Begin typing your search above and press return to search.

షర్మిల...పాచ్ అప్ నా ప్యాక్ అప్ నా ?

వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా ఏపీకి ఉన్నారు. అయితే గడచిన కొన్నాళ్ళుగా షర్మిల నుంచి రాజకీయ కార్యకలాపాలు పెద్దగా లేకుండా పోయాయని అంటున్నారు.

By:  Satya P   |   19 Aug 2026 9:00 PM IST
షర్మిల...పాచ్ అప్ నా  ప్యాక్ అప్ నా ?
X

వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా ఏపీకి ఉన్నారు. అయితే గడచిన కొన్నాళ్ళుగా షర్మిల నుంచి రాజకీయ కార్యకలాపాలు పెద్దగా లేకుండా పోయాయని అంటున్నారు. అంతే కాదు షర్మిల గురించి ఈ మధ్యన మీడియాలో కూడా పెద్దగా ఏమీ కనిపించడం లేదు, గతంలో ఉన్న దూకుడు అయితే ఇపుడు లేదని అంటున్నారు. ఆమె ఆరోగ్యం బాగు లేదు అని ఈ మధ్యనే సర్జరీ చేసుకున్నారని అందుకే మునుపటి అంత యాక్టివ్ గా లేరని ఆమె అభిమానులు అనుచరులు అంటున్నారు. అయితే ఈ సర్జరీ కంటే ముందు కూడా గత ఏడాదిగా పీసీసీ చీఫ్ గా ఆమె రాజకీయ కార్యకలాపాలు ఏవీ పెద్దగా లేవుగా అని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు.

మీడియా బేబీ గానేనా :

ఇదిలా ఉంటే షర్మిలకు పీసీసీ చీఫ్ వంటి కీలక పదవిని కాంగ్రెస్ లో చేరగానే అధినాయకత్వం ఇచ్చింది. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పెద్దగా లేదు అన్నది తెలిసిందే. కానీ ఇచ్చిన పదవితో ఎంతో కొంత జనంలోకి వెళ్ళి పార్టీని గాడిన పెడతారు అనే ఆమెకు ఈ చాన్స్ ఇచ్చారు. పైగా వైఎస్సార్ వారసురాలిగా ఆమె ఎంతో కొంత బలం అవుతారని కూడా ఆశించారు. అయితే షర్మిల మాత్రం కనీసంగా కార్యక్రమాలు ఏవీ చేయకుండా ఏదో ఒకసారి ప్రెస్ మీట్ కి వచ్చి నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి పోతున్నారు అని విమర్శలు ఉన్నాయి. ఇక జగన్ తో పాచప్ అయింది అని అందుకే ఇంక పాక్ అప్ అవుతోంది అని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో ఆమె పీసీసీకి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేస్షకులు భావిస్తున్నారు.

అసంతృప్తితో నేనా :

ఇదిల ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అయిన డీకే శివ కుమార్ తో టచ్ లో ఉన్నా కూడా ఏమీ కలిసి రాలేదన్న ఆవేదన అసంతృప్తి షర్మిలలో ఉన్నాయా అన్నది కూడా చర్చ సాగుతోంది. రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి రెండు విడతలుగా రాజ్యసభ మెంబర్స్ ని భర్తీ చేసినా కూడా షర్మిలకు ఎక్కడా చాన్స్ ఇవ్వకపోవడం తో నిరాశ చెందారు అని కూడా అంటున్నారు. దాంతో ఏపీలో చూస్తే కాంగ్రెస్ యాక్టివిటీస్ దాదాపుగా కనిపించడం లేదు అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీ మీద సరైన సమయంలో రియాక్ట్ అవుతారు అని అంటున్నారు. ఇపుడిపుడే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది. ఈ సమయంలో దేశంలో తన పాత బలాన్ని కూడగట్టుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఏపీ వరకూ వస్తే ఇప్పటికిప్పుడు షర్మిల విషయంలో నిర్ణయం తీసుకోరని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ రాజకీయాన్ని కార్యకలాపాలను గమనించండి అని పార్టీ నేతలకు రాహుల్ గాంధీ స్థాయిలో సూచించారు అని ప్రచారం అయితే సాగుతోంది.

ఏపీలో ఎంత చేసినా :

మరో వైపు చూస్తే ఏపీలో ఎంత చేసినా రాజకీయ మైదానంలో ఖాళీ అయితే లేదని అంటున్నారు. మూడు పార్టీలతో కూటమి బలంగా కనిపిస్తోంది. అలాగే విపక్షంలో వైసీపీ బలంగా ఉంది. పోటీ అంటూ రాజకీయంగా జరిగితే టీడీపీ వర్సెస్ వైసీపీగానే గ్రౌండ్ లెవెల్ లో అన్ని వైపులా కనిపిస్తుంది. ఇక జనసేన కూడా సీజనల్ పార్టీగానే ఉంది అని అంటున్నారు క్యాడర్ కొరత సంస్థాగత బలహీనత ఆ పార్టీకి సమస్యలుగా ఉన్నాయని అంటున్నారు. ఇక బూత్ లెవెల్ వరకూ పటిష్టంగా ఉన్నవి టీడీపీ వైసీపీ మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ వంటి పార్టీలకు ఎక్కడ స్కోప్ ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ పరిణామాలు అన్నీ కూడా రాజకీయంగా పరిస్థితులను తెలియచేస్తూంటే కాంగ్రెస్ ఏపీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లుగానే ఉంది. ఇక పీసీసీ చీఫ్ గా షర్మిల దాదాపుగా వెనక్కి తగ్గిపోతున్నారా అన్న చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల్లో దేశంలో గెలిచి కేంద్రంలో ఏమైనా అధికారం అందుకుంటే తప్ప ఏపీలో కాంగ్రెస్ వికసించదు అన్న ఒక నిశ్చితాభిప్రాయం అయితే ఉంది. అందుకే ఎందుకు తొందర అన్నట్లుగానే హస్తం పార్టీలో ఎటు చూసినా కనిపిస్తోంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది.