Begin typing your search above and press return to search.

పులివెందుల నేతలకు నేరుగా జగన్ ఫోన్లు...ఎందుకంటే ?

జగన్ చాలా కాలం తరువాత తమ ప్రాంతం నాయకులతో డైరెక్ట్ గానే కాంటాక్ట్ లోకి వచ్చారు అని అంటున్నారు. అసలు ఏమిటి జరిగింది అని ఆరా తీసారని అంటున్నారు.

By:  Satya P   |   25 Aug 2025 6:00 AM IST
పులివెందుల నేతలకు నేరుగా జగన్ ఫోన్లు...ఎందుకంటే ?
X
c

పులివెందుల అన్నది వైఎస్సార్ ఫ్యామిలీకి పెట్టని కోట. ఆ కోట తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కుప్ప కూలిపోయింది. అధికారంలో ఉన్న టీడీపీ దౌర్జన్యం చేసిందని తమ ఓట్లు వేయకుండా చేసిందని వైసీపీ నేతలు ఎన్నో చెప్పవచ్చు. అందులో నిజం కూడా ఎంతో కొంత ఉండొచ్చు. కానీ వైసీపీ పులివెందులలో ఏమైంది. అసలు సీన్ లో కనిపించిందా. ఎందుకు ముందే చేతులెత్తేసింది, ఎందుకు బేలగా దీనంగా మారిపోయింది. ఎందుకు చతికిలపడింది ఇవే కదా అసలైన ప్రశ్నలు.

అధినాయకత్వంలో ఆందోళన :

ఏపీలో 11 సీట్లకే పరిమితం అయిన 2024 ఎన్నికల ఫలితాలను చూసినా ఇంత ఆందోళన రాలేదు, ప్రతిపక్ష స్థానం దక్కకపోయినా ఇంత బాధ కలగలేదు, కానీ కంచుకోట లాంటి పులివెందులలో ఓటమితో వైసీపీ అధినాయకత్వంలో ఎక్కడ లేని కలవరం చెలరేగుతోంది అని అంటున్నారు. అవును అధినాయకుడు జగన్ ఇంటి ముంగిటే ఓటమి వరిస్తే ఇక ఏపీలో పార్టీ సంగతి ఏమిటి ఎలా అన్నవే ప్రశ్నలు. ఈ కారణంతోనే పులివెందుల విషయంలో వైసీపీ హైకమాండ్ లో ఎక్కడ లేని చింతన కనిపిస్తోంది అని అంటున్నారు.

మౌనం వెనక భయాలు :

మూడు తరాలుగా వైసీపీ కుటుంబానికి వెన్నంటి నిలిచిన నాయకులు పులివెందులలో ఉన్నారు. ఇపుడు వారు మౌనంగా ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే రాజకీయాలను పార్టీని దాదాపుగా పక్కన పెట్టేసినట్లుగా సీన్ చూస్తే అర్ధం అవుతోంది. మా నాయకుడు మా పార్టీ అన్న కసి పట్టుదల అయితే పెద్దగా ఎవరిలో కనిపించడంలేదని అంటున్నారు. అందువల్లనే తాజాగా జరిగిన పులివెందులలో ఎన్నికల్లో అధికార పక్షానికి చెందిన నాయకులు వేరే చోట నుంచి జనాలను తెచ్చి ఓట్లు వేయించారు అని ఆరోపణలు ఉన్నా లోకల్ వైసీపీ లీడర్స్ ఫుల్ సైలెన్స్ పాటించారు అని అంటున్నారు.

డైరెక్ట్ గానే ఎంట్రీ :

జగన్ చాలా కాలం తరువాత తమ ప్రాంతం నాయకులతో డైరెక్ట్ గానే కాంటాక్ట్ లోకి వచ్చారు అని అంటున్నారు. అసలు ఏమిటి జరిగింది అని ఆరా తీసారని అంటున్నారు. పులివెందులలో ఇతర ప్రాంతాల వారు వచ్చి ఓటింగులో పాల్గొంటే కనీసంగా కూడా ప్రతిఘటించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు అని ఆయన ప్రశ్నించారు అని అంటున్నారు. అంతే కాదు మన ప్రాంతంలో మనం ముందుండాల్సిన చోట కనీసంగా కూడా నోరు ఎత్తకపోవడమేంటి అని కూడా ఆయన సందేహాలు వెలిబుచ్చారని అంటున్నారు. ఇలా అయితే ఎలాగా అని కూడా ఆయన వారినే సూటిగా ప్రశ్నించారు అని అంటున్నారు.

క్యాడర్ బాధలు ఇవేనా :

అయితే జగన్ ముందు తన బాధలు సమస్యలను నాయకులు స్థానికంగా ఉన్న వారు తెచ్చే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. తాము అన్ని రకాలుగా ఇబ్బందులో ఉన్నామని తమను ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాము ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్నామని వారు చెప్పినట్లుగా అంటున్నారు. నిజం చెప్పాలీ అంటే వైసీపీ మీద అభిమానంతో వైఎస్సార్ కుటుంబం మీద ప్రేమతో ఆర్ధికంగా చాలా మంది నాయకులు ఇబ్బందులు పడినా జెండా ఎత్తారని అంటున్నారు. అయితే వారు వైసీపీ అధికారంలో ఉన్నపుడు కాంట్రాక్టులు చేసినా బిల్లులు ఇప్పించలేకపోయారు అని వైసీపీ పెద్దల మీద చాలా ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు.

వారిలో స్తబ్దత ఉదాశీనత :

ప్రభుత్వం దిగిపోయింది కూటమి అధికారంలోకి వచ్చింది. తమ బిల్లులు క్లియర్ చేయాలని ఈ రోజున కూటమి నాయకులను వారు బతిమాలుకునే పరిస్థితి ఉందని ఈ నేపధ్యంలో వారు కూటమిని ఎదురు నిలిచి ఎన్నికల్లో ఎలా ముందు నిలుస్తారు అని అంటున్నారు. అయిదేళ్ళ పాటు వైసీపీ అధికారంలో ఉన్నా పార్టీ వారిని తమ సొంత ఊరు వారిని సైతం పట్టించుకోకపోవాం వల్లనే ఈ రకమైన పరిస్థితి ఉందని అంటున్నారు అందుకే వారిలో స్తబ్దత ఉదాశీనత ఏర్పడ్డాయని అంటున్నారు. ఇప్పటికైనా వారిని అన్ని విధాలుగా అండగా పార్టీ నాయకుల్ నిలిస్తేనే వారు రేపటి ఎన్నికల్లో ముందుకు వస్తారని లేకపోతే సేం సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ ఓటమి తరువాత అయినా అధినేత జగన్ కి వాస్తవాలు తెలిసాయని వారు అంటున్నారుట.