పశ్చిమ ప్రకాశం లో వైసీపీ వీక్ అయిందా ?
వైసీపీకి భారీ ఓటమి బాధలు ఇంకా తీరలేదా అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి కీలకమైన జిల్లాలలో ఇంకా కోలుకోకపోవడమే అని అంటున్నారు.
By: Satya P | 10 March 2026 5:00 PM ISTవైసీపీకి భారీ ఓటమి బాధలు ఇంకా తీరలేదా అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి కీలకమైన జిల్లాలలో ఇంకా కోలుకోకపోవడమే అని అంటున్నారు. ఇక జగన్ అంటేనే పశ్చిమ ప్రకాశంగా చెబుతారు.అలాగే పశ్చిమ ప్రకాశం అంటే జగన్ అనే విధంగా అక్కడ రాజకీయం ఉంటుంది. అలాంటి పశ్చిమ ప్రకాశంలో ఇపుడు వైసీపీ రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయని అంటున్నారు. పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లాగా మారింది. మొత్తం నాలుగు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఇక ఇందులో మూడు జనరల్ ఓసీ అయితే ఒకటి ఎస్సీగా ఉంది. అదే ఎర్రగొండపాలెం. ఇక మిగిలినవి చూస్తే మార్కాపురం, గిద్దలూరు, కనిగిరిగా ఉన్నాయి.
వారిదే డామినేషన్ :
ఇక చూస్తే పశ్చిమ ప్రకాశంలో రెడ్డి సామాజిక వర్గానిదే డామినేషన్ అంటారు. అంటే జనాభా పరంగా వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ జగన్ అమలు చేస్తున్న స్ట్రాటజీ అయితే ఏ మాత్రం వర్కౌట్ కావడంలేదు అని అంటున్నారు. కనిగిరిలో పూర్తిగా రెడ్లు ఉంటారు. కానీ అక్కడ సీటు యాదవ సామాజిక వర్గానికి జగన్ ఇచ్చారు. టీడీపీ తరఫున రెడ్డి అభ్యర్ధి ఉన్నారు. దాంతో సామాజిక వర్గం సమీకరణలతో రెడ్డికే అంతా జై కొట్టారు. అయితే ఇక్కడ యాదవ సామాజిక వర్గం కూడా మూడవ ప్లేస్ లో ఉంది. అయితే ఇక్కడ ఓటర్లలో కానీ మార్కాపుపురంలో కానీ పూర్తిగా రెడ్లే ఉంటారు. అలాగే అక్కడ వైశ్య సామాజిక వర్గానికి సీటు ఇస్తే టీడీపీ రెడ్లకు ఇచ్చింది. దాంతో అక్కడ కూడా వైసీపీ వ్యూహమేదీ వర్కౌట్ కాలేదని చెబుతారు
సీన్ మొత్తం అంతే :
ఇక చూస్తే గిద్దలూరులో నాన్ లోకల్ ని వైసీపీ హైకమాండ్ ఇంచార్జి ఇచ్చారు. కానీ రెడ్డి సామాజిక వర్గమంతా సబ్ క్యాస్ట్ ఆ అభ్యర్ధికి లేవు. కానీ అక్కడ అంతా సబ్ క్యాస్ట్ కే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అలా గిద్దలూర్లో అయితే ఆ పార్టీ ఇంచార్జి అసలు గ్రామ కమిటీలు కూడా వేయలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో ఇంకా చాలా గ్రామాలు ఖాళీగా ఏ కమిటీలు లేకుండా ఉన్నాయని అంటున్నారు. ఇక ఆయన ఉండేది మార్కాపురంలో గిద్దలూరుకి చుట్టపు చూపుగా వస్తూ పోతూ ఉన్నారు అంటున్నారు. దాంతో గిద్దలూరులోని వైసీపీ క్యాడర్ అయితే ఇంచార్జిని నమ్మడం లేదని అంటున్నారు. దాంతో ఆయనకే 2029లో టికెట్ వస్తుందా లేదా అన్నది కూడా చాలా మంది అనుకుంటున్న నేపధ్యం ఉంది.
