పవన్ సౌండ్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్స్ అంటేనే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ ఉంటాయి. అవి ఒక్కసారిగా వైరల్ అవుతాయి.
By: Satya P | 22 Jun 2026 9:47 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్స్ అంటేనే ఆయన సెన్సేషనల్ కామెంట్స్ ఉంటాయి. అవి ఒక్కసారిగా వైరల్ అవుతాయి. అంతే కాదు వైసీపీని ఆయన టార్గెట్ చేస్తే వైసీపీ నుంచి పది గొంతులు లేస్తాయి. ఇలా ఒక వారం పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా రెండూ కూడా షేక్ అయ్యేలా రీ సౌండ్ మోత మోగుతూనే ఉంటుంది. ఇక పవన్ ఆవేశపూరితంగా చెప్పే మాటలు ఆయన స్పీచ్ ని ఇష్టపడే వారు కూడా కోకొల్లలు. ఆయన ఎవరిని విమర్శిస్తున్నారు, ఏమి సందేశం ఇస్తున్నారు అనే కంటే ఆయన వెండితెర మీద ఒక పవర్ ఫుల్ స్టార్ కాబట్టి ఆయన ప్రసంగాలను కూడా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అందులో విషయం ఉన్నా కూడా వారు చూసేది పవన్ అనే ఒక సినీ ఇమేజ్ ఉన్న నేతను మాత్రమే.
ఆన్ కెమెరా అంటూ :
ఇదిలా ఉంటే కాకినాడలో పవన్ మన వూరు మాటా మంతీ కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ మీద నిప్పులు చెరిగారు. ఆయన ఒక హాట్ వార్నింగ్ కూడా వైసీపీకి ఇచ్చారు. అన్ కెమెరాలో చెబుతున్నాను అని తొక్కి నార తీస్తాను అని ఆయన చెబుతున్న మాటలు చేస్తున్న హెచ్చరికలను చూసి ఫ్యాన్స్ అయితే ఇది కదా పవన్ పవర్ అని అనుకుంటున్నారు. అంతే కాదు ఆయన వార్నింగ్ సౌండ్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని యాడ్ చేసి మరీ ఊచకోత అంటూ సోషల్ మీడియా మోతెక్కించేస్తున్నారు.
పవర్ ఫుల్ గానే :
ఇక పవన్ అయితే ఆన్ కెమెరా అంటూ చాలా పవర్ ఫుల్ గానే వార్నింగ్ ఇచ్చారు. సూటిగా స్పష్టంగా ఆయన చెప్పేది ఏంటి అంటే తన టార్గెట్ వైసీపీయే అని. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీని వదిలేది లేదని అన్నారు. వారిని అసలు స్పేర్ చేసేది లేదని అన్నారు. ఇలా పవన్ చేసిన హాట్ స్పీచ్ కానీ వార్నింగ్స్ కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజిలో వైరల్ అవుతున్నాయి.
వైసీపీ రియాక్షన్ :
మరో వైపు పవన్ తొక్కి నార తీస్తామన్న దానిని వైసీపీ నేతలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఇవన్నీ విన్నవే చూసినవే అని వారు అంటున్నారు. ఇక పవన్ మీద పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలు అయిన మాజీ ఎంపీ వంగా గీత అయితే అధికారంలో ఉన్నపుడూ లేనపుడూ వైసీపీ మీదనేనా అంటూ సున్నితంగా పవన్ మీద సెటైర్లు వేశారు. మీరు ప్రజలకు ఏమి చేశారో ముందు చెప్పుకోండి అని సూచించారు. పవన్ కి కుల భావన లేకపోతే పోయింది కానీ కులాన్ని తక్కువ చేసి చూడవద్దు అని ఆమె అన్నారు. పిఠాపురంలో ఎక్కువ మంది కాపులు ఉన్నారు కాబట్టే పవన్ అక్కడ పోటీ చేసేందుకు వచ్చిన సంగతి ఒక్కసారి మననం చేసుకోవాలని అన్నారు.
