Begin typing your search above and press return to search.

సాయిరెడ్డికి నో కౌంటర్స్...ఓన్లీ సైలెన్స్ !

విజయసాయిరెడ్డి ఇటీవల మళ్లీ వైసీపీ మీద తన విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ఆయన నేరుగా జగన్ ని అనకపోయినా కోటరీ అంటూ చేస్తున్న కామెంట్స్ ఒక రకంగా జగన్ ని ఇబ్బంది పెడుతున్నవే.

By:  Satya P   |   23 Jan 2026 9:03 AM IST
సాయిరెడ్డికి నో కౌంటర్స్...ఓన్లీ సైలెన్స్ !
X

విజయసాయిరెడ్డి ఇటీవల మళ్లీ వైసీపీ మీద తన విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. ఆయన నేరుగా జగన్ ని అనకపోయినా కోటరీ అంటూ చేస్తున్న కామెంట్స్ ఒక రకంగా జగన్ ని ఇబ్బంది పెడుతున్నవే. అధినాయకుడు కోటరీ చెప్పుచేతలలో ఉన్నారు అంటే అది ఆయన ప్రభావవంతమైన పనితీరుని కనబరచడం లేదన్న విమర్శలు ఆటోమేటిక్ గా వస్తాయి. చెప్పుడు మాటలు వింటున్నారన్న సంకేతాలూ వెళ్తాయి. పార్టీ అధినాయకుడి కంట్రోల్ లో లేదన్న ప్రచారమూ సాగుతుంది. పదే పదే కోటరీ అంటూ చేస్తున్న ఈ కామెంట్స్ తో వైసీపీకి ఇబ్బందికరమే అని అంటున్నారు. అలా అన్న వారు కూడా వైసీపీకి ఎంతో కాలంగా సేవలు అందించిన వారు. అన్నింటికీ మించి జగన్ కి అత్యంత సన్నిహితుడైన వారు. దాంతో విజయసాయిరెడ్డి మాటలకు ఎంతో కొంత విలువ ఉంటుందని అంటున్నారు.

వైసీపీ స్ట్రాటజీ :

అయితే విజయసాయిరెడ్డి ఎంతగా విమర్శలు చేసినా వైసీపీ నుంచి కౌంటర్లు ఉండరాదు అన్నదే ఆ పార్టీ నయా స్ట్రాటజీ అని అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఈ విమర్శల మంటను వేడిని సగానికి సగమైనా తగ్గించుకోవచ్చు అని భావిస్తున్నారని అంటున్నారు. ఒంటి చేతి చప్పట్లతో పెద్దగా సౌండ్ రాదని అలా ఎంత కామెంట్స్ చేసినా రియాక్షన్ లేకపోతే ఏదో నాటికి ఆయనే తగ్గి ఊరుకుంటారు అన్నదే వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు.

ట్వీట్లు సెటైర్లు :

అయితే విజయసాయిరెడ్ మొన్న ట్వీట్ చేశారు, నేడు సెటైర్లు పేల్చారు. మ్యాటర్ మాత్రం సేం టూ సేం. జగన్ ఆయన కోటరీ. ఇక లేటెస్ట్ గా ఆయన తీవ్రమైన విమర్శలే చేశారు. జగన్ ఇక అధికారంలోకి రాడని కూడా జోస్యం చెప్పారు. వైసీపీలో రాజకీయ వ్యూహాలు రూపొందించే వారు ఎవరూ లేరని కూడా స్పష్టం చేశారు. ఏ విధానమూ లేకుండా పాదయాత్రలు చేసినా ఫలితం రాదని అన్నారు. అంతే కాదు కూటమి పార్టీలు కలసి ఉన్నంతవరకూ జగన్ కి అధికారం అన్నది కల్ల అని కూడా చెప్పేశారు.

ఇదే సూచనగా :

అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఒక సింగిల్ వర్డ్ ని కూడా వదలవద్దు అని పార్టీ వారికి పూర్తిగా దిశా నిర్దేశం చేసిందని అంటున్నారు. ఆయన ఏమి చెప్పినా ఎంత చెప్పినా చెప్పుకోనీయాలని దానిని లైట్ తీసుకుంటూ ముందుకు సాగాల్సిందే తప్పించి కౌంటర్లు వేయడం వద్దు అని అధినేత నుంచే స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. దాంతో విజయసాయిరెడ్డి ఇక మీదట వైసీపీని ముగ్గులోకి లాగడానికి మరింత తీవ్రంగా విమర్శలు చేస్తారా లేక ఆగిపోతారా తగ్గిపోతారా అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.