Begin typing your search above and press return to search.

నేత‌ల హామీ: నాడు.. వైసీపీ చేసిందేంటి.. !

ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ నాయ‌కులు ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. ట్రోల్స్ చేస్తున్న విష యం తెలిసిందే.

By:  Garuda Media   |   12 May 2026 7:00 AM IST
నేత‌ల హామీ: నాడు.. వైసీపీ చేసిందేంటి.. !
X

ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ నాయ‌కులు ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. ట్రోల్స్ చేస్తున్న విష యం తెలిసిందే. తాజాగా.. పిఠాపురం వ‌ర్మ‌కుసంబంధించిన విష‌యాన్ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నా రు. గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర్మ సీటును జ‌న‌సేన‌కు కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం కోసం.. వ‌ర్మ కృషి చేశారు. 70 వేల ఓట్ల‌కు పైగా మెజారిటీతో నాడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు గుర్రం ఎక్కారు.

ఈ క్ర‌మంలో త‌న టికెట్‌ను త్యాగం చేసిన వ‌ర్మ‌కు.. చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ, అనూహ్య‌, అనివార్య కార‌ణాల‌తో చంద్ర‌బాబు ఇచ్చిన హామీని అమ‌లు చేయ‌లేక పోయార‌న్న‌ది వాస్త‌వం. ఇక‌, ఇటీవల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బాధ్య‌త‌ల నుంచి కూడా వ‌ర్మ‌ను పక్క‌న పెట్టారు. అయితే.. ఇక్క‌డే మ‌రో కీల‌క విష‌యం ఉంది. పార్టీ ఇంచార్జ్ బాధ్య‌త‌ల నుంచివ‌ర్మ‌ను త‌ప్పించినా.. ఆయ‌న‌కు రాష్ట్ర పార్టీ ఉపాధ్య‌క్ష ప‌ద‌విని ఇచ్చారు. అంటే.. పార్టీ ప‌రంగా వ‌ర్మ‌కు ఇంకా మెరుగైన అవ‌కాశ‌మే ఉంది.

కానీ, వైసీపీ నాయ‌కులు మాత్రం వ‌ర్మ‌కు ఏదో అన్యాయం జ‌రిగిపోయింద‌ని.. చంద్ర‌బాబు మాట ఇచ్చి కూడా త‌ప్పార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మ‌ని అనుకున్నా.. గ‌తంలో వైసీపీ కూ డా ఇలానే చేసింద‌న్న విష‌యాన్ని ఆ పార్టీ నాయ‌కులు గుర్తించాల్సి ఉంటుంది. చిల‌కలూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో పోటీ చేయాల‌ని భావించిన మ‌ర్రి రాజశేఖ‌ర్ టికెట్‌ను లాక్కుని విడ‌ద‌ల ర‌జ‌నీకి ఇచ్చారు. నిజానికి ఇప్పుడు పిఠాపురం తీసుకోవ‌డం వెనుక టీడీపీకి కూట‌మి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

కానీ.. నాడు ఏ ప్ర‌యోజ‌నాలు ఆశించి వైసీపీ మ‌ర్రిని త్యాగం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టింది.? అనే ప్ర‌శ్న‌కు స‌మా ధానం లేదు. ఇక‌, ఆ నాడు.. జ‌గ‌న్ కూడా.. మ‌ర్రికి ఎమ్మెల్సీ స‌హా.. మంత్రి ప‌ద‌విని కూడా ఆఫ‌ర్ చేశారు. నిజానికి చంద్ర‌బాబు వ‌ర్మ‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్ప‌లేదు. కానీ, ఆనాడు మ‌ర్రికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్నారు. మ‌రి అధికారంలోకి వ‌చ్చాక ఏం జ‌రిగింది? ఇచ్చారా? అంటే.. నాలుగున్నరేళ్ల‌పాటు మ‌ర్రిని ముప్పుతిప్ప‌లు పెట్టారు. చివ‌ర‌కు.. కమ్మ సామాజిక వ‌ర్గం ఓట్లు పూర్తిగా డొల్ల అవుతున్నాయ‌ని గుర్తించి.. అప్పుడు ఇచ్చారు. సో..నాడు చేసిన విష‌యాన్ని మ‌రిచిన వైసీపీ ఇప్పుడు టీడీపీకి వంక‌లు పెడుతుండ‌డ‌మే చిత్రం.