పార్టీలోనే వ్యతిరేకత :
ఇక మార్కాపురంలో అయితే ఇంచార్జికి గ్రామంలొ ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయకులకు అసలు సపోర్టు చేయడం లేదని అంటున్నారు. ఎందుకంటే గతంలో ఆ ఇంచార్జికి అక్కడి రెడ్డి సామాజిక వర్గం నేతలకు పడడం లేదని భావించే గిద్దలూరు నుంచి వచ్చి మార్కాపురంలో పోటీ చేశారు అని గుర్తు చేస్తున్నారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి వర్గం కూడా బలంగా ఉంది. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వవద్దని అని బహిరంగానే వైసీపీ నేతలు చెబుతున్నారని టాక్ నడుస్తోంది. దాంతో అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు.
కనిగిరిలోనూ ఇబ్బందిగానే :
ఇక కనిగిరి నియోజకవర్గంలో అయితే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వారి వర్గీయులు ప్రస్తుతం ఇంచార్జికి ఏ మాత్రం మద్దతు ఇవ్వడం లేదు, పైగా బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంచార్జి తీరు పట్ల అక్కడ రెడ్డి సామాజిక వర్గం గుర్రుగా ఉనంటున్నారు అని చెబుతున్నారు. ఇక కనిగిరి ఇంచార్జికి డబ్బులు సమస్యగా ఉంది అని అంటున్నారు. ఇదే విషయం పెద్ద ఎత్తున డిస్కషన్ గా ఉంది. కనిగిరి ఒక్కటే కాదు మార్కాపురం, గిద్దలూరు ఇంచార్జిలు కూడా డబ్బులు తీయడం లేదు అని పార్టీలోనే కామెంట్స్ ఉన్నాయి.
ఈయన ఒక్కడే బెస్ట్ :
ఇక యెర్రగుండపాలెం ఎస్సీ ఎమ్మెల్యే మాత్రం బెస్ట్ అని అంటున్నారు. ఆయన అందరికీ నియోజకవర్గంలో కలుపుకుని పోతున్నారు అని చెబుతున్నారు. అందరితో మంచి సంబంధాలు నెరుపుతున్నారు అని నియోజకవర్గం క్యాడర్ ఎబుతోంది. ఇక వైసీపీ హైకమాండ్ కి ఆయన మీద మంచి నివేదికలు వెళ్ళాయని అంటున్నారు అలా యెర్రగొండపాలెం ఎమ్మెల్యేకు జగన్ దగ్గర మంచి మార్కులే పడుతున్నాయని అంటున్నారు. దాంతో అతనికి ఏ ఇబ్బంది ఉండదని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని అంటున్నారు.
మూడు సీట్లూ ఫోకస్ పెట్టాల్సిందే :
అయితే కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లలో మూడు అసెంబ్లీ సీట్ల మీద వైసీపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టాల్సిందే అని అంటున్నారు. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరూ ఈ మూడు సీట్లను బలమైన రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు ఇంచార్జిలుగా ఉన్న వారు జనంతో ఉండాలని క్యాడర్ ని కలుపుకుని పోవాలని డబ్బులు ఖర్చు పెట్టాలని కోరుతున్నారు. లేకపోతే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. ఈ ముగ్గురు ఇంచార్జిల పనితీరు మీద గుర్రుగా ఉన్న క్యాడర్ అయితే వారిని మార్చాలని తామే హైకమాండ్ ని కోరుతామని కూడా అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నియోజకవర్గాలలో కనుక మార్పులు చేసి బలమైన రెడ్లని ఇంచార్జులుగా నియమిస్తే వైసీపీకి తిరుగు ఉండదని అంటున్నారు. దాంతో మార్కాపురం జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుని తీరుతుందని వైసీపీ అంటున్నారు. మరి హై కమాండ్ ఈ విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది అని అంతా చర్చిన్ చర్చించుకుంటున్నారు.
