వైసీపీలో పోస్టులు ఖాళీ.. ఎప్పటికి భర్తీ ..!
ఇక, నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన పోలుబోయిన అనిల్ కుమార్‌యాదవ్ తిరిగి తన నియోజ కవర్గానికి చేరుకున్నారు.
By: Garuda Media | 13 Dec 2025 2:00 AM ISTవైసీపీలో చాలా కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంపై పార్టీకిఇప్పటికీ ఒక నిర్దేశిత అం చనా కానీ.. నిర్దేశిత ప్రణాళిక కానీ కనిపించడం లేదు. సాధారణంగా ఒక సంస్థలో పోస్టులు ఖాళీ ఉంటే.. ఇతర ఉద్యోగులపై భారం పడుతుంది. అదే రాజకీయాల్లో పోస్టులు ఖాళీగా ఉంటే.. ఇతర నాయకులపై భారం పడుతుందా? అనేది చెప్పడం కష్టం. కానీ, ఆ ఖాళీల కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడుతుందన్నది వాస్తవం. ఈ విషయాన్ని వైసీపీ గ్రహించలేకపోతోంది.
విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్థానాలతోపాటు నరసరావుపేట, మచిలీపట్నం వంటి పార్లమెంటు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన వారు ఇప్పుడు కనిపించడం లేదు. విజ యవాడలో కేశినేనినానికి టికెట్ ఇచ్చారు. ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. గుంటూరు నుంచి పోటీ చేసిన నేత.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మచిలీపట్నంలో నాయకులు మౌనంగా ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ జెండా మోసే వారు కనిపించడం లేదు.
ఇక, నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన పోలుబోయిన అనిల్ కుమార్‌యాదవ్ తిరిగి తన నియోజ కవర్గానికి చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయనని.. నెల్లూరు సిటీలోనే ఉంటానని కూడా ఆయన చెబుతున్నారు. ఇక, చీరాల, మాచర్లలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ నుంచి తప్పుకుంటారన్న చర్చ తెరమీదికి వచ్చింది. అయితే.. ఆయన సతీమణి పోటీ చేసే యోచనలో ఉన్నారు.
ప్రస్తుతం ఇలా చాలా నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయి. మరీముఖ్యంగా పార్టీ అధినేత జగన్ నివసిస్తు న్న ఇంటికి సమీపంలోనే రెండు మూడు నియోజకవర్గాల్లో పార్టీ జెండా మోసే నాయకులు లేక పోవడం మరింత చిత్రంగా ఉంది. మంగళగిరి సహా.. రేపల్లెల్లో నాయకులు లేరు. మరి ఈ పోస్టులు భర్తీ చేసేది ఎప్పుడు? పార్టీని లైన్‌లో పెట్టేది ఎప్పుడు? అనే విషయాలను అధినేత పట్టించుకుంటున్నారా? అంటే.. కష్టమే. సో.. ఇప్పుడు ఆ పోస్టుల కోసం ఎవరూ ముందుకు రాకపోవడం కూడా విశేషం.
