అంబటికి బెయిల్- బయటకు వస్తున్నారా ?
ఇదిలా ఉంటే అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన మీద 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా పేరుతో మోసం చేశారని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
By: Satya P | 18 Feb 2026 2:44 PM ISTమాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుకు ఎట్టకేలకు బెయిల్ దక్కింది. దాంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తారని వైసీపీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉంటే అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన మీద 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా పేరుతో మోసం చేశారని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కేసులో బెయిల్ ని అంబటి తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు
మూడవ బెయిల్ :
ఇదిలా ఉంటే ఈ కేసులో అంబటిని కస్టడీలో తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పెట్టుకున్న పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. దాంతో మూడో కేసులో సైతం బెయిల్ లభించినట్లు అయింది. అంబటిని జనవరి 31న ఏపీ సీఎం చంద్రబాబుని దూషించిన కేసులో 14 రోజుల రిమాండ్ తో రాజమండ్రి జైలుకు తరలించారు. ఆ తరువాత ఆ కేసులో బెయిల్ వచ్చింది కానీ పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అన్న మరో కేసులో ఆయన మీద పీటీ వారెంట్ జారీ చేశారు. ఇక అ ఆ కేసులో బెయిల్ వచ్చింది. అంబటి విడుదల అవుతారు అనుకుంటే మూడవ కేసుగా సత్తెనపల్లి పీ ఎస్ లో నమోదు చేశారు. ఈ కేసులో సైతం బెయిల్ రావడంతో అంబంటి విడుదల అవుతారు అని భావిస్తున్నారు.
మొత్తంగా 20 రోజులు :
అంబటి రాంబాబు దాదాపుగా ఇరవై రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆయన గతంలో కూడా కేసులను ఎదుర్కొన్నా ఎపుడూ జలుకు వెళ్ళింది లేదని ఆయన కుమార్తె అంబటి మౌనిక ఈ మధ్యనే టీవీ చానల్ కి చెప్పారు. అంబటి నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇది తొలి జైలు. అయితే మూడు కేసులల వల్లన ఆయన మూడు వారాల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది అని అంటున్నారు. మరి ఏ కొత్త కేసు ఆయన మీద పడకపోతే ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఫైర్ బ్రాండ్ గా :
మరో వైపు చూస్తే వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ గా అంబటి ఉన్నారు. ఆయన మీడియా సమావేశాలలో ప్రత్యర్థుల మీద పదునైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన మాటలలో విమర్శలలో వెటకారం సెటైర్లు ప్రత్యర్ధులకు బలంగానే గుచ్చుకుంటాయి. తనకు జైలు అరెస్టులు భయం లేదని చెప్పిన కొద్ది రోజుల వ్యవధిలోనే అంబటి జైలు పాలు కావడం విశేషం అయితే ఎక్కువ రోజులు ఉండడం మరో విషయం. ఇక అంబటి బయటకు వచ్చాక ఎలా ఉంటారు అన్న ప్రశ్నకు ఆయన కుమార్తె మౌనిక ఇంతకు రెట్టింపుగా ఆయన రాజకీయాల్లో దూకుడు చేస్తారు అని బదులివ్వడం విశేషం. చూడాలి మరి అంబటి జైలు నుంచి విడుదల అనంతర పరిణామాలు ఏ విధంగా ఉంటాయో.
