Begin typing your search above and press return to search.

రాహుల్ కి వైసీపీ క్యాడర్ ఫిదా ?

కాంగ్రెస్ ని వ్యతిరేకించి వైసీపీని జగన్ స్థాపించారు. దాంతో నిన్నటిదాకా కాంగ్రెస్ ని ఆగర్భ రాజకీయ శత్రువు లాగానే వైసీపీ క్యాడర్ మొత్తం భావిస్తూ వచ్చింది.

By:  Satya P   |   9 Aug 2025 5:00 AM IST
రాహుల్ కి  వైసీపీ క్యాడర్  ఫిదా  ?
X

ఏపీలో చిత్ర విచిత్రమైన రాజకీయం సాగుతోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది విపక్షాలు. ఏపీలో అధికారంలో టీడీపీ జనసేన బీజేపీ మూడూ కలిసి ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం టీడీపీ జనసేనల మీదనే పోరాడుతోంది. బీజేపీని పక్కకు పెట్టిందని విమర్శలు ఉన్నాయి. ఎన్డీయేగా ఏపీలో ప్రభుత్వం ఉంటే దానికి జాతీయ స్థాయిలో వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉంది ఏపీలో అలాంటి బలమైన విపక్ష కూటమిని పెద్దన్నగా ఏర్పాటు చేయాల్సింది వైసీపీయే.

సోలోగానే అంటూ :

అయితే ఏపీలో వైసీపీ సోలోగానే అంటోంది 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు తమ బలాలను బలగాలను రంగంలోకి దించి భారీగా లబ్ది పొందాయి. కానీ వైసీపీ మాత్రం ఈ రాజకీయ లెక్కలను అసలు పట్టించుకోకుండా సొంతంగా పోటీ ఇచ్చింది. వైసీపీ బలం ఆ పార్టీ రుజువు చేసుకుంది. అలా 40 శాతం ఓటు షేర్ ని సాధించింది. కూటమి అయితే దాదాపుగా 58 శాతం ఓటు షేర్ ని అందుకుంది. ఈ రెండింటి మధ్య భారీ గ్యాప్ ఉంది. మరి దీనిని ఎలా భర్తీ చేసుకుంటారో వైసీపీ పెద్దలే ఆలోచించాలని అంటున్నారు.

రాహుల్ వైపుగా అట్రాక్షన్ :

రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అంతే కాదు 2024 ఎన్నికలలో భారీ ఎత్తున ఓట్ల దోపిడి జరిగింది అని ఆయన అణు బాంబునే పేల్చారు. దాంతో దేశంలోని విపక్ష శిబిరం అంతా బీజేపీ మీద ఈసీ మీద విరుచుకుపడుతున్నారు. ఏపీలో అయితే విపక్షంగా వైసీపీ ఉంది. ఈవీఎంలలో గోల్ మాల్ వల్లనే తమకు అధికారం పోయింది అన్న అనుమానాలు వైసీపీలోనూ ఉన్నాయి. మరి ఈ విషయంలో పరిశోధించి సాధించామని రాహుల్ చెబుతున్నారు. అభిప్రాయం ఒక్కటే అయినపుడు వైసీపీ నుంచి అదే రకమైన స్పందన రావాలి కదా అన్నదే చర్చ. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం రెస్పాండ్ అయినది లేదు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం రాహుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఫిదా అవుతోంది ఆయన చెప్పినది నూరు శాతం కరెక్ట్ అంటోంది.

మనసులు దోచారా :

కాంగ్రెస్ ని వ్యతిరేకించి వైసీపీని జగన్ స్థాపించారు. దాంతో నిన్నటిదాకా కాంగ్రెస్ ని ఆగర్భ రాజకీయ శత్రువు లాగానే వైసీపీ క్యాడర్ మొత్తం భావిస్తూ వచ్చింది. కానీ ఇపుడు చిత్రంగా రాహుల్ గాంధీ వైపుగా వైసీపీ క్యాడర్ మాట్లాడుతోంది అంటే ఇది కీలకమైన పరిణామమే అని అంటున్నారు. ఏపీలో ఎన్డీయేను వ్యతిరేకిస్తోంది వైసీపీ. అయితే అదే కూటమిలో ఉన్న బీజేపీ మీద రాహుల్ పోరాటం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారం పోవడానికి బీజేపీతో కలసి కూటమి పార్టీలు చేసిన ఎలక్షనీరింగ్ అన్న విమర్శలు కూడా వైసీపీ నుంచే ఉన్నాయి. దాంతోనే సహజంగా రాహుల్ గాంధీ లేవనెత్తీ పలు అభ్యంతరాల విషయంలో వైసీపీ మొగ్గు చూపుతోంది అని అంటున్నారు.

రాహుల్ జగన్ జోడీట :

సోషల్ మీడియాలో చూస్తే వైసీపీ అభిమానులు పెడుతున్న కామెంట్స్ సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించేలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో బలంగా ఉన్న టీడీపీ కూటమిని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలోకి వైసీపీ చేరాలని సూచిస్తున్న వారూ ఉన్నారు. రాహుల్ గాంధీ జగన్ జోడీ అయితేనే ఏపీలో కూటమిని సక్సెస్ ఫుల్ గా గద్దె దించగలవని అభిమానులు అంతా అంటున్నారు. ఎందుకంటే రెండు పార్టీల సిద్ధాంతాలు ఒక్కటి అయినపుడు ఈ కలయిక తప్పు లేదని అంటున్నారు.

ఇపుడు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ పెట్టాలని కోరుతున్న పార్టీలన్నీ లైక్ మైండెడ్ గా ఇండియా కూటమిలోనే ఉన్నాయి అని అంటున్నారు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ ఒంటరిగా ఉంటే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ ఏర్పాటు చేశాక ఫస్ట్ టైం కాంగ్రెస్ అగ్ర నాయకుడి మీద గాంధీల మీద వైసీపీ క్యాడర్ సానుకూలంగా రియాక్ట్ కావడం అంటే వైసీపీ పెద్దలు ఆలోచిచుకోవాల్సిన విషయమే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.