వివేకా హత్య జరిగిందని అందరికీ తెలుసు...పవన్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం ఎపుడూ ఏపీలో సంచలనమే. ఆయన సామాన్యుడు కాదు, స్వయంగా మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు.
By: Satya P | 19 Sept 2025 4:20 PM ISTవైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం ఎపుడూ ఏపీలో సంచలనమే. ఆయన సామాన్యుడు కాదు, స్వయంగా మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వైఎస్సార్ కి అనుంగు సోదరుడు, జగన్ కి సొంత బాబాయి. అంటే ఒక సీఎం కి తమ్ముడు అయి ఉండి మరో సీఎం కి బాబాయ్ అయి ఉండి కూడా వివేకా హత్య కేసు ఏమీ తెమలలేదు అంటే అది అత్యంత ఆశ్చర్యకరం, పైగా విషాదకరం కూడా. దీని మీదనే అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హత్య జరిగినా :
వివేకా హత్య జరిగింది అన్నది అందరికీ తెలుసు. అలా కళ్ళ ముందే ఒక హత్య జరిగినా కూడా ఏమీ చేయలేకపోతున్నామని పవన్ వ్యాఖ్యానించారు. వివేకా 2019 మారి 15న రాత్రి వరకూ బాగానే ఉన్నారు తెల్లవారుతూనే తన సొంత ఊరిలో సొంత ఇంట్లో ఆయన శవమై కనిపించారు. అంతే కాదు అది దారుణమైన హత్య. పెను సంచలనం సృష్టించిన హత్యగా కూడా ఆ రోజూ ఈ రోజూ అంతా మాట్లాడుకుంటారు.
కేసు విషయం చూస్తే :
వివేకా హత్య కేసు విషయం చూస్తే ఏమీ విషయం తెలియలేదు. తమ దర్యాప్తు పూర్తి అయిందని సుప్రీం కోర్టు ఆదేశిస్తే తిరిగి విచారిస్తామని కూడా సీబీఐ చెప్పుకొచ్చింది. ఇక ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ నెల 16న విచారణ జరిపింది. నిందితుని బెయిల్ రద్దు విషయంలో జోక్యం చేసుకోలేమని కూడా పేర్కొంది. ఇప్పటికే సీబీఐ ఫైనల్ చార్జిషీట్ ఫైల్ చేసిన క్రమంలో నిందితుల బెయిల్ రద్దు రద్దు చేసుకోలేమని వెల్లడించింది. ఇక ట్రయల్ కోర్టులోనే ఈ కేసులో దర్యాప్తు విషయంలో పిటిషన్ దాఖలు చేసుకోవాలని కూడా సుప్రీంకోర్టు సునీత తరఫున న్యాయవాదులకు సూచించింది
పవన్ వ్యాఖ్యలు వైరల్ :
పవన్ కళ్యాణ్ వివేకా హత్య కేసు మీద చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. హత్య జరిగింది అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. హత్య కేసు విషయంలో ఏమీ చేయలేకపోతున్నామని కూడా ఆయన అనడం మరో విశేషంగా చూడాలి ఒక వైపు సీబీఐ ఈ కేసుని క్లోజ్ చేసి ఫైనల్ చార్జి షీట్ ని దాఖలు చేసింది. మరో వైపు ట్రయల్ కోర్టు కి వెళ్ళమని సుప్రీంకోర్టు సూచించింది. దాదాపుగా ఏడేళ్ళకు దగ్గర పడుతున్నా ఒక పెద్దాయన రాజకీయ ప్రముఖుడి దారుణ హత్య కేసే ఇలా ఉంటే మరి మిగిలిన వారి సంగతి ఏమిటి అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో వివేకా హత్య కేసు విషయంలో పవన్ చేసిన కామెంట్స్ పలు రకాలిన ఆలోచనలు కలిగిస్తున్నాయి. ఈ సమయంలో నిజంగా సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండి ఉంటే ఏమి జరిగేదో ఏమో అన్నది కూడా అంతా ఆలోచిస్తునారు
