Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేల సంగతి తేల్చేస్తారా ?

అయితే వీరిని విచారించేందుకు స్పీకర్ పిలుస్తున్నారు. మరి వీరు విచారణలో ఏమి చెబుతారో చూడాల్సి ఉంది. వీరు తాము మనస్పూర్తిగా రాజీనామాలు చేశామని ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పారు.

By:  Satya P   |   21 Feb 2026 4:00 AM IST
వైసీపీ ఎమ్మెల్యేల సంగతి తేల్చేస్తారా ?
X

వైసీపీకి రాజీనామా చేసిన అయిదురుగు ఎమ్మెల్సీలకు శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ అయిదురుగు తమ సమక్షంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని జయ మంగళం వెంకటరమణకు నోటీసులు ఇస్తే 26న హాజరు కావాలని కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ లకు నోటీసులు ఇచ్చారు.

కోర్టు దాకా విషయం :

ఇదిలా ఉంటే ఈ అయిదురుగు ఎమ్మెల్సీలు వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే 2024 లో వరుసగా రాజీనామాలు చేశారు. అంతే కాదు పార్టీకి సైతం గుడ్ బై కొట్టారు. ఇక నాటి నుంచి వీరి రాజీనామాలు అన్నీ చైర్మన్ వద్ద పెండింగులో ఉన్నాయి. తమ రాజీనామాలు ఆమోదించాలని వీరంతా కోరుతూ వచ్చారు ఇక జయ మంగళం వెంకట రమణ లాంటి వారు అయితే కోర్టుకు సైతం వెళ్ళారు దాంతో కోర్టు కూడా వీరి విషయం చూడాలని కోరింది.

క్లారిటీ వస్తుందా :

అయితే వీరిని విచారించేందుకు స్పీకర్ పిలుస్తున్నారు. మరి వీరు విచారణలో ఏమి చెబుతారో చూడాల్సి ఉంది. వీరు తాము మనస్పూర్తిగా రాజీనామాలు చేశామని ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. అయితే ఇటీవల జయమంగళం వెంకట రమణ అయితే జగన్ తనకు దేవుడు అన్నట్లుగా మాట్లాడారు. దాంతో అది సంచలనం అయింది. మరి ఆయన మనసు మార్చుకున్నారా లేదా అన్నది చూడాల్సి ఉంది. అలాగే మరి కొందరి విషయమో కూటమిలో సరైన ఆదరణ లేదని అంటున్నారు. దాంతో వారు ఏమైనా ఆలోచిస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఆమోదిస్తారా :

ఇక చైర్మన్ వారిని విచారించి వారి రాజీనామాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. అదే జరిగితే ఈ అయిదు సీట్లు ఖాళీ అవుతాయి. అపుడు వాటిలో ఎన్నికలు పెడితే తిరిగి కూటమికే ఆ సీట్లు వెళ్తాయి. ఎందుకంటే కూటమికే బలం ఉంది కాబట్టి అని అంటున్నారు. మరి ఈ విషయంలో ఇంత కాలం ఆగిన తరువాత ఇపుడు విచారణ అంటున్నారు అంటే వీరి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారా అని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక వీరి రాజీనామాలు కూడా ఆమోదిస్తే కనుక మరింత మంది కూడా వైసీపీ నుంచి రాజీనామాలు చేస్తారని ప్రచారం కూడా ఉంది. అలా శాసన మండలిలో వైసీపీని తగ్గించి తాము బలం పెంచుకోవాలని కూడా టీడీపీ కూటమి చూస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద అయితే ఈ నెల 25, 26 తేదీలలో ఏమి జరగబోతోంది అన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.