Begin typing your search above and press return to search.

కోటి సంతకాలు క్యాడర్ ని యాక్టివ్ చేయడానికేనా ?

ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ లండన్ కి వెళ్తూ మెడికల్ కాలేజీల విషయంలో కోటి సంతకాలను సేకరించాలని క్యాడర్ కి ఒక బిగ్ టాస్క్ ని ఇచ్చేశారు.

By:  Satya P   |   11 Oct 2025 7:00 PM IST
కోటి సంతకాలు క్యాడర్ ని యాక్టివ్ చేయడానికేనా ?
X

వైసీపీ అధినాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మెల్లగా ప్రతిపక్ష పాత్రలోకి మారుతోంది ఈ క్రమంలో విపక్షాలు చేయాల్సిన యాక్టివిటీస్ ఒక్కోటిగా చేయడానికి తన వంతుగా ప్రయత్నాలు మొదలెట్టింది. జనంలో నిత్యం ఉండడం ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద తూతూ మంత్రంగా కాకుండా గట్టిగా పట్టుబడుతూ నిరంతరం ఆందోళనలు చేయడం ద్వారానే జనాల మనసు చూరగొనవచ్చు అన్నది ఇప్పటికి వైసీపీకి అర్ధం అయింది అని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ తాజాగా తీసుకున్న ఒక కార్యక్రమం కోటి సంతకాల సేకరణ. ఏపీలో మొత్తం 17 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడం పట్ల మండిపోతున్న వైసీపీ తన క్యాడర్ కి ఈ రకమైన ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది.

జగన్ దిశా నిర్దేశం :

ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ లండన్ కి వెళ్తూ మెడికల్ కాలేజీల విషయంలో కోటి సంతకాలను సేకరించాలని క్యాడర్ కి ఒక బిగ్ టాస్క్ ని ఇచ్చేశారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటి అంటే అసలు ప్రజలకు మెడికల్ కాలేజీల గురించి ఏమైనా విషయం తెలుసా అన్నది. అంతే కాదు. ఇక విద్యార్థులకు పీపీపీ అయినా ప్రభుత్వం నడిపే విధానం అయినా కూడా తమకు సీట్లు వచ్చాయా లేవా అన్నదే చూస్తారు. ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం వారికి ఈ పోరాటం ఏ మేరకు ఎంతవరకూ పట్టింది అన్నది కూడా చర్చగా ఉంది.

ప్రజలలోకి వెళ్ళాలంటే :

ఇక ప్రతిపక్షం చేసే ఆందోళనలు ఏవైనా జనాల్లోకి పోవాలంటే కనుక పక్కా మా ప్రోగ్రామ్స్ గా వాటిని చేయాల్సి ఉంటుంది. అపుడే సామాన్యుల నుంచి అందరికీ అవి అర్ధం అవుతాయి. వైసీపీ ఆ దిశగా ఇంతవరకూ చేసిన ప్రయత్నాలు ఏమి ఉన్నాయో తెలియదని ఈ లోగానే కోటి సంతకాలతో జనంలోకి వెళ్తే ఎలా అన్నది ఒక మాటగా వినిపిస్తోంది. ఇక జగన్ అయితే జనంలోకి వెళ్తే జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన టూర్లు ఆ విధంగా సక్సెస్ అవుతున్నాయి, కానీ జగన్ తన మటుకు తాను చెప్పాల్సింది చెబుతున్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అయితే అవి ఏ మాత్రం సరిపోవని అంటున్నారు. పార్టీ నేతలు విస్తృతంగా జనంలోకి పీపీపీ విధానం ఏమిటి దాని వల్ల కలిగే నష్టాలు ఏమిటి చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. జగన్ వస్తున్నారు జనాలు వెళ్తున్నారు ఒక మీటింగ్ సాగుతోంది, అంతకు మించి జనాలకు జగన్ దేని గురించి వచ్చారు ఏమి చెబుతున్నారు అన్నది అర్ధం కావడం లేదని అంటున్నరు.

