Begin typing your search above and press return to search.

ఖర్గేతో వైసీపీ ఎంపీ...వ్యూహాలు ఉన్నాయా ?

ఏపీ రాజకీయాల్లో చాలా జరుగుతూంటాయి. నిజానికి దేశ రాజకీయాల్లోనే తెలుగు రాజకీయాలు వెరీ స్పెషల్ అని అంటారు.

By:  Satya P   |   23 Aug 2025 3:59 PM IST
ఖర్గేతో వైసీపీ ఎంపీ...వ్యూహాలు ఉన్నాయా ?
X

ఏపీ రాజకీయాల్లో చాలా జరుగుతూంటాయి. నిజానికి దేశ రాజకీయాల్లోనే తెలుగు రాజకీయాలు వెరీ స్పెషల్ అని అంటారు. మొదటి నుంచి తెలుగు రాజకీయాలు పవర్ ఫుల్ గా సాగుతాయి అని అన్నది విశ్లేషణ. ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో ఏ పరిణామం జరిగినా దాని పర్యవసానాలు తెలుగు రాజకీయాల్లో ప్రతిబింబిస్తూంటాయి. మరీ ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ రూటే సెపరేట్ అని కూడా అంటారు. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికలు జాతీయ స్థాయిలోనే కాదు ఏపీలోనూ కాక రేపుతున్నాయి. తెలుగు బిడ్డ సెంటిమెంట్ కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ప్రాంతీయ పార్టీల స్టాండ్ సైతం బిగ్ డిబేట్ కి దారి తీస్తోంది.

ఎంపీ మేడ సంచలనం :

ఒక వైపు నువ్వా నేనా అన్నట్లుగా ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీయే ఇండియా కూటమిల మధ్య సాగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతూ ఈ ఎన్నికల వ్యూహాలు ఉన్నాయి. అంతే కాదు తెలుగు రాజకీయ పార్టీల మీద సైతం ప్రభావం చూపిస్తున్న నేపధ్యంలో సడెన్ గా వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, అధినేత జగన్ సొంత జిల్లాకు చెందిన మేడ రఘునాధరెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గెని కలసి వచ్చారు. ఇది జాతీయ స్థాయిలోనే కాదు తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. వైసీపీ అధినేత జగన్ కి మరో ఎంపీ షాక్ ఇస్తున్నారు అన్న చర్చ కూడా సాగుతూ వచ్చింది.

తూచ్ అనేసిన ఎంపీ :

అయితే అలాంటిది ఏదీ లేదని ఎంపీ మేడ రఘునాధరెడ్డి సొంతంగా వీడియో బైట్ ని రిలీజ్ చేసి మీడియాకు వదిలారు. తాను ఎప్పటికీ జగన్ కి విధేయుడిని అన్నారు. తన రాజకీయ జీవితంలో వైసీపీని వీడీది లేదని పక్కాగా చెప్పారు. తనకు ఎంతో కాలంగా మల్లికార్జున ఖర్గె తెలుసు అని ఆయనను అందుకే మర్యాదపూర్వకంగా కలిశాను అని చెప్పారు. అయితే ఎంత ఖర్గెతో పరిచయం ఉన్నా ఇది సమయం సందర్భం కాదని తెలిసి మేడ ఎందుకు కలిశారు. ఈ విధంగా కలిస్తే రాజకీయ రచ్చ పీక్స్ లో ఉంటుంది అన్నది ఆయనకు తెలియదా అన్న చర్చ కూడా అంతా సాగుతోంది.

జగన్ వైపు చూపు :

ఇక మేడ వెళ్ళి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని కలిశారు. అయితే ఈ విషయంలో మొదట జగన్ కి ఎంపీ షాక్ ఇచ్చారు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే లేటెస్ట్ గా మరో ప్రచారం సాగుతోంది. జగన్ కి తెలియకుండా ఎంపీ మేడ వెళ్ళరని అది జరిగేది కాదన్నది ఆ ప్రచారంలోని సిసలైన మ్యాటర్. అంటే జగన్ ఆయనను స్వయంగా కాంగ్రెస్ పెద్దల వద్దకు పంపించారని అంటున్నారు. అలా కాంగ్రెస్ వైపు నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవడానికి జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్ ఇదని ప్రచారం చేస్తున్నారు.

భవిష్యత్తు బంధాలట :

ఈ రోజున ఎన్డీయేతో సన్నిహితంగా ఉన్నా భవిష్యత్తు బంధాల దృష్ట్యా ఈ విధంగా కాంగ్రెస్ తో కొత్త చెలిమిని పెనవేసుకోవడానికే తమ ఎంపీని పంపించారు అని ప్రచారం అయితే జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ జగన్ రెండు జాతీయ పార్టీలను మ్యానేజ్ చేస్తున్నారు అని అయితే పుకార్లు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే జగన్ స్వభావం తెలిసిన వారు మాత్రం ఆయన అలా చేసే రకం కాదని అంటున్నారు. పైగా కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా వైసీపీ మీద ఆశలు లేవని ఏపీలో వైసీపీని తగ్గిస్తేనే తాము బలపడుతామని కాంగ్రెస్ భావిస్తుందని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్న థియరీని కనుక నమ్మితే ఈ ప్రచారంలో కూడా ఏదో ఉందనే అంచనాకు వచ్చవారూ ఉన్నారు. మొత్తానికి కీలక సమయంలో వైసీపీ ఎంపీ వేసిన ఈ భేటీ పలు రకాలైన చర్చకు దారి తీస్తున్నాయని అంటున్నారు.