Begin typing your search above and press return to search.

వైసీపీలో అస‌హ‌నం.. పాద‌యాత్ర కంటే ముందే.. !

వైసీపీలో తీవ్ర అస‌హ‌నం క‌నిపిస్తోందా? పాద‌యాత్ర కంటే ముందే.. జ‌గ‌న బ‌య‌ట‌కు రావాల‌ని కోరుకుంటున్న నాయ‌కుల సంఖ్య పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

By:  Garuda Media   |   22 May 2026 5:00 AM IST
వైసీపీలో అస‌హ‌నం.. పాద‌యాత్ర కంటే ముందే.. !
X

వైసీపీలో తీవ్ర అస‌హ‌నం క‌నిపిస్తోందా? పాద‌యాత్ర కంటే ముందే.. జ‌గ‌న బ‌య‌ట‌కు రావాల‌ని కోరుకుంటున్న నాయ‌కుల సంఖ్య పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అయ్యగారు వ‌చ్చే దాకా అమావాస్య ఆగ‌ద‌న్న సామెత‌ను చాలా మంది నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. ఎప్పుడో చేప‌ట్టే పాద‌యాత్ర వ‌ర‌కు ఆగితే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికి ముందే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు త‌ర‌చుగా జ‌గ‌న్ రావాల‌ని కోరుకుంటున్నారు.

ఎందుకు..?

ప్ర‌భుత్వం వైపు నుంచి వైసీపీపై దాడి పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని చాలా మంది నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. గొడ్డ‌లి పార్టీ అంటూ.. వైసీపీపై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కూడా ప్ర‌స్తావిస్తున్నారు. ఈ విష‌యాలను లైట్ తీసుకుని.. పాద‌యాత్ర ఒక్క‌టే పాశుప‌తాస్త్రం అనుకుంటే కుద‌ర‌ద‌ని తేల్చి చెబుతున్నారు. ముందుగానే మేల్కొనాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అలా కాకుండా.. వ్య‌వ‌హ‌రిస్తే.. చేటు త‌ప్ప‌ద‌ని మెచ్చ‌రిస్తున్నారు.

ఆ అనుభ‌వాలు..

దేశం లో పాద‌యాత్ర‌ల‌కు ఒక‌ప్పుడు క్రేజ్ ఉండేది. కానీ, త‌ర్వాత కాలంలో నాయ‌కులు చేసిన పాద‌యాత్ర‌కు పెద్ద‌గా ఫ‌లితం ద‌క్క‌లేదు. బీహార్‌లో జ‌న్ సురాజ్ పార్టీని స్థాపించిన పీకే(ప్ర‌శాంత్ కిశోర్‌) పాద‌యాత్ర చేసినా.. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. పోనీ.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ .. గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేసినా.. అనుకున్న గ్రాఫ్ రాలేదు. ఈ విష‌యాల‌ను నాయ‌కులు గుర్తు చేస్తున్నారు.

అంతేకాదు..

పాద‌యాత్ర‌పై జ‌గ‌న్ ఆశ‌లు పెట్టుకున్నా.. ప్ర‌జ‌ల్లో ఆ త‌ర‌హా.. చ‌ర్చ కూడా జ‌ర‌గ‌డం లేద‌ని అంటున్నారు. పైగా.. ష‌ర్మిల నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కు.. కొత్త అస్త్రాల‌తో రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్న ప‌రిణామాల‌ను వారు వివ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల ను ఆక‌ట్టుకునేందుకు సిద్ధం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. అలా కాకుండా.. పాద‌యాత్ర వ‌ర‌కు వేచి చూస్తామంటే.. ప్ర‌జ‌ల‌ను ఒప్పించ‌డం.. మెప్పించ‌డం కూడా క‌ష్ట‌మ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.