నిబద్ధత ఏది నాయకా.. జగన్‌కు ఇదే ఎసరు ..!
పార్టీఅన్నాక నాయకుల అధినేత పిలుపును అందిపుచ్చుకునే నాయకులు ఉండాలి. అధినేత చెప్పింది చెప్పినట్టు చేసే కార్యకర్తలు ఉండాలి.
By: Garuda Media | 11 Nov 2025 8:00 PM ISTపార్టీఅన్నాక నాయకుల అధినేత పిలుపును అందిపుచ్చుకునే నాయకులు ఉండాలి. అధినేత చెప్పింది చెప్పినట్టు చేసే కార్యకర్తలు ఉండాలి. ఈ రెండు విషయాల్లోనూ వైసీపీ గాడితప్పిందా? అంటే.. ఔననే వాదనే వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు నాయకులను పట్టించుకోని ఫలితం.. కార్యకర్తలను విస్మరించిన నేపథ్యం.. ఇప్పటికీ వైసీపీని వెంటాడుతూనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తాజా పరిణామమే.
గతంలో టీడీపీఅధినేత చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు.. ఏ చిన్న పిలుపునిచ్చినా.. కనీసంలో కనీ సం 60 శాత మంది నాయకులు, 70 శాతం మంది కార్యకర్తలు ముందుకు కదిలారు. ప్రతి కార్యక్రమాన్నీ సక్సెస్ చేసేందుకు మాజీ మంత్రులు చాలా మంది ముందుకు వచ్చారు. ఫలతంగా 23 స్థానాలకే అప్పట్లో పరిమితమైనా.. ప్రతిపక్ష పార్టీగా ప్రజల మన్ననలు పొందడానికి దారి తీసింది. కానీ, వైసీపీ విషయాన్ని గమనిస్తే. ఈ తరహా పరిస్థితికనిపించడం లేదు.
తాజాగా మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత జగన్... దీనికి నిరసనగా ప్రజ ల నుంచి `కోటి సంతకాల` సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా నాయకుడికి 10 వేల సంతకా ల చొప్పున టార్గెట్ విధించారు. క్షేత్రస్థాయి నాయకులకు.. 1000 సంతకాలు సేకరించాలని చెప్పాలి. అయితే.. ఆయన మాట మిగిలింది కానీ.. ఈ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పైగా ఎవరికి వారు.. తాము చేసేశామని చెబుతున్నారు.
కానీ, ఈ విషయం `డొల్ల` అని పార్టీ అధిష్టానం గుర్తించినట్టు తెలిసింది. ఎందుకంటే.. సంతకం సేకరించడంతోపాటు.. సదరు వ్యక్తి అడ్రస్, ఆధార్ నెంబరును కూడా పేర్కొనాలని.. అప్పుడు తమ నిరసనకు మరింత బలం చేకూరుతుందని జగన్ భావించారు. ఇవేవీ లేకుండానే నాయకులు తాజాగా తమ సంతకాల సేకరణను పార్టీకి అందించేశారు. కొన్ని చోట్లనాయకులు కొంత ఖర్చు పెట్టి ఏజెన్సీలకు ఈ బాధ్యతఇచ్చేశారని కూడా తెలిసింది. మొత్తంగా ఈ సంతకాల సేకరణలో నాయకుల నిబద్ధత లేని తనం స్పష్టమైందని.. పార్టీ భావిస్తోంది.
