Begin typing your search above and press return to search.

ది డిబేట్‌: ఎన్నిక‌ల స్టంటుల‌కే వైసీపీ ప‌రిమిత‌మా.. ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. స‌మ‌యానికి త‌గిన విధంగా ముందుకు రావాలి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తమ‌కు ఆయుధంగా మార్చుకుని ముందుకు సాగాలి.

By:  Garuda Media   |   30 July 2026 9:00 PM IST
ది డిబేట్‌: ఎన్నిక‌ల స్టంటుల‌కే వైసీపీ ప‌రిమిత‌మా.. ?
X

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. స‌మ‌యానికి త‌గిన విధంగా ముందుకు రావాలి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తమ‌కు ఆయుధంగా మార్చుకుని ముందుకు సాగాలి. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ మైన‌స్ దారిలో ప‌య‌నిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. కేవ‌లం ఎన్నిక‌ల కోణంలోనే ఆ పార్టీ ఆలోచ‌న చేస్తోంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యానికి వచ్చే ప‌రిణామాలు వేరుగా ఉంటాయి. అప్ప‌టి ఉండే రాజ‌కీయాలు వేరేగా ఉంటాయి.

అవి వేరు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై.. దృష్టి పెడితే..ఆటోమేటిక్‌గానే వైసీపీకి మైలేజీ పెరు గుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కానీ, జ‌గ‌న్ మాత్రం ఎన్నిక‌ల స్టంటుల‌కే ప్రాధాన్యం ఇస్తున్నా ర‌న్న చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు రెండు ర‌కాలుగా ఉంటాయి. త‌క్ష‌ణ స‌మ‌స్య‌లు.. సుదీర్ఘ స‌మ‌స్య‌లు. త‌క్ష‌ణ స‌మ‌స్య‌ల‌పై పోరాడే పార్టీల‌పై ప్ర‌జ‌లు ఆశ‌లు పెట్టుకుంటారు. ఈ విష‌యంలో గ‌తంలో టీడీపీ స‌క్సెస్ అయింది.

ఇసుక విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న రేకెత్తించిన స‌మ‌యంలో చంద్ర‌బాబు స్వ‌యంగా రోడ్డెక్కారు. దీంతో త‌మ‌కంటూ.. ఒక నాయ‌కుడు ఉన్నార‌ని ప్ర‌జ‌లు భావించారు. ఇక‌, సుదీర్ఘ స‌మ‌స్య‌గా ఉన్న ర‌హ‌దారుల బాగుచేత అంశాన్ని సోష‌ల్ మీడియాకు ఎక్కించారు. అది కూడా ఫ‌లితాన్ని ఇచ్చింది. ఇలా.. స‌మ‌స్య‌ల‌ను వేరు చేసి.. ప్ర‌జ‌లు ఏస‌మ‌యంలో ఏది కోరుకుంటున్నార‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకునే వ్య‌వ‌స్థ‌లు రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి అవ‌స‌రం.

కానీ, జ‌గ‌న్ దీనిని వ‌దిలేశారు. త‌న‌కు స‌మ‌స్య‌గా ఉన్న వాటిని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లుగా ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. దీంతో తాను ప‌ట్టుకున్న దానిపైనే పోరాటం చేస్తున్నారు. ఇది పార్టీకి.. ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మైన‌స్ చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంటుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో భూముల రీస‌ర్వే.. విష‌యాన్ని వ‌దిలేశారు. తాగునీరు లేక అల్లాడుతున్న ప్రాంతాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇత‌ర మౌలిక స‌దుపాయాల స‌మ‌స్య‌ల‌ను, పింఛ‌న్లు, కొత్త రేష‌న్ కార్డులు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వీటిపై స్పందిస్తే.. అనూహ్య జ‌నాద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్న నాయ‌కుల సూచ‌న‌ల‌ను కూడా జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం. వీటిని వ‌దిలేసి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పైనే దృష్టి పెట్టి.. ముందుకు సాగుతున్నాయి. కానీ, అప్ప‌టికి ప‌రిణామాలు ఎలా మారుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.