Begin typing your search above and press return to search.

వారికి నో బోర్డు... జగన్ సంచలన నిర్ణయం ?

వైసీపీలో వారికి నో అన్న బోర్డు కనిపిస్తుందా. ఇదే పార్టీలో చర్చగా ఉంది. వైసీపీలో ఎంతో పెద్ద నాయకులు ఉండేవారు.

By:  Satya P   |   11 Aug 2025 11:00 AM IST
వారికి నో బోర్డు... జగన్ సంచలన నిర్ణయం ?
X

వైసీపీలో వారికి నో అన్న బోర్డు కనిపిస్తుందా. ఇదే పార్టీలో చర్చగా ఉంది. వైసీపీలో ఎంతో పెద్ద నాయకులు ఉండేవారు. పునాది నుంచి ఉన్న నేతలు ఉండేవారు. అయితే వారంతా కూడా వరసగా క్యూ కట్టేశారు. వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత వారు గేటు దాటేశారు. తమ సొంత ప్రయోజనాలను చూసుకున్నారు అని విమర్శలు వైసీపీ నుంచి వచ్చాయి. అయితే పదిహేను నెలల టీడీపీ కూటమి పాలనలో తమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తి అయితే చాలా మంది వైసీపీ మాజీ నేతలలో ఉంది అని ప్రచారం జరిగింది. దాంతో వారు మళ్ళీ సొంత ఇంటి వైపు చూస్తున్నారు అని కూడా చర్చ సాగుతోంది.

ఆ విషయంలో అదే నిర్ణయం :

వైసీపీని వీడి పోయిన వారి విషయంలో ఒకే నిర్ణయం అమలు చేయాలని అధినాయకత్వం నిర్ణయించింది అని అంటున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో చిన్న వారు పెద్ద వారు సన్నిహితులు అన్న తేడా ఉండదని అంటున్నారు పార్టీని కష్టంలో ఉన్నపుడు వదిలి వెళ్లిన వారిని ఎట్టి పరిస్థితులలో తిరిగి చేర్చుకోరాదు అన్నదే ఆ నిర్ణయం అని అంటున్నారు. వారు సుముఖంగా ఉన్నా పార్టీ మాత్రం సుముఖంగా ఉండబోదని అంటున్నారు. అధినేత జగన్ అయితే కచ్చితంగా ఉంటున్నారు అని చెబుతున్నారు.

క్యాడర్ కోసమే అలా :

పార్టీని వీడి వెళ్ళిన వారిని వెనక్కి తెచ్చి మళ్లీ పార్టీలో కీలకం చేస్తే క్యాడర్ మనోభావాలు దెబ్బ తింటాయని అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. అందువల్లనే వారిని చేర్చుకోరాదని అంటోంది. ఒకసారి పార్టీ గేటు దాటి బయటకు వెళ్ళిన వారు ఎంత పెద్ద లీడర్లు అయినా జగన్ కి బంధువులు అయినా ఇక వైసీపీలోకి తిరిగి అడుగుపెట్టలేరన్న గట్టి సందేశాన్ని పార్టీ ఇవ్వబోతోంది అంటున్నారు.

కొత్త వారికే చోటు :

వైసీపీ వీక్ గా ఉన్న చోట కొత్త వారిని ప్రోత్సహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. జనం మద్దతు ఉంటే మరోసారి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారు కొత్త వారు అయినప్పటికీ వారికి చాన్స్ ఇస్తే మేలు జరుగుతుందని భావిస్తోంది అంటున్నారు. అంతే కాకుండా యువతరానికి ఈసారి చాన్స్ ఎక్కువగా ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. పార్టీ యువజన విభాగంలో సైతం అధినాయకత్వం ఈ మేరకు వారికి స్పష్టమైన హామీని ఇచ్చింది అని అంటున్నారు.

అవన్నీ రూమర్లేనా :

వైసీపీకి రాజీనామా చేసిన వారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న వారు మళ్ళీ ఫ్యాన్ నీడకు చేరుతారు అని వస్తున్న వార్తలు అన్నీ రూమర్లే అని అంటున్నారు. ఈ విషయంలో పార్టీ స్పష్టమైన వైఖరితోనే ఉంది అని అంటున్నారు. దాంతో వైసీపీలో 2024 దాకా కీలకంగా ఉంటూ వచ్చి ఆ తరువాత పార్టీకి వివిధ కారణాల వల్ల దూరం అయిన వారు ఇక ఆ పార్టీ వేదిక మీద కనిపించకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజముందో. ఆచరణలో ఏమేమి జరుగుతాయో.