Begin typing your search above and press return to search.

జగన్ మెత్తబడ్డారుట.. మాజీలకు సింహ ద్వారమేనా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో చాలా పట్టుదలగా ఉంటారు అని చెబుతారు. అందులో తనను కాదని దూరం జరిగిన వారి విషయంలో అయితే ఆయన అసలు పట్టించుకోరని అంటారు.

By:  Satya P   |   7 July 2026 9:20 AM IST
జగన్ మెత్తబడ్డారుట.. మాజీలకు సింహ ద్వారమేనా ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో చాలా పట్టుదలగా ఉంటారు అని చెబుతారు. అందులో తనను కాదని దూరం జరిగిన వారి విషయంలో అయితే ఆయన అసలు పట్టించుకోరని అంటారు. వైసీపీ హిస్టరీ చూసినా అదే కనిపిస్తుంది. 2011లో వైసీపీని స్థాపించిన జగన్ తో ఆనాడు ఉన్న వారిలో చాలా మంది ఈనాడు కనిపించరు. దానికి కారణం వారు వివిధ కారణాల వల్ల వేరు పడిపోయినా తరువాత కాలంలో వస్తామని కబురు చేసినా వైసీపీ డోర్స్ క్లోజ్ చేసేశారు. అలా వైసీపీలో ఒక్కసారి ఎవరైనా బయటకు వెళ్తే ఇక అంతే సంగతులు అని కూడా చెబుతారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం వైసీపీ అధినాయకత్వంలో మార్పు కనిపిస్తోంది అని అంటున్నారు.

వస్తానంటే ఓకేనట :

వైసీపీ భారీ ఓటమిని 2024లో ఎదుర్కొన్న తరువాత పార్టీని వీడి ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు. ఇందులో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు ఉన్నారు. చూస్తే 2024 నుంచి 2025 దాకా ఇదే కధ నడచింది. ఒక ఏడాది పాటు వైసీపీ నుంచి వలసలు అలా సాగిపోయాయి. ఎవరినీ అదుపు చేయలేని పరిస్థితి ఉండేది. ఆఖరుకు రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి వంటి వారు కూడా వైసీపీని వీడారు. ఇది ఎవరూ అసలు ఊహించని విషయం. జగన్ తో 2011 నుంచి 2019 దాకా విపక్షంలో ఎనిమిదేళ్ళ పాటు కొనసాగిన వారు అంతా 2024లో ఓడిన వెంటనే వెళ్ళిపోయారు అంటే ఆలోచించాల్సిందే అని విశ్లేషణలు కూడా గట్టిగానే వినిపించాయి. అదే సమయంలో పోయిన వారు పోతారు, కొత్త వారు వస్తారు రాజకీయాల్లో ఇది సహజం అని వైసీపీ నేతలు కూడా అంటూ వచ్చారు.

చేరికలు లేవు ఎందుకో :

ఇక ఏపీలో వైసీపీ నెమ్మదిగా యాక్టివ్ అవుతోంది. జగన్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాతో మొదలెట్టి జిల్లా టూర్లకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. మరో వైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జగన్ నుంచి అంతా గట్టిగా చెబుతున్నారు. ఏపీలో మరో ఆల్టర్నేషన్ లేకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం పట్ల వచ్చే ఏ మాదిరి వ్యతిరేకత అయినా తమకే టర్న్ అవుతుందని వైసీపీ గంపెడాశలు పెట్టుకుంటోంది. దాంతోనే 2029 లో తమ విక్టరీ ఖాయమని చెబుతోంది. మరో విషయం ఏంటి అంటే ఏపీ ప్రజలు ప్రతీ ఎన్నికకూ అధికారంలో ఉన్న పార్టీని దించేస్తున్నారు. దాంతో ఈ పొలిటికల్ ట్రాక్ మీద వైసీపీ ధీమాగా ఉంది. అయితే వైసీపీలో గత రెండేళ్ళలో ఎవరూ చేరకపోవడంతో నీరసంగా ఉంది. ఒక విధంగా నిరాశలో కూడా ఉంది అని అంటున్నారు.

చాలా చోట్ల వీక్ గా :

ఇక చూస్తే మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో సగానికి పైగా చూస్తే వైసీపీకి సరైన నాయకత్వం లేదని అంటున్నారు. పార్టీ పరంగా ఇంచార్జిలను పెట్టి నడిపిస్తున్నా కూడా జనాలకు పార్టీని చేరువ చేయడంతో పాటు కూటమి మీద రాజకీయంగా పైచేయి సాధించలేకపోతున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీ ఆలోచనలలో మార్పు గణనీయంగా వచ్చింది అని అంటున్నారు. వైసీపీని వీడిపోయిన అనేక నియోజకవర్గాలలో ఆల్టర్నేషన్ లీడర్ షిప్ అన్నది లేకపోవడంతో వైసీపీ మాజీలను తిరిగి ఫ్యాన్ నీడకు పిలవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది అని ప్రచారం సాగుతోంది. వైసీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వారు కానీ ఏ పార్టీలో చేరకుండా న్యూట్రల్ గా ఉన్న వారు కానీ ఇతర పార్టీలలో చేరి సరైన స్థానం లేక సతమతం అవుతున్న వారి మీద వైసీపీ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. అలాంటి వారు వస్తామంటే మేము వద్దంటామా అని చేర్చుకోవడానికే వైసీపీ సిద్ధపడుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో ఒక మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా తొలి బోణీని కొట్టాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. మరి వైసీపీ లో వెల్ కం చెబితే చేరే నేతలు ఎవరు అన్నది చూడాల్సి ఉంది.