నిలబడతాం.. కలబడతాం.. అంటే కుదరదు జగన్!
ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న ప్రకటనలపై ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ అయ్యారు.
By: Garuda Media | 28 Sept 2026 4:34 PM ISTఎన్నికలు ఏవైనా కూడా ప్రజాస్వామ్య యుతంగానే సాగాలి. అంతేకానీ.. కలబడతాం.. కొడతాం.. అంటే కుదురుతుం దా? ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీని, ముఖ్యంగా ఈ పిలుపునిచ్చిన జగన్‌ను కూడా వేధిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక ల్లో నిలబడతాం.. కలబడతాం అంటూ వైసీపీ నేతలు చేస్తున్న హడావుడిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సమస్యాత్మక నియోజకవర్గాలు.. ప్రాంతాలపై దృష్టి పెడుతున్న సంఘం అధికారులు ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేయడం గమనార్హం.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న ప్రకటనలపై ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ అయ్యారు. తిరుపతి సహాసీమలో జరిగే.. అన్ని స్థానిక ఎన్నికల్లోనూ కలబడాలని, అవసరమైతే.. ఎంతకైనా ముందుకు వెళ్లాలని పెద్దిరెడ్డి సహా.. ఎమ్మెల్సీ భరత్ (కుప్పం)లు పిలుపునివ్వడాన్ని.. టీడీపీ నాయకులు కొందరు ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రశాంతతను భగ్నం చేసేలా వ్యవహరిస్తున్నారని వారిపై ఫిర్యాదు చేశారు.
దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను గమనిస్తామని.. కలబడతాం.. నిలబడతాం.. అంటూ ప్రజలను పార్టీల నాయకులను బెదిరించే ధోరణి సరికాదని.. అధికారులు తెలిపారు. కాగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో కూటమి పార్టీలకు.. వైసీపీకి మధ్య హోరా హోరీ పోరు సాగనుంది. పైగా.. చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా కావడం.. తాను ఎమ్మెల్యేగా, తన కుమారుడు ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
మరోవైపు వైసీపీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థుల కోసం అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేయర్ పదవికి కూటమి పార్టీల నుంచి పలువురు ఆశావహులు ముందుకు వస్తుండగా, వైసీపీ మాత్రం అభ్యర్థి ఎంపికలో తర్జనభర్జన పడుతోంది. గతంలో అధికారంలో ఉండగా.. వైసీపీ దూకుడుగా వ్యవహరించింది. ఇప్పుడు కూడా అదేపంథాను అనుసరించాలని చూడడం విమర్శలకు తావిచ్చింది. దీనినిఎన్నికల సంఘం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.
