జగన్ ఆ ఒక్క పని చేస్తే దెబ్బకు వైసీపీ సెట్ అవుతుందా ?
పార్టీ మొత్తం సీరియస్ గా పనిచేయాలన్నా వారిలో చురుకుదనం పుట్టాలన్నా యాక్టివిటీస్ పెరగాలి అని అన్నా కూడా జగన్ తాడేపల్లిలో పూర్తిగా ఉండడం బెటర్ అని అంటున్నారు.
By: Satya P | 29 Oct 2025 7:00 AM ISTవైసీపీ ఓటమి తరువాత నెలలు అలా దొర్లుకుంటూ పోతున్నాయి. మరో పన్నెండు రోజులలో 17 నెలలు నిండి 18 లోకి కూటమి ప్రభుత్వం అడుగు పెడుతోంది. అంటే అచ్చంగా ఏణ్ణర్ధానికి చేరువ అవుతోంది అన్న మాట. మరి ఆరు నెలలు ఏ పార్టీకైనా హానీమూన్ పీరియడ్ అని అంటారు. అది గెలిచిన పార్టీకైనా ఓడిన పార్టీకైనా అన్నది విశ్లేషిస్తారు. ఓటమి చెందిన పార్టీ రీబ్యాక్ కావాలీ అంటే కచ్చితంగా తగిన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దాంతో పాటు ఒక సీరియస్ నెస్ కూడా కనిపించాలని అంటున్నారు.
బెంగ పడుతున్న క్యాడర్ :
జగన్ చూస్తే ఓటమి తరువాత బెంగళూరులోనే ఉంటున్నారు. ఆయన బెంగళూరు టూ తాడేపల్లికి వస్తున్నారు. అది కూడా వారంతంలో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక విధంగా చూస్తే గతంలో కూటమి నేతలను విమర్శిచిన చందంగానే ఇపుడు వైసీపీ అధినేత వ్యవహార శైలి ఉందని అంటున్నారు. హైదరాబాద్ నుంచి వారు వచ్చి వీకెండ్ కి తిరిగి వెళ్ళిపోయేవారు అని అంటున్నారు. అలాగే జగన్ కూడా బెంగళూరు లో ఉంటున్నారు అని అంటున్నారు. ఇది భౌతికంగా ఎక్కడ ఉంటున్నారు అన్నది ప్రశ్న కానే కాదని క్యాడర్ మనసులో గూడు కట్టుకున్న ఒక బెంగ అని అంటున్నారు. తమ అధినేత ఏపీలో ఉండడం లేదన్నది వారిలో గట్టిగా ఉన్న భావన అని చెబుతున్నారు. దాంతో క్యాడర్ ఎంతో కొంత డీ మోరలైజ్ అవుతున్నారు అని అంటున్నారు.
సీరియస్ గా ఉండాలంటే :
పార్టీ మొత్తం సీరియస్ గా పనిచేయాలన్నా వారిలో చురుకుదనం పుట్టాలన్నా యాక్టివిటీస్ పెరగాలి అని అన్నా కూడా జగన్ తాడేపల్లిలో పూర్తిగా ఉండడం బెటర్ అని అంటున్నారు. ఎందుకు అంటే జగన్ కనుక అక్కడ ఉంటే అన్న అన్నీ చూస్తున్నారు వింటున్నారు అన్నది వారిలో ఏర్పడి ఎక్కడికక్కడ దూకుడుగా పనిచేయడానికి ఉంటుందని అంటున్నారు. అంతే కాదు తాము ఏ విధంగా జోరు చేసినా చూసుకోవడానికి కాచుకోవడానికి అధినాయకుడు తమతోనే ఉన్నారు అన్న మానసిక భావన ఒక రకమైన ధైర్యం కూడా వారిలో కలుగుతుందని అంటున్నారు. జగన్ ఒరిజినల్ డైలాగ్ అయిన నేను ఉన్నాను నేను విన్నాను అన్నది కూడా ఈ విధంగా సార్ధకం అవుతుంది అని అంటున్నారు
జనాలలోనూ :
ఇక జనాలలో కూడా ఒక సానుకూల భావన ఉంటుందని అంటున్నారు. ప్రజలు కూడా ప్రతిపక్ష నాయకుడు తమతో ఉంటున్నారు అని తమ బాధలు కష్టాలు చెప్పుకోవచ్చు అన్న భరోసాతో ఉంటారని అంటున్నారు. ఇక ఏపీలోనే నిరంతరం ఉండడం వల్ల సమయలను నేరుగా అడ్రస్ చేయవచ్చునని అనుక్షణం ప్రజల విషయంలో పోరాడేందుకు కూడా ఆస్కారం ఉంటుందని పైపెచ్చు అధికార పక్షం చేసే విమర్శలకు కూడా తగిన జవాబు ఇచ్చినట్లు అవుతుంది అని అంటున్నారు.
ఫోకస్ ఇంకా ఎక్కువ :
అధినాయకుడు తాడేపల్లి లో ఉంటూ నిరంతరం పార్టీ క్యాడర్ ని కలుస్తూ గ్రౌండ్ లెవెల్ లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా ప్రజా దర్బార్ లాంటివి నిర్వహించి ప్రజలతో కూడా భేటీలు అవుతూ ఉంటే వైసీపీ గ్రాఫ్ మెల్లగా పెరుగుతుందని అంటున్నారు. ఆ తరువాత జనంలోకి వెళ్ళడం ఉద్యమాలు చేయడం అన్నది ఎటూ ఉంటుంది కానీ ముందుగా క్యాడర్ ని జనాలను కలవాలంటే అనుక్షణం టచ్ లో ఉన్న ఫీలింగ్ కలిగించాలంటే జగన్ బెంగళూరు ని వీడి తాడేపల్లికి రావడమే బెటర్ అని అంటున్నారు. మరి అధినాయకత్వం ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది.
