మాచర్ల, నెల్లూరులపై జగన్ ఆరా.. నాయకులపై ఫైర్.. !
పల్నాడు జిల్లా మాచర్ల, నెల్లూరు జిల్లాలు వైసీపీకి కొట్టిన పిండి. గత ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ నాయకులు చేసిన హంగామా అంతా ఇంతాకాదు.
By: Garuda Media | 6 Aug 2025 12:00 PM ISTపల్నాడు జిల్లా మాచర్ల, నెల్లూరు జిల్లాలు వైసీపీకి కొట్టిన పిండి. గత ఎన్నికలకు ముందు వరకు ఇక్కడ నాయకులు చేసిన హంగామా అంతా ఇంతాకాదు. తమకు తిరుగులేదన్నట్టుగా నాయకులు వ్యవహరించా రు. వాస్తవానికి వ్యక్తులు, నాయకుల బలంతోపాటు.. పార్టీ పరంగా కూడా వైసీపీ ఈ రెండు ప్రాంతాల్లోనూ పట్టు దక్కించుకుంది. దీనికితోడు.. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుదీర్ఘ కాలంగా విజయం దక్కించుకున్నారు. దీంతో ఆయన హవా ఎక్కువగా ఉంది. ఇక, నెల్లూరులోనూ వైసీపీకి ఒకప్పుడు తిరుగులేదు.
కానీ.. మారుతున్న పరిణామాలు.. రాజకీయాల నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ అటు నెల్లూరు, ఇటు మాచర్లలోనూ.. వైసీపీ పట్టు వీగిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుస కేసులతో పిన్నెల్లి ఇంటికే పరిమితం అయ్యారు. అంతేకాదు.. ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం.. తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఒక్కరంటే ఒక్కరు కూడా మాచర్లలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికలో పోటీకి ముందుకు రాలేదు. దీంతో అధికార టీడీపీ దీనిని ఏకపక్షంగా కైవసం చేసుకుంది.
అలానే నెల్లూరులోనూ జరిగింది. పోనీ.. మాచర్లలో అంటే.. పిన్నెల్లి ఒంటరయ్యారు. కేసులతో ఉక్కిరి బిక్కి రి అవుతున్నారు కాబట్టి.. ఆయన బయటకు రాలేదని అనుకోవచ్చు. ఎంపీపీగా ఎవరూ బరిలో నిలిచే అవ కాశం కూడా లేకుండా పోయిందని భావించవచ్చు. కానీ, నెల్లూరుకుఏమైంది? ఇక్కడ చాలామంది నాయ కులు ఉన్నారు. పైగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాక్టివ్గా నే ఉన్నారు. అయినా.. ఇక్కడ కూడా వైసీపీ చేతులు ఎత్తేసింది. వాస్తవానికి పోటీలో ఉండి.. ఎన్నికలు జరిగి ఓడిపోతే.. సరే.. అని భావించవచ్చు.
కానీ.. అసలు పోటీలో నిలబడేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ రాజకీయాలు మాకొద్దు.. అన్నట్టుగా నాయకులు వ్యవహారించారు. దీంతో నెల్లూరు జిల్లాలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ఆదిలోనే ఏకపక్షంగా ముగిసిపోయింది. ఈ వ్యవహారంపై జగన్ ఆరా తీశారు. నాయకులు ఏమయ్యారు? ఎందుకు పోటీలో లేరంటూ.. జిల్లా ఇంచార్జ్‌లను ఆయన ప్రశ్నించారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో నాయకులకు అవకాశం లేదని.. అధికార పార్టీ దూకుడు ఎక్కువగా ఉందని నాయకులు చెప్పుకొచ్చారు. దీనిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి.. భయపడుతున్నారా? అని వారిని ప్రశ్నించడం గమనార్హం.
