Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వెరీ వీక్...కొత్త మిత్రులు వస్తారా ?

వైసీపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన పార్టీ. ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు ఎన్నో సార్లు చెప్పారు కూడా.

By:  Satya P   |   17 Nov 2025 9:26 AM IST
కాంగ్రెస్ వెరీ వీక్...కొత్త మిత్రులు వస్తారా ?
X

వైసీపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన పార్టీ. ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు ఎన్నో సార్లు చెప్పారు కూడా. లేటెస్ట్ గా చూస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి అభ్యర్ధిని పక్కన పెట్టి ఎన్డీయే అభ్యర్ధికి వైసీపీ ఓటు చేసింది. ఇక జగన్ ని జైలు పాలు చేయించిందని కేసులు అక్రమంగా పెట్టిందని కాంగ్రెస్ మీద వైసీపీ అధినాయకత్వానికి కోపం ఉందని అంటారు. అది ఎప్పటికీ తీరని ఆరని కోపంగానే ఉంది అని అంటున్నారు.

కాంగ్రెస్ ఏపీ ఫోకస్:

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోవాలని, పునర్ వైభవం కలగాలని ఆ పార్టీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ వివిధ రాష్ట్రాలలో అధికారం కోల్పోవడానికి బలమైన నేతలు పార్టీని వీడడం కారణం అని అంటున్నారు. ముఖ్యంగా సౌత్ లో తీసుకుంటే పాతిక ఎంపీ సీట్లు ఉన్న ఏపీలో వైసీపీని జగన్ స్థాపించాక కాంగ్రెస్ కుదేల్ అయింది. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తమిళనాడులో మిత్రుల పొత్తుతో కొనసాగుతోంది. కేరళలో తన కంటూ బలం ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉంది. ఈ విధంగా చూస్తే సౌత్ లోనే కాంగ్రెస్ కి ఎక్కువ బలం ఉంది, ఆశలు ఉన్నాయి. అయినా సరిపడా ఎంపీ సీట్లు దక్కడం లేదు, దాంతో ఏపీ వైపు కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ చేశారు అని అంటున్నారు.

డీకే వ్యాఖ్యలకు అర్థం :

బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాజయం పాలు కాగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ట్రబుల్ షూటర్ గా పేరు గడించిన డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవం అందుకోవాలంటే బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోవాలని ఆయన చెప్పడం విశేషం. మరి ఆయన ఏ ఉద్దేశ్యంతో చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు అన్న దాని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీ అధినేత జగన్ అయితే అక్కడ బలమైన విపక్షంగా ఉంటున్నారు. పైగా ఆయన బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. బహుశా ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అన్నది కూడా చర్చగా ఉంది.

సేఫ్ జోన్ గా :

ఇక జగన్ ఓటమి తరువాత ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. ఆయన అది సేఫ్ జోన్ గా భావిస్తున్నారు. డీకే శివ కుమార్ కి వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి కారణం ఆయనే అని అంటారు. ఇపుడు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు అయితే లేదు, అంతే కాదు ఆమె వల్ల వర్కౌట్ ఏదీ కాలేదు అని అంటున్నారు. దాంతో నేరుగా జగన్ తోనే పొత్తులకు కాంగ్రెస్ ని ఒప్పించే ప్రయత్నం డీకే చేస్తున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపునకు తగిన వ్యూహాలు అందించి అధికారంలోకి తేవడంలోనూ డీకే కీలక పాత్ర పోషించారు. అంతే కాదు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కి ఆయన ఒక కీలక నేతగా పెద్ద దిక్కుగా ఉంటున్నారు

ఇద్దరూ ఎన్డీయేలోనే :

ఇక దేశంలో చూసుకుంటే ఎన్డీయే మిత్రులు బంధం మరింత గట్టిపడడం ఖాయమని తేలిపోతోంది 2029 నాటికి నితీష్ చంద్రబాబు ఇద్దరూ ఎన్డీయేలోనే ఉంటారు. ఈ ఇద్దరు నేతలను కలుపుకునే బీజేపీ ఎన్నికలకు వెళ్తుంది. దాంతో కాంగ్రెస్ కి ఇండియా కూటమి బలపడడానికి ఎన్డీయేతర పార్టీల అవసరం ఉంది. తమతో ఇప్పటిదాకా కలవని పార్టీలను చేర్చుకోవడం ద్వారా రానున్న కాలంలో అయినా ఎన్డీయేని ఢీ కొట్టే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తుంది అని అంటున్నారు. అలా ఏపీ ఒడిశా తో పాటు వీలైన చోట్ల కాంగ్రెస్ కొత్త మిత్రుల కోసం అన్వేషించే పనిలో ఉంది అని అంటున్నారు. అందులో జగన్ ఉన్నారా లేరా అంటే రానున్న కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.