Begin typing your search above and press return to search.

బాబు వెళ్ళారు...జగన్ వెళ్ళి ఉండాల్సింది !

వైసీపీ దారుణ పరాజయం పాలు అయి పదిహేను నెలలు పూర్తి అయ్యాయి. లోపాలు ఏమిటో ఈపాటికి అందరికీ అర్ధం అయి ఉండాలి.

By:  Satya P   |   13 Sept 2025 6:57 PM IST
బాబు వెళ్ళారు...జగన్ వెళ్ళి ఉండాల్సింది !
X

వైసీపీ దారుణ పరాజయం పాలు అయి పదిహేను నెలలు పూర్తి అయ్యాయి. లోపాలు ఏమిటో ఈపాటికి అందరికీ అర్ధం అయి ఉండాలి. జగన్ కూడా బాగానే అర్థం చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. అందుకే ఆయన తాజా ప్రెస్ మీట్ లో తమ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసింది అని వాటిని సరిగ్గా జనాలకు చెప్పుకోలేకపోయామని అన్నారు. అంటే ప్రచారంలో బాగా వెనకబడిపోయామని జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనుకోవాలి. మరి అన్నీ తెలిసిన తర్వాత కూడా పైగా పార్టీ ఘోర ఓటమి తరువాత అవే తప్పులను చేస్తున్నారా న్న చర్చ అయితే సాగుతోంది.

ఒక భారీ వేదికగా :

విజయవాడలో ఒక రోజు అంతా ఒక ప్రముఖ వెబ్ మీడియా కాంక్లేవ్ నిర్వహించారు. ఇందులో ఏపీ రాజకీయాల గురించి జనాలకు స్థూలంగా వివరించే ప్రయత్నం జరిగింది. చాలా మంది రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. అధికార కూటమిని విపక్ష వైసీపీని కూడా పిలిచారు సాధారణంగా ఏపీ రాజకీయాలు చూసే వారికి అటు చంద్రబాబు ఇటు జగన్ వస్తారనే అనిపిస్తుంది. వారి లెక్క తప్పు కాకుండా చంద్రబాబు వచ్చారు. చాలా సేపు ఆయన ఆ కాంక్లేవ్ లో మాట్లాడారు. అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా చెప్పారు. 2024 తర్వాత తమ ప్రభుత్వం ఏమి చేసింది, ఫ్యూచర్ లో ఏమి చేయబోతోంది అని చెప్పారు, మరో నాలుగేళ్ళ గురించే కాదు 2047 దాకా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు తన విజన్ ని ఆయన ఆవిష్కరించారు.

వైసీపీ సైతం చెప్పాల్సింది :

ఒక విధంగా ఇది బాబుకు అందిన మరో వేదిక కావచ్చు. ఆయన ప్రతీ రోజూ ఏదో వేదిక మీద మాట్లాడుతూనే ఉంటారు. తమ ప్రభుత్వం ఏమి చేసింది అన్నది నిరంతరం ప్రజలకు చేరవేస్తూ ఉంటారు. ఆయన ఒక్కరే కాదు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా జాతీయ వేదిక మీద అనేక జాతీయ చానళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలా కనుక చూస్తే కూటమి ప్రభుత్వానికి ఈ కాంక్లేవ్ మరో అవకాశంగా మాత్రమే చూడాల్సి ఉంది. కానీ వైసీపీకి ఇది మంచి ఫ్లాట్ ఫారం గా చెప్పాలి. అందుకే వైసీపీ అధినేత జగన్ ఈ కాంక్లేవ్ ని వచ్చి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం ఒకటి వినిపిస్తోంది అంటున్నారు.

ఆయన బదులు జగన్ అయితే :

ఇక ఈ కాంక్లేవ్ కి వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా అయిదేళ్ళ పాటు పనిచేసిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఇద్దరూ చాలా వాటికి సమాధానాలు చెప్పారు. తమ పాలసీలు తాము అయిదేళ్ల పాటు పాలించిన క్రమంలో జరిగిన మంచి ఏమిటో వివరించే ప్రయత్నం చేశారు. అయితే సజ్జల ప్లేస్ లో జగన్ వచ్చి ఉంటే వేరే లెవెల్ లో ఉండేది అని అంటున్నారు. మాజీ ఆర్థిక మంత్రిగా బుగ్గన ఎటూ పక్కన ఉంటూ గణాంకాలు చెబుతారు. జగన్ తాము అయిదేళ్ళూ ఏమి చేశాం, తమ హయాంలో ఏ అభివృద్ధి జరిగింది, తన విజన్ ఏమిటి ఫ్యూచర్ ఏపీ విషయంలో తన ఆలోచనలు ఏమిటి అన్నది గట్టిగా చెప్పి ఉండాల్సింది అని అంటున్నారు.

పార్టీ ఎలివేట్ అవుతుందని :

ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో అయితే జగన్ తమ పార్టీ స్టాండ్ ఏమిటో చెప్పి ఉంటే జనాలకు అది బాగా వెళ్ళేదని ఆ విధంగా వైసీపీకి సానుకూలత వచ్చేది అని అంటున్నారు. అంతే కాదు కేవలం బటన్ నొక్కుడుకే అయిదేళ్ళ వైసీపీ ప్రభుత్వం పరిమితం అయింది అన్న ప్రత్యర్ధుల ఆరోపణలను తిప్పికొడుతూ తాము చేపట్టిన ప్రాజెక్టుల గురించి చెప్పుకునేందుకు వీలు ఉండేది అని అంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల విషయంలో వైసీపీ వాదన ఏమిటి అన్నది జనంలోకి బలంగా వెళ్లేది అని అంటున్నారు అయితే జగన్ ఈ కాంక్లేవ్ కి రాకపోవడం పట్ల అయితే చర్చ సాగుతోంది. వైసీపీలో ప్రచార లోపం ఉంది అని పెద్దలు అంతా అంగీకరిస్తున్నా ప్రజలకు చేరువ చేసే మీడియా ముఖంగా వాటిని విడమరచి చెప్పే అవకాశాలను ఎందుకు దూరం పెడుతున్నారు అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తం మీద చూస్తే అటు అసెంబ్లీకి కానీ ఇటు మీడియాకు కానీ దూరంగా ఉంటే వైసీపీ పాలసీలు కానీ ఆలోచనలు కానీ జన బాహుళ్యానికి ఎలా తెలుస్తాయి అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అభిమానులు అయితే జగన్ మీడియాతో బాగా ఇంటరాక్ట్ అయితేనే పార్టీ ఎలివేట్ అవుతుందని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో అయినా అది జరుగుతుందేమో.