Begin typing your search above and press return to search.

ఫ్లైటెక్కిన జగన్... వైసీపీ సైలెంట్ మోడ్

వైసీపీ విపక్షంలో ఉంటోంది. మరో నెల రోజులలో రెండేళ్ళ కాలం పూర్తి అవుతుంది. అధికార పక్షానికి సాధారణంగా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది.

By:  Satya P   |   27 April 2026 9:13 AM IST
ఫ్లైటెక్కిన జగన్...  వైసీపీ సైలెంట్ మోడ్
X

వైసీపీ విపక్షంలో ఉంటోంది. మరో నెల రోజులలో రెండేళ్ళ కాలం పూర్తి అవుతుంది. అధికార పక్షానికి సాధారణంగా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం చిత్రంగా ప్రతిపక్షం తన గ్రాఫ్ ని ఏ మాత్రం పెంచుకోలేకపోతోంది అని అంటున్నారు ప్రజల తరఫున గట్టిగా నిలబడి పోరాటాలు చేసిన సందర్భాలు కూడా పెద్దగా లేవని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే ఏపీలో అన్ని పెట్రోల్ బంకులలో అతి పెద్ద క్యూలు దర్శనం ఇస్తున్నాయి. డీజిల్ పెట్రోల్ కోసం జనాలు అల్లల్లాడుతున్నారు. మరో వైపు వేసవి వచ్చేసింది. దాంతో పాటు ఉన్న సమస్యలు ఉన్నాయి. అయినా విపక్షం జనం పక్షంగా బయటకు రాకపోవడం మీద చర్చ సాగుతోంది. దాంతో వైసీపీకి యాంటీ ఇంకెంబెన్సీ ఏర్పడుతోంది అని అంటున్నారు.

విదేశాలకు జగన్ :

ఇక జగన్ గడచిన రెండేళ్ళుగా బెంగళూరు టూ తాడేపల్లికి షటిల్ చేస్తున్నారు అన్నది ప్రత్యర్ధుల విమర్శ. అయినా సరే దానినే కొనసాగిస్తున్నారు అన్నది వైసీపీ వర్గాలలో ఉన్న అసంతృప్తి. అడపా దడపా తప్పించి జగన్ ఈ మధ్య కాలంలో ఎక్కడా బయట కనిపించడంలేదు. పార్టీ వర్గాలు సైతం ఆందోళనలు చేయడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. కేవలం కొందరు మాత్రమే మీడియా ముందుకు వస్తూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ మమ అనిపిస్తున్నారు అని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ లండన్ టూర్ పెట్టుకున్నారు ఆయన మే నెల మధ్య దాకా తిరిగి రారని అంటున్నారు.

పార్టీలో నైరాశ్యం :

వైసీపీలో చూస్తే నైరాశ్యం కనిపిస్తోంది. అధికార పార్టీ మీద వ్యతిరేకత పెంచేలా ప్రతిపక్షం చూడాలి. కాచుకుని కూర్చోవాలి. ఇక రెండేళ్ళు దాటుతున్న వేళ సహజంగా అధికారంలో ఉన్న ఎవరి మీద అయినా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. ఈ సమయంలో గేర్ మార్చాలసిన విపక్షం సైలెంట్ మోడ్ లో ఉంటోంది అని అంటున్నారు దానికి కారణం క్యాడర్ లో లీడర్ లో నిరాశ అని చెబుతున్నారు పార్టీ అధినాయకత్వం లో సీరియస్ నెస్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. పార్టీకి సరైన దిశా నిర్దేశం చేయడం ఎప్పటికప్పుడు నాయకత్వం తానుగా ముందుండి ఉద్యమాలు చేయడం పార్టీతో చేయించడం వంటివి అంతగా లేవని నిట్టూరుస్తున్నారు.

మూడు పార్టీలతో :

మరో వైపు చూస్తే మూడు పార్టీలతో కూటమి అత్యంత పటిష్టంగా ఉంది. కూటమిలో ఉన్న పార్టీలు పొరపొచ్చాలు లేకుండా ఐక్యంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తాయమి చెబుతున్నాయి. వ్యూహాలతో పాటు విపక్షాన్ని ఎక్కడికక్కడ వీక్ చేసే విధంగా కూటమి పెద్దలు ఎత్తులు వేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం విపక్షంలో ఉండి కూడా ఆ వేడి వాడి చూపించకుండా పూర్తి రిలాక్స్డ్ మూడ్ లో ఉండడమే ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పరిణామంగా చెబుతున్నారు అటు అసెంబ్లీకి వెళ్ళక ఇటు ప్రజా క్షేత్రంలో కనిపించకుండా వైసీపీ ఏపీ రాజకీయ తెర మీద ఎక్కడా సందడి చేయకుండా ఉంటే కూటమి మాత్రం అంతా సర్వాంతర్యామిగా దూసుకుని పోతోంది. వైసీపీలో జోరు ఎపుడు పెరుగుతుందో అపుడే ఏపీ పాలిటిక్స్ కి హీట్ పుట్టుకొస్తుందని విశ్లేషణలు ఉన్నాయి. అంత వరకూ ఇంతే సంగతులు అన్నట్లుగానే సీన్ ఉంది మరి.