Begin typing your search above and press return to search.

వైఎస్సార్ ని కాంగ్రెస్ పూర్తిగా సొంతం చేసుకుంటోందా ?

ఇక వైఎస్సార్ అంటే కాంగ్రెస్ మనిషి అని ఆయన జయంతులు వర్ధంతుల వేళ ఈ తరనాకి మరోమారు గట్టిగా వినిపించేలా కాంగ్రెస్ చేస్తోంది.

By:  Satya P   |   4 Sept 2025 7:00 AM IST
వైఎస్సార్ ని కాంగ్రెస్ పూర్తిగా సొంతం చేసుకుంటోందా ?
X

వైఎస్సార్ కాంగ్రెస్ మనిషే. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ తోనే మూడున్నర దశాబ్దాల అనుబంధాన్ని పెనవేసుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే ఆయన మరణించారు. మరి వైఎస్సార్ కొత్తగా కాంగ్రెస్ సొంతం చేసుకోవడం ఏంటి అన్న చర్చ వస్తుంది. అయితే వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబంతో వచ్చిన రాజకీయ విభేదాలు వైఎస్సార్ కుటుంబం వేరు కావడం ఫలితంగా ఏపీలో కాంగ్రె ఓటు బ్యాంక్ చెల్లా చెదురు కావడం, వైసీపీకి గుత్తమొత్తంగా పోవడం అన్నది చూస్తే కనుక కాంగ్రెస్ తెలుగు నాట వైఎస్సార్ ట్యాగ్ లేకుండా ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడింది.

ఆయన పేరుతో ముందుకు :

తెలంగాణాలో చూస్తే వైఎస్సార్ అనుచరులు అనేకమంది ఉన్నారు. అయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అలా ఎన్నో ఫ్యాక్టర్లలో వైఎస్సార్ ఫ్యాక్టర్ కూడా ఒకటిగా ఉంటుంది. అయినా సరే ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి వైఎస్సార్ జయంతులు వర్ధతులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బాగా ఎక్కువగా సాగుతోంది.

కాంగ్రెస్ కి ఆయనే ఆక్సిజన్ :

ఇక ఏపీలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం దక్కాల్సి ఉంది. దానికి మూలాధారం వైఎస్సార్ అని కూడా తెలుసుకున్నారు. ఆయన పేరుని బాగానే వాడుకుని ముందుకు సాగాలని చూస్తున్నారు. గత ఏడాది ఏపీలో వైఎస్సార్ పేరుతో భారీ ఎత్తున సభ ఏపీలో జరిగింది. దానికి తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు అంతా హాజరయ్యారు. ఈ ఏడాది తెలంగాణాలో చేశారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు దానికి అటెండ్ అయ్యారు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, కీలక నేతలుగా ఉన్న రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, కేవీపీ రామచంద్రరావు లాంటి వారు హాజరు అయ్యారు.

వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి:

ఇక వైఎస్సార్ అంటే కాంగ్రెస్ మనిషి అని ఆయన జయంతులు వర్ధంతుల వేళ ఈ తరనాకి మరోమారు గట్టిగా వినిపించేలా కాంగ్రెస్ చేస్తోంది. ఏపీలో చూస్తే వైఎస్సార్ తనయ అయిన షర్మిల చేతికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంలోనూ ఆంతర్యం కూడా అదే, ఆయన రాజకీయ వారసురాలుగా రక్త బంధంగా ఆమెని ముందు ఉంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైఎస్సార్ ని అభిమానించే వారిని తిరిగి ఒక త్రాటి మీదకు తేవాలని చూస్తోంది అని అంటున్నారు.

కుటుంబ కార్యక్రమాలే :

ఇక వైసీపీ చూస్తే అధికారంలో ఉన్నపుడు వైఎస్సార్ పేరుతో అవార్డులను ఇస్తూ వచ్చింది. అలా ప్రతీ ఏటా నవంబర్ 1న వైఎస్సార్ ని తలచుకునేది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన జయంతులు వర్ధంతులు మాత్రం ఇడుపుల పాయలో జరిపిస్తోంది. జగన్ కుటుంబ సమేతంగా హాజరై తండ్రికి నివాళి అరిపించి వస్తున్నారు. ఇక పార్టీ తరఫున ఔస్తాహీకులు మాత్రం తమ ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ పేరున భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో పార్టీ పక్షాన ఘనంగా నిర్వహించే కార్యక్రమాలు అయితే గత రెండేళ్ళుగా లేవు అనే చెప్పాలి.

వైసీపీ మాత్రం మెత్తగా :

పేరులో వైఎస్సార్ ని పెట్టుకుని ఆయన అసలు సిసలు వారసుడిగా జగన్ ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్న వైసీపీలో మాత్రం వైఎస్సార్ పేరుతో నిర్వహించినది లేదు అని అంటున్నారు. ఇక్కడ గురించాల్సింది ఏంటి అంటే వైఎస్సార్ తో పార్టీకి కూడా బలమైన పేగు బంధం ఉందన్న సంగతిని జనంలోకి బలంగా తీసుకుని వెళ్ళి ఆయనను ఆ చరిష్మాను పూర్తిగా తమ సొంతం చేసుకోవడం అది అయితే జరగడం లేదనే అంటున్నారు. ఒక వైపు కాంగ్రెస్ ఈ విషయంలో దూకుడు చేస్తూంటే వైసీపీ మాత్రం మెత్తగా ఉండడం వల్ల రాబోయే రోజులలో పరిణామాలు ఏమైనా మారితే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.