Begin typing your search above and press return to search.

హాట్ వార్నింగ్...వైసీపీకి బూమరాంగ్ ?

వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు 2029లో అధికారంలోకి వస్తే తమను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. డిజిటల్ బుక్‌లో పేర్లు నమోదు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నా, ప్రజల్లో మాత్రం కక్ష సాధింపు రాజకీయాలపై చర్చకు దారితీస్తున్నాయి. అభివృద్ధి అజెండాతో ప్రజల ముందుకు రావడమే వైసీపీకి మేలని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

By:  Satya P   |   16 Nov 2026 9:56 AM IST
హాట్ వార్నింగ్...వైసీపీకి బూమరాంగ్ ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ మాజీ మంత్రులు కీలక నేతలు అంతా ఒక్కటే మాట అంటున్నారు. వైసీపీ క్యాడర్ ని ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని తమ ప్రభుత్వం వస్తే చర్యలు ఘాటుగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. వైసీపీ డిజిటల్ బుక్ ని కూడా ఏర్పాటు చేసింది. తమ మీద ఎవరైతే దాడులు చేసి ఇబ్బంది పెడతారో వారి పేర్లను నమోదు చేసి తాము అధికారంలోకి వస్తే తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అంటోంది. ఇది చెప్పడానికి వైసీపీ నేతలలో క్యాడర్ లో బూస్టింగ్ కలగచేయడానికి బాగానే ఉంటోంది. కానీ జన సామాన్యంలోకి వేరే సౌండ్ వెళ్తోంది అని అంటున్నారు.

అధికారం ఎందుకోసం :

ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం ఎందుకు కోరుకుంటుంది అన్నది చూస్తే ప్రజలకు మేలు చేయాలని జవాబు వస్తుంది. తాము ఫలానా పధకాలు ఇస్తామని ప్రాజల జీవన ప్రమాణాలు మెరుగు పరుస్తామని తమ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ ఇది అని ఇలా అనేక రకాలుగా జనాలకు చెప్పి మెప్పించి ఒప్పించి అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ వైసీపీ విషయం చూస్తే 2029 లో అధికారంలోకి వస్తే రాజకీయ ప్రత్యర్థుల సంగతి తేలుస్తామని అంటోంది. అలాగే తమను ఇబ్బందుల పాలు చేసిన అధికారులు పోలీసులు రిటైర్ అయినా దేశాలు దాటినా సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే తెచ్చి మరీ చట్ట ప్రకారం శిక్షిస్తామని అంటోంది. ఇక్కడ చట్ట ప్రకారం అన్న మాట వాడటం వరకూ వైసీపీ జాగ్రత్త పడినా ఈ శిక్షలు ఏమిటి అన్నది జనంలో అయితే చర్చగా పోతోంది అని అంటున్నారు.

కక్ష సాధింపులేనా :

ఆ పార్టీ వస్తే ఈ పార్టీ నేతల అరెస్టులు, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారలు లూప్ లైన్ లోకి నెట్టడం, అలాగే తమ అధికార హవా చూపించడం, దూకుడుగా రాజకీయం చేయడం ఇలాగే సాగుతోంది. జనాలు ఇదేనా కోరుకుంటారు అన్నది అతి పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది. రాజకీయాల్లో ప్రత్యర్ధులుగా ఉన్న పార్టీలు విధానపరమైన అంశాలలో పోటీ పడాలి, వారి కంటే మేము ఇంకా ఎక్కువ మేలు చేస్తామని చెప్పాలి. అలా జనం వద్ద మంచి మార్కులు కొట్టేయాలి. కానీ వారు రెడ్ బుక్ అంటే మేము డిజిటల్ బుక్ ని తెస్తామని చెబుతూంటే జనాలకు ఇదేదో రోతగా ఉండదా అని కూడా చర్చ సాగుతోంది.

సీనియర్ నేతలు సైతం :

ఇక చూస్తే సీనియర్ నేతలు సైతం ఇదే రకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే చుక్కలు చూపిస్తామని తాజాగా విజయనగరం వైసీపీ సమావేశంలో మాట్లాడుతూ గట్టిగానే చెప్పారు. ఇపుడున్న రాజకీయం సరిపోదని మైండ్ సెట్ మార్చుకోవాల్సిందే అన్నారు. అలాగే స్థానిక ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆవేశంతో చేసిన కామెంట్స్ కూడా చర్చకు వచ్చాయి. తమ ప్రభుత్వం వస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఇలా వైసీపీ నేతలు ఇస్తున్న వార్నింగులు క్యాడర్ కి అయితే నూరు శాతం హుషారు ఇస్తున్నాయి, ఇందులో సందేహం అయితే లేదు, కానీ అదే సమయంలో జనసామాన్యంలో మాత్రం ఎంతసేపూ కక్షలేనా అన్న మాట వినిపిస్తోంది.

అభివృద్ధి అజెండాతో :

ఇక ఎన్నికలు చూస్తే రెండున్నరేళ్ళ వ్యవధిలోకి వచ్చేశాయి. వైసీపీ కూడా అభివృద్ధి అజెండాతో జనం ముందుకు రావాలని కోరుతున్నారు. అలాగే తాము ఏమి చేస్తామన్నది కూడా చెప్పుకోవాలని అంటున్నారు. ఏపీ చూస్తే ఈ రోజుకీ అనేక రకాలైన నష్టాలతో కష్టాలతో ఉంది. విభజన గాయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రజలు అయితే మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నారు. వైసీపీ వరకూ చూస్తే రాజకీయంగా తమను ఇబ్బంది పెడుతున్న ప్రత్యర్థుల మీద విమర్శలు చేయవద్దని ఎవరూ అనడంలేదు. అదే సమయంలో ప్రజలకు కూడా తాము ఏమి చేస్తామో చెబుతూ ఉంటే ఆ పార్టీకే మేలు అని అంటున్నారు.