'స్థానికం'పై పట్టుబడతారా షర్మిలమ్మా.. ?
అయితే.. 1 పర్సంట్ నుంచి 1.27 పర్సంట్‌కు ఓటు బ్యాంకును ముందుకు తీసుకువెళ్లడంలో షర్మిల జోరు పనిచేసింది. ఇక, ఆ తర్వాత.. కొన్నాళ్లు ప్రజల మధ్య ఉన్నారు.
By: Garuda Media | 23 Aug 2026 1:00 PM IST"ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ప్రజలు ఈ పార్టీలతో(ప్రస్తుతం ఉన్నవి) విసిగిపోయారు."అని గత నెలలో సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. ఆమె ఊహించినట్టుగానే ఇప్పుడు ఎన్నికలకు రంగం రెడీ అయింది. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలే కావడం గమనార్హం. అంటే.. భారీ విస్తర్ణం, లక్షల సంఖ్యలో జనాభా వంటివి ఉండరు. మునిసిపల్ వార్డుల్లో ఉండే.. 50 నుంచి 60 వేల మంది జనాభానే ఈ ఎన్నికల్లో ఓటేస్తారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెఏమేరకు పుంజుకుంటారు? ఏవిధంగా పార్టీని పరుగులు పెట్టి స్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. గత ఎన్నికలలో షర్మిలపై పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుం ది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా ఆయన తాలూకు ఇమేజ్‌ను అందిపుచ్చుకుని పార్టీని బలోపేతం చేస్తారని.. పోయిన ఇమేజ్‌ను తీసుకువస్తారని పార్టీ భావించింది. కానీ, గత ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఆశించిన మేరకు ఓట్లు రాలేదు.
అయితే.. 1 పర్సంట్ నుంచి 1.27 పర్సంట్‌కు ఓటు బ్యాంకును ముందుకు తీసుకువెళ్లడంలో షర్మిల జోరు పనిచేసింది. ఇక, ఆ తర్వాత.. కొన్నాళ్లు ప్రజల మధ్య ఉన్నారు. ఒకటి రెండు అంశాలకు సంబంధిం చి ప్రజల మధ్యకు కూడా వచ్చారు. కానీ, తనకు రాజ్యసభ సీటు విషయంలో పార్టీ ఇస్తానని చెప్పి.. ఇవ్వ కుండా ఉండడంతో అలిగిన షర్మిల ఆ తర్వాత ఏపీ ముఖం చూడలేదు. ఇది జరిగి మూడు మాసాలైంది. అయినా.. కేవలం ఎక్స్ వేదికగా మాత్రం కొంతమేరకు స్పందిస్తున్నారు.
ఇక, ఇప్పుడు ఆమె కోరుకుంటున్నట్టుగా ఎన్నికలు వచ్చాయి. మొత్తం 123 మునిసిపాలిటీలకు గాను 100 చోట్ల అక్టోబరులోగా ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కూడా బ్యాలెట్ విధానంలోనే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో.. ఈ నేపథ్యాన్ని షర్మిల ఏమేరకు వినియోగించుకుంటారన్నది ప్రశ్న. మరోవైపు.. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు అడుగులు వడివడిగా వేస్తున్నాయి. కానీ.. షర్మిల మాత్రం ఇంకా స్పందించలేదు. మరి పోటీ చేస్తారా? చేయరా? అసలు వ్యూహం ఏంటి? ఎలా ముందుకు వెళ్తారు? అనే విషయాలపై క్లారిటీ కోరుతూ.. తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు.. ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.
