

వైసీపీలో చాలా మంది నాయకులు సైలెంట్ గా ఉంటున్నారు. మరి కొందరు నాయకులు జనంలో ఉండాలని అనుకున్నా వారి బలం చాలడం లేదు. రాజకీయ పలుకుబడితోనే జనంలో దూసుకుని పోవాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అదే విధంగా సామాజిక లెక్కలు కూడా చూస్తోంది. ఇప్పటిదాకా చూస్తే ఒక ఎత్తు ఆ మీదట మరో ఎత్తు అన్నది వైసీపీలో వినిపిస్తున్న మాట కేవలం జగన్ ఇమేజ్ మాత్రమే సరిపోదు అన్నది 2024 ఎన్నికలు నిరూపించాయని అంటున్నారు. అందుకే బలమైన నాయకులను ప్రతీ నియోజకవర్గంలో ఎంపిక చేసి మరీ వారికి బాధ్యతలు ఇస్తూ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.

నేదురుమల్లికి నో :

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకట గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేసి కూటమి ప్రభంజనంలో ఓటమి పాలు అయ్యారు నిజానికి ఆయన 2019 ఎన్నికలకు ముందే పార్టీలో చేరారు. అయితే ఆ సీటుని ఆనం రామనారాయణ రెడ్డి కి ఇచ్చి నేదురుమల్లిని అలా ఉంచేశారు. అపుడే కనుక టికెట్ ఇచ్చి ఉంటే రామ్ కుమార్ రెడ్డి నెగ్గి ఉండేవారు అంటారు అనుచరులు. ఇక చూస్తే కనుక ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ తరఫున సీఎం గా పనిచేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడే రామ్ కుమార్ రెడ్డి. ఆయన దూకుడుగా రాజకీయం చేయలేకపోతున్నారు అని భావించి ఇలా మార్పు చేస్తున్నారు అని అంటున్నారు.

వెంకటగిరి రాజా ఫ్యామిలీతో :

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి రాజా కుటుంబం మీద వైసీపీ ఫోకస్ ఉంది అని అంటున్నారు. పూర్వాశ్రమం నుంచి వారు జమీందార్లు. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు. దాంతో ఆ కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి సీటు ఇస్తే కచ్చితంగా గెలవగలమని వైసీపీ అధినాయకత్వం లెక్క వేసుకుంటోంది అని అంటున్నారు. అంతే కాదు టీడీపీకి అక్కడ గట్టి పోటీ ఇచ్చి ఓడించాలంటే నేదురుమల్లి మార్పు అవసరం అని భావిస్తున్నారుట.

పాత వారి మీద చూపు :

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా మంది పాత నాయకులు ఉన్నారు వారిలో కొందరు వైసీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్ళారు మరి కొందరు అనాసక్తిగా ఉన్నారు. ఇతర పార్టీలలోకి వెళ్ళిన వారు ఎంతటి వారు అయినా తీసుకోరాదు అన్నది వైసీపీ అధినాయకత్వం ఒక గట్టి నిబంధన పెట్టుకుందిట. అందువల్ల పాత వారిని రాజకీయంగా కొంత దూరం పాటిస్తున్న వారిని వెనక్కి రప్పించి చేర్చుకుంటే వీక్ గా ఉన్న చోట బలం వస్తుంది అని పార్టీ భావిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.