Begin typing your search above and press return to search.

లోకేష్ చుట్టూ అల్లుకున్న వైసీపీ వ్యూహం

నారా లోకేష్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెండోసారి మంత్రి. గతంలో టీడీపీ హయాంలో రెండేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు.

By:  Satya P   |   27 Sept 2026 10:00 AM IST
లోకేష్ చుట్టూ అల్లుకున్న వైసీపీ వ్యూహం
X

నారా లోకేష్ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రెండోసారి మంత్రి. గతంలో టీడీపీ హయాంలో రెండేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. ఆనాడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇపుడు మంగళగిరి నుంచి బంపర్ మెజారిటీతో గెలిచి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించారు. అంతే కాదు ఆయన కూటమి ప్రభుత్వంలో అత్యంత ముఖ్య భూమిక పోషిస్తున్నారు. చంద్రబాబు పవన్ తో పాటు లోకేష్ పేరు కూడా ఉంటోంది. అలా కూటమికి ముగ్గురూ రధ సారధులుగా సాగుతున్నారు అన్న పేరు అయితే వచ్చింది. ఇక టీడీపీలో లోకేష్ పాత్ర చాలా ప్రాధాన్యత తో కూడుకున్నది. ఆయన జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఒక విధంగా పార్టీ మొత్తం బాధ్యతలను ఆయన తన భుజ స్కందాల మీద వేసుకున్నారని అంటున్నారు.

రెండెళ్ళలోనే :

ఇక లోకేష్ ఇమేజ్ అన్నది కూటమి ప్రభుత్వంలో బాగా ఉంది. ఆయన రాజకీయం కూడా రాటు తేలుతోంది. చంద్రబాబు సీఎం గా ఉన్నా డైనమిక్ లీడర్ గా లోకేష్ సత్తా చాటుతున్నారు. సాధారణంగా చంద్రబాబు వంటి వట వృక్షం ఉన్న చోట మరో నీడ కూడా కనిపించదని అంటారు. కానీ లోకేష్ సైతం తండ్రితో సమానంగా రాణిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నపుడు ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ నుంచి ఫ్యూచర్ ఆఫ్ ఏపీగా లోకేష్ తన రాజకీయ ప్రస్థానాన్ని వేగంగా సాగిస్తున్నారు అని అర్థం అవుతోంది. ఈ నేపధ్యంలో లోకేష్ మీద వైసీపీ బాణాలు వేస్తోంది. సహజంగానే విపక్ష రాజకీయం అలాగే ఉంటుంది. కానీ మరింతగా కార్నర్ చేస్తూ వైసీపీ లోకేష్ చుట్టూనే తన వ్యూహాలను అమలు చేయడం మీదనే చర్చ సాగుతోంది.

బీజేపీ తో దూరం :

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏపీలో కూటమి ఉంది. అక్కడా ఇక్కడా అధికారాన్ని టీడీపీ బీజేపీ పంచుకుంటున్నాయి. మరో వైపు చూస్తే కేంద్ర పెద్దలు లోకేష్ పట్ల సానుకూల వైఖరితో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే పలు మార్లు ఏపీ పర్యటనకు వచ్చినపుడు లోకేష్ తో ఎంతో అభిమానంగా ఆదరణతో మాట్లాడడం అంతా చూస్తున్నారు. తన కుటుంబంతో సహా లోకేష్ ప్రధాని నివాసానికి వెళ్ళి కలసి వచ్చారు. ఈ క్రమంలో కేంద్ర బీజేపీ పెద్దల వద్ద లోకేష్ ఇమేజ్ ని తక్కువ చేయాలన్న వ్యూహాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అందుకే మెగా డీఎస్సీని వైసీపీ ఎంచుకుంది అని ఊహిస్తున్నారు.

గట్టిగానే పోరాటం :

లోకేష్ ఇపుడు బలమైన రాజకీయ నేతగా ఏపీలో వేగంగా ఎదుగుతున్నారు. రైజింగ్ పొలిటీషియన్ అన్నది కూడా ఆయన గురించి అంతా విశ్లేషిస్తున్న నేపథ్యం ఉంది. దాంతో వైసీపీ లోకేష్ ని గట్టిగానే టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. మెగా డీఎస్సీ పోరు ఆగేది కాదని ఆ పార్టీ చెబుతోంది. అవసరం అయితే జాతీయ స్థాయిలో కూడా ఉద్యమిస్తామని అంటోంది. ఇవన్నీ గమనించినపుడు లోకేష్ భావి సీఎం అన్న ట్యాగ్ తో ముందుకు సాగుతున్న జోరుకు బ్రేకులు వేయాలన్నది కూడా వైసీపీ పక్కా వ్యూహంగా ఉంది అని అంటున్నారు. లోకేష్ ని ఇబ్బందుల్లోకి నెడితే ఆ ప్రభావం కూటమి ప్రభుత్వం మీద కూడా పడుతుందని వైసీపీ ఊహిస్తోంది అని అంటున్నారు. ఇక కేంద్ర బీజేపీ పెద్దలకు ఏపీలో అవినీరి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం కూడా మరో ఉద్దేశ్యంగా కనిపిస్తోంది అంటున్నారు. అందుకే సీబీఐ విచారణ కోరడం గవర్నర్ ని కలవడం ఇవన్నీ అని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా దీనిని ప్రజల ముందు పెట్టి రాజకీయ లాభాన్ని అందుకోవాలని వైసీపీ చూస్తోంది అంటున్నారు. మొత్తం మీద వైసీపీ బహుళ విధాల ప్రయోజనాలతోనే లోకేష్ ని టార్గెట్ చేసింది అని అంటున్నారు.