స్ట్రక్చర్ మిస్సయిన వైసీపీ.. మెయిన్ ప్రాబ్లమ్ ఇదే... !
ఏ పార్టీకైనా స్ట్రక్చర్ ముఖ్యం. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడం వరకు మంచిదే అయినా.. నాయకులను నడిపించేందుకు, వారికి దిశానిర్దేశం చేసేందుకు పార్టీ పరంగా స్ట్రక్చర్ చాలా ముఖ్యమని నాయకులు చెబుతారు.
By: Garuda Media | 7 Nov 2025 7:00 AM ISTఏ పార్టీకైనా స్ట్రక్చర్ ముఖ్యం. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడం వరకు మంచిదే అయినా.. నాయకులను నడిపించేందుకు, వారికి దిశానిర్దేశం చేసేందుకు పార్టీ పరంగా స్ట్రక్చర్ చాలా ముఖ్యమని నాయకులు చెబుతారు. పార్టీలు కూడా అవే ఫాలో అవుతాయి. కానీ.. ఈ విషయంలో వైసీపీ స్ట్రక్చర్ మిస్సయిందన్న వాదన బలంగా ఉంది. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లో పార్టీ అధినేతే రాజు, మంత్రిగా వ్యవహ రిస్తారు. వారు తీసుకున్నదే ఫైనల్ నిర్ణయం.
అయినప్పటికీ.. టీడీపీ వంటి లోకల్ పార్టీలలో ఒక విధానం(స్ట్రక్చర్) ఉంది. పార్టీలో నాయకులకు దిశాని ర్దేశం చేసేందుకు నాయకులు ఉంటారు. అదే విధంగా గాడి తప్పుతున్నారని భావిస్తున్నప్పుడు. వారిని లైన్‌లో పెట్టేందుకు కూడా క్రమశిక్షణ సంఘం కూడా ఉంటుంది. అలానే క్షేత్రస్థాయిలో నాయకులను నడిపించేందుకు, కార్యకర్తలలో ఊపు తెచ్చేందుకు కూడా నాయకులు ప్రత్యేకంగా ఉంటారు. ఈ తరహా పరిస్థితి వైసీపీలో లేకుండా పోయింది.
దీనికి ప్రధాన కారణం.. పార్టీలో ఏకఛత్రాధిపత్యంగా జగన్ వ్యవహరిస్తున్నారన్న రీజన్ వినిపిస్తోంది. గతంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి, సాయిరెడ్డి వంటి వారు.. పార్టీకి స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని జగన్‌కు విన్నవించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా.. కార్యకర్తలను, నాయకులను నడిపించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కానీ, జగన్ పెడచెవిన పెట్టారు. దీంతో పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలు పెద్దగా సక్సెస్ కాలేక పోతున్నాయి.
జగన్ వస్తే.. పండగ, లేకపోతే దండగ అన్నట్టుగా వైసీపీ కార్యక్రమాలు ఉంటున్నాయి. దీంతో పార్టీ నైరాశ్యంలో కూరుకుపోతోందని చెబుతున్నారు. ఈ 16 మాసాల్లో పలు కార్యక్రమాలు చేపట్టినా.. అవి అనుకున్న విధంగా సక్సెస్ రేట్ సాధించలేకపోవడానికి ఈ స్ట్రక్చర్ లేకపోవడమే కారణమన్న వాదన సీనియర్లనుంచి కూడా వినిపించింది. జగన్‌ను ప్రశంసిస్తే.. చాలు.. అన్నట్టుగా కొందరు వ్యవహరించిన దరిమిలా.. పార్టీకి నష్టం వాటిల్లుతోందని.. తాజాగా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి.
