వ్యక్తులు కాదు.. విధానాలతోనే వైసీపీ హవా.. !
రాజకీయ పార్టీలు వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కంటే ప్రజా సమస్యలపై పోరాడితేనే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. 2019లో జగన్ ప్రజా సమస్యలతో విజయం సాధించారని, ఆ తర్వాత వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం 2024లో వైసీపీకి ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కూడా ప్రతిపక్షంలో ప్రజా సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించిందని గుర్తుచేస్తున్నారు.
By: Garuda Media | 12 Nov 2026 5:00 AM ISTవ్యక్తులను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ఇది అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. కానీ,ఇది అంతగా సక్సెస్ కాలేదని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు వైసీపీ అధినేత జగన్.. 2019 ఎన్నికలకు ముందు వ్యక్తులు కాకుండా.. విధానపరమైన అంశాలను పునాదులుగా చేసుకుని పాదయాత్ర చేశారు. అది సక్సెస్ అయింది. పేదలు, బీసీలు, ఎస్సీ,ఎస్టీల సమస్యలు ప్రస్తావించారు. అదేసమయంలో ఇతర వర్గాల వ్యక్తిగత అంశాలను కూడా.. ఆయన ఎన్నికలకు ముందు కీలకంగా తీసుకున్నారు.
దీనిలో ఉద్యోగుల నుంచి వైద్యులు, లాయర్లు ఇలా.. అన్ని వర్గాల వారు ఉన్నారు. ఫలితంగావారికి భరోసా ఇవ్వగలి గారు. ఇది.. ఆయనకు అప్రతిహత విజయాన్ని కట్టబెట్టింది. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత.. విధానాలను వదిలేసి.. చంద్రబాబును వేధించడం.. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం,.. టీడీపీ విధానాలను అడ్డు పెట్టి.. ప్రజలను కూడా వేధించడం వంటివి అమరావతి రాజధాని రైతుల విషయంలో స్పష్టంగా కనిపించింది. అంటే.. అప్పటి వరకు అనుసరించిన విధానపరమైన అంశాలను వదిలేశారు.
ఈ పరిణామం 2024 ఎన్నికల్లో ప్రభావం చూపింది. అంటే.. ఏ పార్టీ అయినా.. విధానపరమైన అంశాలను అందిపు చుకుంటేనే గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుటు టీడీపీ విషయానికి వస్తే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఒకవైపు జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నా...మరోవైపు ప్రజల సమస్యలను.. ఇసుక, ఉద్యోగులు, గుంతల మయమైన రహదారులు, వేధింపులు, సోషల్ మీడియా కేసులు, నిత్యావసరాల ధరలు, మద్యం మరణాలు, భూములు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ఇలా అనేక విధానపరమైన అంశాలను ప్రస్తావించింది. ఫలితంగా ప్రజలు భారీ సంఖ్యలో టీడీపీ కూటమికి కనెక్ట్ అయ్యారు.
మరి ఇప్పుడు వైసీపీ ఏం చేస్తోందంటే.. స్టిల్ ప్రజెంట్ కూడా.. వైసీపీ విధానపరమైన అంశాలను వదిలేసింది. కేవలం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వీడియోలు, ఆడియోలు, గ్రాఫిక్‌లను నమ్ముకుంది. ఇది ఏమైనా ఫలితాన్ని ఇచ్చిందా? అంటే.. స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి షాక్ ఇచ్చారు. అలా కాకుండా.. ప్రజల సమస్యలను అందిపుచ్చుకుంటే.. ఆ ఫలితం వేరేగా ఉండేదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి పార్టీ ఎప్పుడూ.. ప్రజల మధ్య ఉండడం.. వారి సమస్యలు ప్రస్తావించడం వంటివి చేస్తేనే పుంజుకుంటుందని అంటున్నారు. ఇది నాయకుడైనా పార్టీకైనా ఒకే సూత్రం వర్తిస్తుందని చెబుతున్నారు.
