జగన్ ఓకే అన్నారుట...క్యాడర్ ఫుల్ హుషార్
అవునా నిజమేనా అంటే వైసీపీ వర్గాల ప్రచారం చూస్తే అదే నిజం అని అంటోంది. ఇంతకీ ఏమిటా మ్యాటర్ అంటే వైసీపీకి సంబంధించినంతవరకు అది చాలా జోష్ ని తెచ్చే విషయం అని అంటున్నారు.
By: Satya P | 8 Nov 2025 11:00 PM ISTఅవునా నిజమేనా అంటే వైసీపీ వర్గాల ప్రచారం చూస్తే అదే నిజం అని అంటోంది. ఇంతకీ ఏమిటా మ్యాటర్ అంటే వైసీపీకి సంబంధించినంతవరకు అది చాలా జోష్ ని తెచ్చే విషయం అని అంటున్నారు. వైసీపీకి 2024 ఎన్నికల్లో భారీ ఓటమి సంభవించింది. అయితే దాని కంటే ఎక్కువగా అధినాయకత్వం దూరం పెడుతోంది క్యాడర్ ని పట్టించుకోలేదు అన్న బాధ ఎక్కువగా ఉంది అని చెప్పుకున్నారు. నిజానికి వైసీపీకి ఓటమి వస్తే రావచ్చు కానీ ఈ స్థాయిలో అయితే సీట్లు రావడం అంటే అది పూర్తిగా క్యాడర్ కాడె వదిలేయడం వల్లనే జరిగింది అన్నది వైసీపీ తొలి నాళ్ళలో చేసుకున్న పోస్ట్ మార్టం లోనే తెలిసింది. అయితే ఆ మీదట కూడా వైసీపీ పెద్దగా చేసింది లేదని అంటున్నారు. క్యాడర్ తోనే ఏ పార్టీ అయినా ఉంటుంది. ఆ సంగతి తెలిసి కూడా వైసీపీ క్యాడర్ లో అసంతృప్తి పోగొట్టి వారిని దగ్గరకు చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోలేదని అంటున్నారు.
హానీమూన్ ముగిసింది :
మరో వైపు చూస్తే ఏపీలో కూటమి పాలనకు హానీ మూన్ ముగిసింది. ఏడాదిన్నర కాలం పాలన అవుతోంది. ఇదే సరైన సమయం అని కూడా వైసీపీలో ఉన్న మాట. దేనికి అంటే అధినాయకత్వం మేలుకుని జనంలోకి రావడానికి అని అంటున్నారు. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో అయితే జగన్ మాత్రం పెద్దగా జనంలోకి రాలేదని అంటున్నారు. ఆయన బెంగళూరు టూ తాడేపల్లి గానే ఎ మధ్యకాలం అంతా గడిపారు అని అంటున్నారు.
అపుడపుడు మాత్రమే :
ఇక జగన్ జనంలోకి వస్తున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే. జగన్ తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో తుఫాన్ బాధిత రైతులను కలుసుకున్నారు. దానికి మంచి స్పందన లభించింది అని వైసీపీ శ్రేణులు అంటున్నారు. అయితే ఇదే తీరున జగన్ జనంలో ఉండాలని క్యాడర్ కోరుకుంటోంది. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఆయన తాడేపల్లికి పూర్తిగా మకాం మార్చి నిరంతరం క్యాడర్ కి అందుబాటులో ఉండాలని కూడా కోరుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలు :
ఇంకో వైపు చూస్తే కొత్త ఏడాది దగ్గరకు వచ్చేసింది. 2026 వస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలు ముంగిట ఉన్నాయి. అధికార కూటమి ఇప్పటికే ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. అధికారం చేతిలో ఉండడం కూటమికి కలసి వచ్చిన విషయం అన్నది తెలిసిందే. గతంలో వైసీపీ కూడా అధికారంలో ఉన్నపుడు నూటికి ఎనభై అయిదు శాతం లోకల్ బాడీస్ ని గెలుచుకుంది. ఈసారి మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి వారిదే పైచేయి అన్న మాట ఉంది. అయితే వైసీపీ గట్టి పోటీని ఇస్తే కనుక చాలా వరకూ చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఇప్పటి నుంచే తగిన విధాంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని, అదే విధంగా పార్టీ క్యాడర్ కి కొత్త ఉత్సాహం తీసుకుని రావాలని ప్రజలలో కూడా వైసీపీ మీద పాజిటివ్ వైబ్స్ ఉండేలా చూసుకోవాలని కోరుతున్నారు.
రెడీ అంటున్న జగన్ :
ఈ నేపధ్యంలో జగన్ కూడా పార్టీ నాయకులు క్యాడర్ అభిప్రాయాలకు ఓకే అని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. తాను జనంలోకి రావడానికి జగన్ కూడా సిద్ధం అవుతున్నారని అంటున్నారు. జగన్ జిల్లాల పర్యటనలు ఇక మీదట ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. నెలకు ఒకటి రెండు జిల్లాల వంతున జగన్ ఈ పర్యటనలు త్వరలో చేపడతారు అని అంటున్నారు. ఆయా జిల్లాలకు వెళ్ళినపుడు అక్కడ పార్టీ పరిస్థితులు క్యాడర్ విషయం అన్నీ చూసుకుని పార్టీ బలోపేతం చేసేందుకు జగన్ దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. దాని వలన లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ఏ మేరకు సమాయత్తం అవుతుంది అన్నది అధినాయకత్వానికి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు.
టఫ్ ఫైట్ ఇచ్చేందుకు :
అంతే కాదు, పార్టీ కూడా సరైన వారిని ఎంపిక చేయడం ద్వారా కూటమికి టఫ్ ఫైట్ ఇచ్చేందుకు వీలు కుదురుతుందని అంటున్నారు. దీనిని సంబంధించి పార్టీ షెడ్యూల్ ని ఖరారు చేసే పనిలో ఉంది అని అంటున్నారు. జగన్ జిల్లాల పర్యటనలు కనుక మొదలైతే క్యాడర్ లో ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. అంతే కాదు, జనంలో కూడా వైసీపీ గట్టిగా మారు మోగుతుందని అంటున్నారు. సో మొత్తానికి జగన్ ఓకే అన్నారు కాబట్టి జిల్లాల పర్యటనలో క్యాడర్ ఆయనను కలుసుకునేందుకు వీలు ఉంటుందని అంటున్నారు.
