షర్మిల మాస్టర్ ప్లాన్...సక్సెస్ అయితేనా ?
పీసీసీ చీఫ్ గా షర్మిల కొనసాగడం అన్నది వైసీపీకి తలపోటుగా పరిణమిస్తోంది అన్నది తెలిసిందే.
By: Satya P | 1 Sept 2025 9:32 AM ISTపీసీసీ చీఫ్ గా షర్మిల కొనసాగడం అన్నది వైసీపీకి తలపోటుగా పరిణమిస్తోంది అన్నది తెలిసిందే. ఆమె మెయిన్ టార్గెట్ వైసీపీయే అని అంతా అనుకున్నారు కానీ కాంగ్రెస్ అధినాయకత్వం కూడా వైసీపీనే కార్నర్ చేస్తోంది అన్నది ఇటీవల ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తెలిసింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ అయితే జగన్ మీద గట్టిగానే విమర్శలు చేయడం అంతా చూశారు. దాంతో పాటు కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు ఫుల్ సపోర్ట్ తో పాటు ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
కడప కోట మీదనే కన్ను :
వైసీపీని పులివెందులలో పరిసమాప్తం చేయాలని ఒక వైపు టీడీపీ కూటమి గట్టి ప్రయత్నాలు చేయడమే కాదు అందులో సూపర్ సక్సెస్ అవుతోంది. ఇటీవలనే పులివెందుల జెడ్పీటీసీ ని ఉప ఎన్నికల్లో గెలుచుకుని సత్తా చాటింది. ఇక తరువాత పులివెందుల సీటే అంటోంది. అదే సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న షర్మిల కడప ఎంపీ సీటు మీద గురి పెట్టారు అని అంటున్నారు. ఆమె 2024లో అక్కడ నుంచే పోటీ చేసిన సంగతి తెలిసిందే.
అవినాష్ మీద అందుకే :
తాజాగా షర్మిల మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి పాత్రను ప్రశ్నించారు. ఆయన పాత్ర సుస్పష్టం అని గూగుల్ మ్యాప్ లో కూడా ఉందని గట్టిగానే మాట్లాడారు ఆయనను అరెస్టు కాకుండా రక్షిస్తున్నారు అని కేంద్రం మీద విరుచుకుపడ్డారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అవినాష్ రెడ్డిని కడప ఎంపీ బరి నుంచి తప్పిస్తే వైసీపీ వీక్ అయితే ఆ ప్లేస్ లో కాంగ్రెస్ నుంచి తాను మరోసారి పోటీ చేయాలని పక్కాగా గెలవాలని షర్మిల ఆలోచిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది
అన్నీ అలా కుదిరితే :
ఇక చూస్తే కనుక 2029లో జాతీయ రాజకీయాలు మారుతాయని ఒక విశ్లేషణ ఉంది. అది బీహార్ ఎన్నికల నుంచే స్టార్ట్ అవుతుందని కూడా అంటున్నారు మూడు సార్లు అధికారంలో ఉన్న ఎన్డీయే వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలు అవుతుందని ఇండియా కూటమి గెలుస్తుందని కూడా ఒక అంచనా అయితే ఉంది దాంతో ఏపీలో కూడా ఆ ప్రభావం పడితే కాంగ్రెస్ కి కొంత ప్లస్ అవుతుందని కూడా లెక్క వేసుకుంటున్నారు ఇక కడప లోక్ సభ నుంచి షర్మిల 2029లో గెలిస్తే కనుక కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆమెకు జాక్ పాట్ తగిలినట్లే అని అంటున్నారు.
ఆమె కచ్చితంగా కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు ఏపీలో చూస్తే ఇప్పటప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా 2029 నాటికి ఎంతో కొంత పుంజుకుంటే ఆ తరువాత ఎన్నికలలో అయినా బలపడవచ్చు అన్న దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే షర్మిల కడప ఎంపీ సీటు మీదనే గురి పెట్టారని ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని మరింతగా రానున్న రోజులలో టార్గెట్ చేయడం ఖాయమని అంటున్నారు చూడాలి మరి ఈ వ్యూహాలు ఆలోచనలు ప్రచారాలలో నిజమెంత ఉందో.
