కూటమిని తక్కువ అంచనా వేస్తే.. మళ్లీ మునకే.. !
సో.. ఈ నేపథ్యంలో కూటమిని తక్కువగా అంచనావేసి.. ఒంటరి పోరుకు వెళ్లొద్దని నాయకులు కోరుతున్నారు.
By: Garuda Media | 23 Jan 2026 9:00 PM IST``కూటమిని తక్కువగా అంచనా వేసి.. నష్టపోయాం`` ఈ మాట వైసీపీ నాయకుల్లో చాలా మంది 2024 ఎన్నికల తర్వాత.. చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికీ చాలా మంది నాయకులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఒక్కరిగా వస్తే.. ఉండే బలానికి నలుగురు కలిస్తే ఉండే బలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదే 2024 ఎన్నికల్లో జరిగింది. అప్పటికే వైసీపీ పాలనపై వ్యతిరేకతతో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు చేతులు కలిపాయి. ఇది ఆ పార్టీకి నష్టాన్ని తెచ్చింది.
ఇక.. ఇప్పుడు కూడా ఆయా సామాజిక వర్గాల్లో చిన్న పాటి వివాదాలు.. విభేదాలు ఉన్నా.. మరోసారి ఐక్యత కోల్పోయే దిశగా అయితే లేవు. ఇది వైసీపీకి పెను ప్రమాదంగా మారనుంది. దీనిని అంచనా వేయడంలో వైసీపీ తలకిందలు అవుతోంది. అంతా తమకు అనుకూలంగా ఉందని అనుకోవడం అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి కానీ.. వాస్తవాన్ని గ్రహించేందుకు ముందుకు రావు. గతంలోనూ ఇప్పుడు కూడా వైసీపీ ఇలానే చేస్తోంది.
ఇప్పుడు వైసీపీకి కావాల్సింది..ఒంటరి పోరు కాదన్న అభిప్రాయం చాలా మంది పార్టీ నాయకుల్లో వినిపి స్తోంది. చేతులుకలిపేందుకు రెడీగా ఉన్న కమ్యూనిస్టులు సహా.. చిన్నా చితకా పార్టీలతో ముందుకు సాగితే.. అప్పుడు బలమైన కూటమిని ఎదుర్కొనే శక్తి వస్తుందని అంటున్నారు. మహా అయితే.. ఆయా పార్టీలకు అన్నీ కలిపి ఓ 25 సీట్లు వదులుకున్నా.. మిగిలిన వాటిలో పోటీ చేసేందుకు అవకాశం ఉంటుం ది. పాదయాత్ర ప్రభావం కొనసాగిన 2019లోనూ 24 సీట్లను పార్టీ ఎలానూ ఓడిపోయింది.
సో.. ఈ నేపథ్యంలో కూటమిని తక్కువగా అంచనావేసి.. ఒంటరి పోరుకు వెళ్లొద్దని నాయకులు కోరుతున్నారు. ఇక, కూటమి ప్రభావానికి వస్తే.. బలమైన నాయకుడిగా ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ ఉన్నారు. మరోవైపు.. యువశక్తి, మెగా అభిమానులు, కమ్మసామాజిక వర్గం ఎన్నారైలు.. ఇలా.. కొంత వరకు కూటమి బలం ఎక్కడా తగ్గలేదు. పైగా.. వైసీపీని రాకుండా చేసేందుకు అంటూ కొన్ని పార్టీలు వస్తున్నా యి. ఈ నేపథ్యంలో కర్ర విడిచి సాము చేయకుండా.. వాస్తవాల నేపథ్యంలో ముందుకు సాగితే బెటర్ అన్నది సూచన.