క్యాడర్ కి అవగాహన ఎంత :

ప్రజల వరకూ ఎందుకు వైసీపీ క్యాడర్ కి ఏమైనా ఈ పీపీపీ విధానం గురించి తెలుసా అన్నది మరో చర్చగా ఉంది ఎందుకంటే టీడీపీ మాదిరిగా ఫీడ్ బ్యాక్ ఇచ్చి లేదా ట్రైనింగ్ ఇచ్చి క్యాడర్ ని జనంలోకి పంపించే మెకానిజం అయితే వైసీపీ వద్ద లేదు, క్యాడర్ తాముగనే ఎడ్యుకేట్ అయి జనంలోకి పోవాలి. లేదా వారికి పార్టీ నేతలు ఏమైనా చెబితే చెప్పాలి. ఇవేమీ కాకుండా కోటి సంతకాల పేరుతో జనంలోకి వెళ్తే ఎందుకు ఏమిటి ఈ సంతకాలు అంటే జనం అడిగే ప్రశ్నలకు క్యాడర్ నుంచి కూడా జవాబు రావడం కష్టమే అని అంటున్నారు. జనాలను తరలించేసి జగన్ ను చూసేసి అంతటితో ఫుల్ హ్యాపీస్ అయ్యే లీడర్స్ కానీ క్యాడర్ కానీ ఎక్కువగా వైసీపీలో కనిపిస్తారు అని అంటున్నారు. దాంతో పీపీపీ అన్న దాని మీద అసలు విషయం నూటికి 99 శాతానికి ఏమీ తెలియదు అని అంటున్నారు.

జనాల తీర్పు అదే మరి :

నాయకులు జనాల తీర్పుని ఎలా అర్ధం చేసుకుంటారో తెలియదు కానీ ఆనాడు జగన్ గెలవడానికి నవ రత్నాలు కానీ ఈ రోజు కూటమి గెలవడానికి సూపర్ సిక్స్ పధకాలు కానీ ఏ మేరకు దోహదపడ్డాయి అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే జగన్ కావాలని 2019 ఎన్నికల్లో జనాలు అనుకున్నారు, ఓటేసారు, అదే జనాలు జగన్ ని వద్దు అనుకుంతే కూటమికి ఏకంగా 164 సీట్లు రావడం జరిగింది అన్న విశ్లేషణలు కూడా ఉనాయి అంటున్నరు.

అప్పులు తెచ్చి నడిపిస్తున్నారు :

ఇదిలా ఉంటే జనాలు ఎవరిని ఎందుకు గెలిపిస్తున్నారో ఎవరికీ అర్ధం కాని ఒక బ్రహ్మ పదార్థం అని అంటున్నారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం అయిదేళ్ళూ అప్పులు తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని నడిపించింది. ఆ అప్పులతోనే సంక్షేమ పధకాలను అమలు చేసింది. ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. అప్పులు పెద్ద ఎత్తున తెస్తూ ఏపీని రన్ చేస్తోంది మరి అప్పులు కుప్పలుగా ఏపీకి పెరిగిపోతున్నాయి పధకాలు పంచడం వల్ల జీఎస్టీలు పెరుగుతున్నాయి. దాని వల్ల మోడీ ప్రభుత్వానికే అవి టాక్స్ రూపంలో పోతున్నాయి. అలా మోడీకి కేంద్రానికే దీని వల్ల లాభాలు కలుగుతున్నాయి. మరో వైపు కేంద్రం చూస్తే యూపీ, ఎంపీ బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఎక్కువగా ఇస్తూ పోతోంది. ఇదంతా జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయమే. అంటే ఏపీకి అప్పులు మిగులుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలకు మాత్రం కేంద్ర ఆదాయాలలో భారీ వాటాలు దక్కుతున్నాయి, ఇదొక చిత్రమైన పరిస్థితి అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

క్యాడర్ ని లేపేందుకే :

ఇక జగన్ కోటి సంతకాల సేకరణ పిలుపు అన్నది క్యాడర్ ని లేపడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడదు అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ క్యాడర్ గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంది, క్యాడర్ వీక్ అయింది అన్నది అధినాయకత్వం గ్రహించింది, దాంతోనే జగన్ ఈ విధంగా ఒక బిగ్ టాస్క్ వారికి ఇచ్చి జనంలోకి పంపిస్తున్నారు అని అంటున్నారు. అంతకు మించి ఇందులో బ్రహ్మ రహస్యం ఏమీ లేదని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.