Begin typing your search above and press return to search.

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

ఏపీలో జరిగిన అర్బన్ బాడీ ఎన్నికల్లో చూస్తే ఒక కీలక పరిణామం గురించిన చర్చ సాగుతోంది.

By:  Satya P   |   4 Nov 2026 11:33 PM IST
కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్
X

ఏపీలో జరిగిన అర్బన్ బాడీ ఎన్నికల్లో చూస్తే ఒక కీలక పరిణామం గురించిన చర్చ సాగుతోంది. మొత్తం 100 దాకా కార్పొరేషన్, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి దక్కినవి నాలుగు మాత్రమే. అందులో అనంతపురం కార్పోరేషన్ తో పాటు నంద్యాల మునిసిపాలిటీ, బేతంచర్ల, నాయుడుపేటలలో వైసీపీ జెండా ఎగరేసింది. ఇందులో రెండు మున్సిపాలిటీలు నంద్యాల జిల్లాలో ఉంటే ఒకటి తిరుపతిలో ఉంది. అలా వైసీపీ విజయం రాయలసీమకు పరిమితం అయింది. అక్కడ నుంచి నెల్లూరు, ప్రకాశం మీదుగా కోస్తా తీరం వైపు వైసీపీ అసలు రాలేకపోయింది అని గుర్తు చేస్తున్నారు.

కోస్తాలోనే షాక్ :

నిజం చెప్పాలీ అంటే వైసీపీకి 2024 ఎన్నికల్లో కూడా మొత్తం కోస్తా జిల్లాలలో అల్లూరి జిల్లాలో రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు తప్ప మొత్తం అంతా ఊడ్చేసినట్లు అయింది. ఉత్తరాంధ్ర నుంచి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు క్రిష్ణా గుంటూరులో వైసీపీ ఎక్కడా కనిపించలేదు. ఇపుడు కూడా అదే విధంగా సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు. వైసీపీకి ఉత్తరాంధ్రాలో కనీసం విజయనగరం మేయర్ సీటు అయినా దక్కుతుందని తొలుత ప్రచారం సాగింది. కానీ అక్కడ వైసీపీ పట్టు జారింది, చిన్న శ్రీను పార్టీని వీడిపోవడం మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా టీడీపీలో చేరడంతో తారు మారు అయింది అని అంటున్నారు. లేకపోతే విజయనగరం కార్పోరేషన్ వైసీపీ పరం అయ్యేదని చెబుతున్నారు.

ఇంచార్జిలు పనితీరు :

జగన్ పదే పదే చెబుతున్నా ఇంచార్జిల పనితీరు అలాగే ఉంది అని అంటున్నారు. ఏకగ్రీవాలు లేకుండా చూసుకోండి అన్న జగన్ మాటనే వారు వేరేగా వాడారని అంటున్నారు. ఏదో తంటాలు పడి అభ్యర్థి చేత నామినేషన్ వేయించేస్తే చాలు అని ఆలోచించారు అంటున్నారు. దాంతో బలమైన అభ్యర్ధులను ఎక్కడా పోటీకి పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. అండగా అభ్యర్ధులకు ఉండాలని అధినేత అంటే దానిని కూడా వదిలేశారు అని అంటున్నారు. దాంతో గెలుపు అవకాశాలు ఉన్న చోట్ల కూడా వైసీపీకి నాయకుల నుంచి సహకారం లభించలేకపోవడం వల్ల వారు ఓటమి పాలు అయ్యారని అంటున్నారు. అలా జీవీఎంసీ పరిధిలో అనకాపల్లి జోన్ లో రెండు డివిజన్లు గెలుపు చాన్స్ ఉన్నా వైసీపీ పోగొట్టుకుందని అంటున్నారు. అదే విధంగా భీమిలీ నియోజకవర్గం ఇంచార్జి గా బొత్స అనూష విజయనగరం జెడ్పీటీసీగా పోటీ చేయడంతో అక్కడ వైసీపీ పూర్తిగా ఎవరికీ పట్టనట్లు అయింది. దాంతో మొత్తం సీట్లు టీడీపీ ఖాతాలో పడ్డాయని అంటున్నారు.

గోదావరిలో స్ట్రాంగ్ గా :

ఇక గోదావరి జిల్లాలు అసలే జనసేన టీడీపీకి పట్టు ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కలసి గట్టిగానే పనిచేశాయి. దాంతో వైసీపీ ముందే చేతులు ఎత్తేసింది అన్న టాక్ వినిపిస్తోంది. బలంగా పోరాడితే ఎంతో కొంత ప్రయోజనం ఉంది అనుకున్న చోట కూడా ఎందుకులే అని చాలా మంది ఇంచార్జిల వ్యవహారంతో వైసీపీకి దక్కాల్సినవి కూడా కాకుండా పోయాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ ఇంకా నిద్రావస్థలో ఉంది అని స్థానిక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అంటున్నారు. పార్టీ మొత్తంగా రిపేర్లు చేసుకోకపోతే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ హితైషులు హెచ్చరిస్తున్నారు.