Begin typing your search above and press return to search.

వైసీపీ గుక్క తిప్పుకోలేని వ్యూహంతో జనసేన !

అదే సమయంలో జనసేన కనుక అధికారం చేపడితే పవన్ సీఎం అవుతారు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇందులో రెండవ మాటకు ఏ మాత్రం తావు లేదన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

By:  Satya P   |   28 Jun 2026 9:35 AM IST
వైసీపీ గుక్క తిప్పుకోలేని వ్యూహంతో జనసేన !
X

వైసీపీ ఈ మధ్య సామాజిక సమీకరణ విషయంలో జాగ్రత్త పడుతోంది. పోయిన చోట వెతుక్కోవాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఉత్తరాంధ్రా నుంచి దక్షిణ కోస్తా జిల్లాల దాకా ఉన్న 101 అసెంబ్లీ సీట్లలో తీవ్ర ప్రభావం చూపించే కాపుల మద్దతు కోసం కీలక చర్యలను తీసుకుంటోంది. కాపులను జనసేనను దూరం చేసే ఎత్తుగడలకు దిగుతోంది. వైసీపీ కాపు నేతల వరస మీటింగ్స్ అందులో భాగమే అని అంటున్నారు. అయితే జనసేన కూడా వీటిని అంతే ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధపడుతోంది. ఈ క్రమంలో జనసేన కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వైసీపీకి సూటి ప్రశ్నలనే సంధించారు. ఒక విధంగా అది గుక్క తిప్పుకోలేని విధంగా ఉందని అంటున్నారు.

కాపులను సీఎం చేయగలరా :

వైసీపీ కాపు నేతలు ఇటీవల సమావేశం కావడం మీద వారి విమర్శల మీద ఆయన మాట్లాడుతూ వైసీపీ నుంచి రానున్న కాలలో అయినా మరిన్ని ఎన్నికలలలో అయినా కాపుల నుంచి ముఖ్యమంత్రి రాగలరా అని ప్రశ్నించారు. కాపులను ముఖ్యమంత్రి చేస్తామన్ వైసీపీ అధినాయకత్వం చెప్పగలదా అని కూడా ఆయన నిగ్గదీశారు. కాపుల విషయంలో ముఖ్యమంత్రి మీకే అని ధైర్యంగా ప్రకటించే సత్తా వైసీపీ హైకమాండ్ కి ఉందా అని ఆయన లాజిక్ గానే క్వశ్చన్ వేశారు.

జనసేన వస్తే పవన్ సీఎం :

అదే సమయంలో జనసేన కనుక అధికారం చేపడితే పవన్ సీఎం అవుతారు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇందులో రెండవ మాటకు ఏ మాత్రం తావు లేదన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. మరి వైసీపీ నేతలకు కాపుల మీద ఉన్న చిత్త శుద్ధి ఏమిటి అని ఆయన డైరెక్ట్ గానే నిలదీసినట్లు అయింది. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ సీఎం అవుతారని అదే జనసేన అధికారంలోకి వస్తే పవన్ అవుతారని చెప్పడం ద్వారా జనసేన సరికొత్త స్ట్రాటజీనే అమలు చేస్తోంది అని చెప్పాలి.

కాపుల విషయంలోనే :

కాపులకు అన్యాయం జరిగింది అని ఈ రోజున వైసీపీ కాపు నేతలు గగ్గోలు పెడుతున్నారు కానీ వైసీపీలో రాజ్యాధికారం కాపులకు అన్న ప్రసక్తే ఉండదని జనసేన గట్టిగా చెప్పదలచింది అని అర్థం అవుతోంది. కాపులకు వారి సుదీర్ఘమైన కోరిక తీరాలంటే జనసేన మాత్రమే సరైన రాజకీయ వేదిక అని కూడా స్పష్టం చేయదలచుకున్నట్లుగా అర్ధం అవుతోంది. కాపుల విషయంలో అసంతృప్తి లేని దానిని ఉన్నది అన్నట్లుగా క్రియేట్ చేసి జనసేనకు వారిని దూరం చేసే వైసీపీ ఎత్తుగడలను చిత్తు చేసే విధంగా జనసేన ఎంపీ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

వారిలో ఆలోచనల కోసమే :

కాపులలో ఆలోచనలు రగిలించేందుకే ఈ విధంగా జనసేన సరికొత్త వ్యూహం అమలు చేస్తోంది అని అంటున్నారు. కాపులు జనసేనతో అల్లుకుని పోయి అనుబంధంగా ఉన్నారు. వారిని విడదీయడం వల్ల వైసీపీ అధినాయకత్వానికి లాభం తప్ప కాపులకు కానే కాదని ఒక సందేశాన్ని ఇవ్వడానికే జనసేన చూస్తోంది అని అంటున్నారు. కాపుల నుంచి సీఎం అనేది వారి దశాబ్దాల కోరిక. అది తీరేది ఏ పార్టీ అన్నది కాపులకు తెలియనిది కాదు అన్న ధీమా కూడా జనసేనలో ఉందని అంటున్నారు. అయితే ఏ మాత్రం ఏమరుపాటుకు గురి కాకుండా కాపులంతా ఐక్యంగా ఉండాలన్న వైఖరితోనే జనసేన ఈ విధంగా వైసీపీనే సూటిగా డైరెక్ట్ గా కార్నర్ చేసింది. బహుశా దీనిని వైసీపీ నుంచి ధీటైన జవాబు రాకపోవచ్చు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ అతి ఉత్సాహానికి వరసబెట్టి పెడుతున్న కాపుల అత్మీయ సదస్సులకు జనసేన ఎంపీ ఒకే ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ ద్వారా కూసాలు కదిల్చారు అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో.