Begin typing your search above and press return to search.

వైసీపీపై విలేజ్ టాక్ తెలిస్తే ...!

ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ ప‌రంగా నాయ‌కులు ఎలా ఉన్నా.. ఆన్‌లైన్ ఛానెళ్లు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో స‌ర్వేలు చేస్తున్నాయి.

By:  Garuda Media   |   13 Aug 2025 3:00 AM IST
వైసీపీపై విలేజ్ టాక్ తెలిస్తే ...!
X

వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో మంచిప‌ట్టుంద‌ని అంటారు. జ‌గ‌న్ హ‌యాంలో చేప‌ట్టిన రైతు భ‌రోసా కేంద్రా లు కానీ, నాడు-నేడు స్కూళ్లు, స‌చివాల‌యాల ఏర్పాటు, వ‌లంటీర్లు వంటివి గ్రామీణ ప్రాంతాల వ‌ర‌కు చేరాయి. దీంతో గ్రామీణులు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాకుండానే ఇంటి ద‌గ్గ‌రే అన్ని ప‌నులు అయిన నేప‌థ్యం లో త‌మకు పాజిటివిటీ పెరిగింద‌ని అంచ‌నా వేసుకుంది. దీనికి తోడు వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి హ‌వా కూడా త‌మ‌కు క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పుకొన్న విష‌యం తెలిసిందే. మ‌రి ఇప్పుడు ఎలా ఉంది? అనేది ప్ర‌శ్న‌.

ఈ వ్య‌వ‌హారంపై వైసీపీ ప‌రంగా నాయ‌కులు ఎలా ఉన్నా.. ఆన్‌లైన్ ఛానెళ్లు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో స‌ర్వేలు చేస్తున్నాయి. గ్రామీణుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాయి. అయితే.. ఈ స‌ర్వేల్లో చిత్ర‌మైన విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు వైసీపీని ఇంకా టార్గెట్ చేస్తున్నారు. ఎవ‌రిని క‌దిపినా.. `నాటి సంగ‌తులు ఎలా మ‌రిచిపోతాం` అని చెబుతున్నారు. ఇది.. స‌రైన విధానం కాద‌ని కూడా అంటు న్నారు. ప్ర‌ధానంగా వారికి పించ‌న్ల‌ను ఇంటి వ‌ద్దే అందించామ‌ని చెబుతున్నా.. ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కారు కూడా అదే ప‌నిచేస్తోంది.

ఇక‌, ఇత‌ర కార్య‌క్ర‌మాలు కూడా య‌థావిధిగా జ‌రుగుతున్నాయి. దీంతో వైసీపీలోటు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. అంతేకాదు.. ఒక‌ప్పుడు గ్రామాల్లో ఒక పార్టీకి చెందిన జెండాలే క‌నిపించాల‌ని.. అంద రూ గుండుగుత్త‌గా త‌మ‌కే మ‌ద్ద‌తు తెల‌పాల‌ని అనుకునేవారు. అలానే ఒత్తిళ్లు కూడా చేసేవారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా ఉండే భిన్న‌మైన రాజ‌కీయ చ‌ర్చ‌ల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. కానీ, కూట‌మి వ‌చ్చాక‌.. స్వేచ్చ‌గా పాలిటిక్స్ చేసుకుంటున్నామ‌ని చెప్పడం ఆశ్చ‌ర్యం అనిపిస్తోంది.

అంతేకాదు.. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విష‌యాన్ని గ్రామీణులు ఇంకా మ‌రిచిపోలేదు. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ ఫొట‌లతో ఉన్న ప‌ట్టాలు ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున ర‌చ్చ రేగింది. ఇదే వైసీపీకి గ్రామీణ ఓటు బ్యాంకును దూరం చేసింది. అయితే.. దీనిపై ఇప్ప‌టికీ వారు ఆగ్ర‌హంతోనే ఉన్నారు. ఇక‌, కేంద్రం అమ‌లు చేసిన ల్యాండ్ స‌ర్వే విష‌యంపై కూడా.. వైసీపీ త‌న ముద్ర వేసుకుని చేయ‌డంతో ఇది ఆ పార్టీకి మ‌రింత మైన‌స్‌గా మారింది. ఇవ‌న్నీ ఇంకా గ్రామీణుల మ‌న‌సు నుంచి తొలిగిపోక పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బట్టి వైసీపీ త‌న పంథాను మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.