Begin typing your search above and press return to search.

మావిగన్ తో వందకోట్ల ఫ్రీ పబ్లిసిటీ ?

వైసీపీ ట్రెడిషనల్ పాలిటిక్స్ కి దూరంగా ఉండే పార్టీ. ఒక భిన్నమైన వైఖరితో సాగే పార్టీ. ప్రచారం విషయంలో చూస్తే ఆ పార్టీ తీరే వేరుగా ఉంటుంది.

By:  Satya P   |   28 April 2026 12:34 PM IST
మావిగన్ తో వందకోట్ల ఫ్రీ పబ్లిసిటీ ?
X

వైసీపీ ట్రెడిషనల్ పాలిటిక్స్ కి దూరంగా ఉండే పార్టీ. ఒక భిన్నమైన వైఖరితో సాగే పార్టీ. ప్రచారం విషయంలో చూస్తే ఆ పార్టీ తీరే వేరుగా ఉంటుంది. అవతల ప్రత్యర్ధి టీడీపీ అయితే పబ్లిసిటీ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటుంది. పైగా వ్యూహాలు ఎత్తుగడలలో టీడీపీని మించిన వారు ఉండరు. అలాంటి పార్టీతో వైసీపీ ఎపుడూ పోటీ పడలేని స్థితిలోనే ఉంటుంది. అలాంటివి వైసీపీ మావి గన్ అన్న ఒకే ఒక్క స్టెప్ తో ఏకంగా వంద కోట్ల రూపాయిల విలువ చేసే పబ్లిసిటీని ఫ్రీగా కొట్టేసిందా అన్న చర్చ అయితే సాగుతోంది.

ట్రోలింగ్ కా బాప్ :

మావిగన్ అన్నది వైసీపీ కాకతాళీయంగా అన్నదా లేక మనసులో ఉంచుకుని సరైన సమయంలో వదిలిన పంచ్ నా లేక టీడీపీ కూటమి అమరావతి రాజధాని అన్న బలమైన స్లోగన్ ని ఎంతో కొంత అడ్డుకునేందుకు వేసిన పాచికా అన్నది తెలియదు కానీ మావిగన్ మాత్రం జగన్ నోటి వెంట రాగానే సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. అంతే కాదు ఏపీ రాజకీయమంతా మొదట షాక్ అయింది ఆ మీదట హీటెక్కిపోయింది. ఇక మావిగన్ అన్నది ట్రెండింగ్ లో ఉంటూ ట్రోలింగ్ కా బాప్ అనిపించుకుంది. ఇది నెగిటివ్ ప్రచారమా లేక పాజిటివ్ ప్రచారమా అన్నది పక్కన పెడితే వైసీపీని ఎక్కడో తీసికెళ్ళి పెట్టింది అన్నది మాత్రం వాస్తవం అని అంతా అంటున్నారు.

నాడు పాదయాత్రతో :

వైసీపీ అధినేత 2017 లో నిర్వహించిన భారీ పాదయాత్ర సమయంలో వైసీపీకి వచ్చిన హైప్ పొలిటికల్ గా హైలెట్ అయిన తీరు అందరికీ తెలిసిందే. ఆ తరువాత అంతటి పొలిటికల్ వైబ్రేషన్స్ అయితే వైసీపీకి ఎక్కడా రాలేదు. అధికారంలో ఉన్నపుడు కానీ గడచిన రెండేళ్ళ విపక్ష పాత్రలో కానీ వైసీపీ డిఫెన్స్ మోడ్ లో ఉంటోంది. చాలా సార్లు సైలెంట్ మోడ్ నే నమ్ముకుంది. ఇక అనేక సార్లు కార్నర్ అవుతూ వస్తోంది. కానీ ఇన్నేళ్ళ తరువాత మళ్లీ నాటి హైప్ వైసీపీకి క్రియేట్ అయింది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మావిగన్ అని అంటున్నారు. మావిగన్ అన్న మూడు అక్షరాల పదం వైసీపీని పొలిటికల్ గా ఏపీ రాజకీయ తెర మీద ఫుల్ ఫోకస్డ్ గా నిలిచేలా చేసింది అని అంటున్నారు. ఇక దీని మీద జరిగిన చర్చ ఇంతా అంతా కాదు అది పాజిటివ్ గా జరిగిందా లేక నెగిటివ్ గా జరిగిందా అన్నది పక్కన పెడితే వైసీపీ అన్న పేరు ప్రతీ చోటా నానేలా చేసింది.

ఫుల్ ట్రెండింగ్ లో :

ఆ విధంగా చూస్తే ఏప్రిల్ నెల మొదటి తేదీన వైసీపీ అధినేత జగన్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజున ఆయన మావిగాన్ అని ప్రతిపాదించారు. అంతే నాటి నుంచి దాదాపుగా నెల రోజులుగా అదే సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. ఎంతలా అంటే మరే టాపిక్ కూడా కనీసంగా చర్చకు నోచుకోనంతగా ఈ ఒక్క టాపిక్ తోనే వైసీపీ బహుళ ప్రచారం పొందింది. నిజం చెప్పాలంటే ఈ సమయంలో అంటే వైసీపీ భారీ ఓటమిని అందుకుని విపక్షంలో ఉంటూ కేవలం 11 సీట్లతో చతికిలపడిన వేళ ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న వేళ వచ్చిన ఈ బూస్టింగ్ కానీ జరిగిన ప్రచారం కానీ రూపాయలలో లెక్క కడితే కచ్చితంగా వంద కోట్ల పై మాటే అంటున్నారు. అంటే పార్టీ ఖజానా నుంచి వంద కోట్లు తీసి పబ్లిసిటీ చేయించుకుంటే వచ్చే పబ్లిసిటీ ఫ్రీగానే వచ్చేసింది అన్న మాట.

మీడియానే మోసింది :

ఈ ప్రచారం అంతా మీడియానే మోసింది. భారీగా చేసింది. అది మెయిన్ స్ట్రీమ్ మీడియానా లేక సోషల్ మీడియానా లేక డిజిటల్ ఫ్లాట్ ఫారం నా అన్నది పక్కన పెడితే ఒక్క మావిగన్ తో వైసీపీ అచ్చంగా ఉచిత ప్రచారాన్ని వందల కోట్ల దాకా పొందేసింది. ఇందులో జనాలదే తొంబై శాతం పాత్ర అయితే వైసీపీ నుంచి మావిగాన్ ని సమర్ధించుకుంటూ చేసిన ప్రచారం కేవలం పది శాతం మాత్రమే. అంటే ఇంతలా ఇది ప్రచారం అవుతుందని బహుశా వైసీపీ కూడా ఊహించి ఉండదు ఏది ఏమైనా వైసీపీకి ఈ సమయంలో అయితే ఇది బాగా జనంలో ఫోకస్ అయ్యేలా చేసింది మరి ఇది పాజిటివ్ గానా నెగిటివ్ గానా అన్నది పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీకి కావాల్సినంత ప్రచారం అయితే దక్కింది. ఆ విధంగా వైసీపీ లక్కీ అనే అంటున్నారు.