సునీత పోరాటం: వివేకా కేసులో ఆ 'నాలుగు' తేలతాయా?
సునీత వేసిన పిటిషన్ త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో అసలు ఆ నాలుగు విషయాలు తేలుతాయా? అనేది ప్రశ్నగా మారింది.
By: Garuda Media | 26 Sept 2026 4:53 PM ISTవైసీపీ అధినేత జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి.. 8 సంవత్సరాలు వచ్చేశాయి. అయితే.. ఈ కేసులో ఇప్పటికీ.. చార్జిషీట్ దాఖలు కాలేదు. కానీ.. విచారణ మాత్రం ముగిసిపోయిందని.. ఇక తేల్చేందుకు ఏమీ లేదని సీబీఐ చెప్పేస్తోంది. ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉంది. అయితే.. కీలకమైన మూడు అంశాలను ప్రస్తావిస్తూ.. సునీత వేసిన పిటిషన్ త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో అసలు ఆ మూడు విషయాలు తేలుతాయా? అనేది ప్రశ్నగా మారింది.
1) సుపారీ ఇచ్చిన వ్యక్తులు: వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్లరూపాయలకు సుపారీ కుదిరిందని అధికారులు నిర్ధారించారు. కానీ, సునీత .. కేవలం 40 కోట్లే కాదని.. ఇంకా ఎక్కువ మొత్తమే ఉంటుందని.. దీనిని ఇచ్చిందెవరు.. అసలు ఎందుకు ఇచ్చారు అనే కోణాల్లో విచారణ జరగాలని కోరుతున్నారు. కానీ, ప్రస్తుతం 40 కోట్ల రూపాయల చుట్టూనే విచారణ జరుగుతోంది.
2) జగన్‌కు మాత్రమే.. : వివేకా హత్య అనంతరం.. తొలి ఫోన్ కాల్.. జగన్‌కు మాత్రమే ఎందుకు వెళ్లిందన్నది సునీత ప్రశ్న. దీనిపై విచారణ చేయాలని కోరడంతో సీబీఐ విచారించింది. కానీ రీజన్ లేకుండానే పక్కన పెట్టింది. కుటుంబ పెద్ద కాబట్టి.. జగన్‌కు ముందుగా సమాచారం అందిందని పేర్కొంది. కానీ, అసలు కుమార్తెగా తనకు కదా.. ఫోన్ రావాల్సింది.. తనకు కాకుండా.. జగన్‌కు ఎందుకు ఫోన్ చేశారు.. వారితో జగన్‌కు ఏం సంబంధం అన్నది సునీత ప్రశ్న. దీనిపై లోతైన విచారణ కోరుతున్నారు.
3) గుండె పోటు డ్రామా: తన తండ్రి దారుణ హత్యకు గురైతే.. గుండెపోటుతో మృతి చెందారని కల్పిత కథనాలు వండివార్చింది ఎవరు? ఎందుకు అలా చేశారు? దీనివెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి? అనేది సునీత సంధిస్తున్న ప్రశ్న. దీనిపైనా ఆమె విచారణ కోరుతున్నారు.
ఇవే విషయాలపై.. సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
