బొత్సకు డిప్యూటీ సీఎం.. ?
కాలం గిర్రున తిరిగింది. మరో రెండేళ్లలో ఎన్నికల వేడి రాజుకోనుంది. 2024లో ఎన్నికలు జరిగినా.. నిన్న మొన్న జరిగినట్టుగానే అనిపిస్తోంది.
By: Garuda Media | 28 Jan 2026 8:00 AM ISTకాలం గిర్రున తిరిగింది. మరో రెండేళ్లలో ఎన్నికల వేడి రాజుకోనుంది. 2024లో ఎన్నికలు జరిగినా.. నిన్న మొన్న జరిగినట్టుగానే అనిపిస్తోంది. మరోవైపు.. కూటమి సర్కారుకు అప్పుడే 19 మాసాలు పూర్తయ్యాయి. మరో ఏడాది గడిస్తే.. ఎన్నికల సమయం వచ్చేస్తుంది. దీంతో రాజకీయంగా అడుగులు వడివడిగా పడేలా.. నాయకులు, పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రాంతాల వారీగా పార్టీలు లెక్కలు వేసుకుం టున్నాయి. ఎక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలనే విషయంపై చర్చించుకుంటున్నారు.
దీనిలో భాగంగానే.. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా.. మూడు ఉమ్మడి జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో తిరిగి వైసీపీతన ప్రాభవం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందన్న వాదన పార్టీ నాయకుల్లో వినిపిస్తోంది. వయసు రీత్యా బోత్స పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా విజయనగరం సహా విశాఖ, శ్రీకాకుళంలోనూ ఆయన మంచి హవా కొనసాగుతోంది.
వివాదాలు ఉన్న్పటికీ.. రాజకీయంగా.. బొత్సకు బలమైన గాలే వీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోయిన హవాను ఆయన ద్వారా ఒడిసి పట్టుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగానే ఆయనకు కీలక పదవిని ప్రకటించడం ద్వారా ఉత్తరాంధ్రలో పాగా వేయాలన్నది వైసీపీ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బొత్సకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల మధ్య చర్చ సాగుతోంది.
ఇప్పటి వరకు బొత్సకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి దక్కింది. విభజిత ఏపీలోనూ వైసీపీ హయాంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్‌గా.. ప్రస్తుతం వైసీపీ శాసన మండలిలో ప్రతిప క్ష నాయకుడిగా కూడా బొత్స వ్యవహరిస్తున్నారు. ఇది చాలదని.. వచ్చే ఎన్నికల నాటికి ప్రాంతాల వారీగా రాజకీయాలు మారనున్ననేపథ్యంలో బొత్సకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తే.. ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉండడం గమనార్హం. దీనిపై జగన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
