Begin typing your search above and press return to search.

బొత్స అనూష ఓడినా భీమిలీ ఆమెకే... ఎందుకంటే ?

వైసీపీ అభ్యర్థులు లేని పరిస్థితుల్లో పార్టీ గుర్తును బరిలో ఉంచేందుకు బొత్స అనూష చివరి నిమిషంలో బొండపల్లి జెడ్పీటీసీగా పోటీకి దిగారు. ఓటమి తప్పదని తెలిసినా వెనక్కి తగ్గకుండా కూటమికి సవాల్ విసిరారు. భీమిలీలో రెండు కార్పొరేషన్ వార్డులను గెలిపించిన ఆమె తెగువను వైసీపీ అధిష్ఠానం అభినందిస్తున్నట్లు సమాచారం. 2029లో భీమిలీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ సాగుతోంది.

By:  Satya P   |   10 Nov 2026 9:18 AM IST
బొత్స అనూష ఓడినా భీమిలీ ఆమెకే... ఎందుకంటే ?
X

పార్టీ కోసం బొత్స అనూష చేసిన రిస్క్ గురించి ఇపుడు ప్రత్యేకంగా వైసీపీలో చర్చ సాగుతోంది. ఆమె సీటు కాదు, పోటీ ఊసు అసలు మనసులో లేదు. కానీ కేవలం వైసీపీ సింబల్ ని అక్కడ ఉంచడం కోసం బొత్స అనూష చివరి నిముషంలో తీసుకున్న నిర్ణయమే బొండపల్లిలో జెడ్పీటీసీగా పోటీ చేయడం అని అంటున్నారు. నిజానికి బొత్స అనూష భీమిలీ వైసీపీ ఇంచార్జి గా కీలక పదవిలో ఉన్నారు. వైసీపీ నుంచి చిన్న శ్రీను వెళ్లిపోవడంతో చోటు చేసుకున్న అనేక కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బొత్స అనూష పోటీ చేయరేనే ప్రచారం సాగింది. అందువల్లనే బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లి నుంచి కోడలు, చెల్లెలుకు పోటీకి చాన్స్ ఇచ్చారని చెబుతున్నారు.

ఏకగ్రీవానికి చెక్ పెడుతూ :

ఈ నేపథ్యంలో గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బొండపల్లి జెడ్పీటీసీ సీటుని ఏకగ్రీవం చేసుకోవాలని కూటమి చూసింది అని అంటున్నారు. వైసీపీ నుంచి పోటీకి కూడా ఎవరు రాకుండా పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో పార్టీ అధినాయకత్వానికి ఇచ్చిన మాట మేరకు మొత్తం 28 జెడ్పీటీసీలకు ఏకగ్రీవం లేకుండా అభ్యర్ధులను బరిలోకి దించాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ మొత్తం బాధ్యతలను చూస్తున్న బొత్సకు కొమ్ము కాసిన బొత్స అనూష తాను పోటీకి సై అని బొండపల్లిలో పోటీకి సిద్ధపడ్డారు అని అంటున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లోనే :

ఇక బొండపల్లిలో పూర్తి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆమె రిస్క్ చేశారు అని అంటున్నారు. రియల్ ఫైటర్ గా ఆమె బరిలోకి దిగి మరీ వైసీపీ జెండాను అక్కడ పోటీకి ఉంచారని చెబుతున్నారు. ఇక బొండపల్లి అంటే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో ఉంది. దాంతో మంత్రితో పాటు కూటమి పెద్దలు అంతా ఒకటికి పదిసార్లు అక్కడ ప్రచారం చేయాల్సి వచ్చింది. తామ ఫుల్ ఫోకస్ కూడా పెట్టాల్సి వచ్చింది. ఆ విధంగా చేయడంలో బొత్స అనూష విజయం సాధించారని అంటున్నారు.

వైసీపీ అండగా :

అందుకే అనూష ఓటమి సంగతి తెలిసినా కూడా పోటీకి తెగించి నిలబడి పార్టీ జెండా ఎగరేసారు అని హైకమాండ్ కూడా ఆమె తెగువను మెచ్చుకుంటోంది అని అంటున్నారు. ఇక భీమిలీ నియోజకవర్గంలో కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రెండు వార్డులను కార్పొరేషన్ లో ఆమె గెలిపించారు అని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే తొలిసారి జెడ్పీటీసీకి పోటీ చేసి ఓటమి పాలు అయిన బొత్స అనూష కెరీర్ ఇబ్బందులో పడుతుందని ఆలోచించకుండా పార్టీయే ఫస్ట్ అన్నట్లుగా వ్యవహరించారని హైకమాండ్ సైతం సానుకూలత వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు. ఆమెనే భీమిలీ వైసీపీ ఇంచార్జిగా కొనసాగించడమే కాదు, 2029 లో టికెట్ కూడా ఇస్తారని అంటున్నారు. ఈసారి భీమిలీలో ఆమె గెలుస్తారు అని బొత్స అభిమానులు గట్టిగానే చెబుతున్నారు.