Begin typing your search above and press return to search.

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

ఏపీలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చాలా మంది 100లోపు ఓట్ల మెజారిటీతోనే గ‌ట్టెక్కారు. వీరిలో టీడీపీ నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నారు.

By:  Garuda Media   |   3 Nov 2026 11:43 PM IST
ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!
X

ఏపీలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చాలా మంది 100లోపు ఓట్ల మెజారిటీతోనే గ‌ట్టెక్కారు. వీరిలో టీడీపీ నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నారు. మ‌రికొన్ని చోట్ల అంటే.. కొన్నికొన్నిస్వ‌ల్ప ప్రాంతాల్లో మాత్ర‌మే.. 200-250 ఓట్ల మెజారిటీ ద‌క్కించుకున్నారు. కానీ.. భారీ సంఖ్య‌లో టీడీపీ ద‌క్కించుకున్న మునిసిపాలిటీల‌లో మాత్రం 50-100 లోపు ఓట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఒక్క ఓటు లేదా .. 5 ఓట్ల మెజారిటీతోనూ కొంద‌రు విజ‌యం ద‌క్కించుకున్నారు. వారి వివ‌రాలు ఆస‌క్తిగా ఉన్నాయి.

మంత్రి ఇలాకాలో..

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి స‌త్య‌కుమార్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని మునిసిపాలిటీ కి జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి ఒకే ఒక్క ఓటుతో విజ‌యం ద‌క్కించుకున్నారు. ధర్మవరం మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఒక్క ఓటు మెజార్టీతో వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ విజయం సాధించారు. దీంతో ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిచిన బీజేపీ అభ్య‌ర్థి ల‌క్ష్మీదేవి రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు. ఫ‌లితంగా అధికారులు మ‌రోసారి ఓట్ల‌ను లెక్కించారు. అయితే.. ఈ సారి కూడా వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం గెలుపు గుర్రం ఎక్క‌డం గ‌మ‌నార్హం.

భారీ మెజారిటీతో..

ఉయ్యూరులో మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థి దివ్య 900 మెజార్టీ ద‌క్కించుకున్నారు. ఇది ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోనే అత్యంత భారీ మెజారిటీగా నిలిచింద‌ని అధికారులు తెలిపారు. అలానే.. ఇదే జిల్లాలోని నందిగామ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైసీపీ బోణీ కొట్టింది. 5వ వార్డులో వైసీపీ అభ్యర్థి పి. శ్రావణి 134 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు . ఇక‌, కేవ‌లం 60 ఓట్ల మెజార్టీతో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కమ్మగంటి శారదా దేవి ఇక్క‌డే విజ‌యం ద‌క్కించుకున్నారు.

గుంటూరులో ఆప‌లేక పోయారు..

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప‌రిస్థితి ఎలాఉన్నా.. రాజ‌ధాని ప్రాంత‌మైన గుంటూరు, తెనాలిలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామ‌ని కూట‌మి నాయ‌కులు ప్ర‌క‌టించారు. కానీ, వారు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. గుంటూరు కార్పొరేషన్ లో 76 వార్డుల్లో తెలుగుదేశం 9 వార్డుల్లో, జనసేన 2 వార్డుల్లో, వైసీపీ 2 వార్డుల్లో విజ‌యం ద‌క్కించుకున్నా యి. ఇక‌, తెనాలి మున్సిపాలిటీలో తెలుగుదేశం 10 వార్డుల్లో, జనసేన 5 వార్డుల్లో, వైసీపీ 2 వార్డుల్లో గెలుపు గుర్రం ఎక్కాయి. మొత్తంగా వైసీపీని ప‌క్క‌న పెట్టాల‌ని అనుకున్నా.. ఆయా స్థానాల్లో సాధ్యం కాలేదు.