విపక్ష నేతగా జగన్...షాకింగ్ రిజల్ట్ ?
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విపక్షంలోకి వచ్చి అపుడే ఏణ్ణర్ధ కాలం గడచిపోయింది. జగన్ సీఎం గా అయిదేళ్ళు పనిచేసి ట్రెజరీ బెంచీల నుంచి అపొజిషన్ బెంచీల వైపు వచ్చేశారు.
By: Satya P | 6 Dec 2025 8:52 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విపక్షంలోకి వచ్చి అపుడే ఏణ్ణర్ధ కాలం గడచిపోయింది. జగన్ సీఎం గా అయిదేళ్ళు పనిచేసి ట్రెజరీ బెంచీల నుంచి అపొజిషన్ బెంచీల వైపు వచ్చేశారు. అయితే జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదనుకోండి. ఇక అధికారం అంతం అయ్యాక 151 సీట్లు కాస్తా 11 అయ్యాక వైసీపీ అధినాయకత్వం ఒక్క సారిగా షాక్ తింది. అయితే ఆ షాక్ లో పార్టీని మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా ఏకంగా 18 నెలలు గడచినా కూడా ఇంకా ఎత్తిగిల్లలేకపోవడం మీదనే అంతటా చర్చ సాగుతోంది.
యాంటీ ఇంకెంబెన్సీ :
అధికార పక్షానికే కాదు విపక్షానికి కూడా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్నది అదే. మూడు ఎన్నికలు వరసగా జరిగితే కాంగ్రెస్ గ్రాఫ్ పెద్దగా పెరిగింది అయితే లేదు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలలో విపక్షాల మీద వ్యతిరేకతతో అధికారం మార్చకుండా మరోసారి అధికార పక్షానికే జనాలు జై కొడుతూ వస్తున్న వైనాలు చూస్తున్నారు. ఏపీలో చూస్తే కనుక వైసీపీ మీద యాంటీ ఇంకెంబెన్సీ ఇంకా కొనసాగడమే విశేషం అని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు అది చేయలేదని ఇది చేయలేదని ఎటూ ఉంటుంది, కానీ విపక్షంలో ఉన్నపుడు ఏమిటీ ఇబ్బంది అంటే దానికి కారణం వైసీపీ పోకడలే అని అంటున్నారు.
జగన్ మీద అసంతృప్తి :
ఇది నిజమా జగన్ మీద అసంతృప్తి ఉందా అంటే ఉంది అని అంటున్నారు. వైసీపీ దీని మీద సొంతంగా చేయించిన సర్వేతో పాటు ఒక ఢిల్లీ సంస్థ చేయించిన సర్వేలో కూడా వైసీపీ అధినేత మీద జనంలోనూ క్యాడర్ లోనూ కొంత అసంతృప్తి అయితే వ్యక్తం అయింది అని అంటున్నారు. జగన్ జనంలోకి ఎక్కువగా రావడం లేదు అన్నదే ఆ అసంతృప్తికి ప్రధాన కారణం అని అంటున్నారు. అంతే కాదు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీద కూడా జనంలో ఆగ్రహం వుంది అని అంటున్నారు. ఒక ప్రతిపక్ష నేతగా జగన్ అయితే అసెంబ్లీ లేకపోతే ప్రజలతో ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కానీ జగన్ మాత్రం అలా చేయడం లేదని అసలు ఆయన పెద్దగా జనంలోకే రావడం లేదన్న బాధ ఆవేదన క్యాడర్ ది అయితే ప్రజలలో కూడా ఇదే భావన ఉంది అని అంటున్నారు.
ధాటీగా నిలబడి :
ప్రతిపక్ష నేత అంటే జనం కోసం నిలబడి వారి పక్షాన ధాటీగా మాట్లాడాలని అంతా కోరుకుంటున్నారు. ఏపీలో చూస్తే మూడు పార్టీలు ఒక్కటై ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఇక విపక్షంలో చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు రెండూ నామమాత్రం అయ్యాయి. దాంతో అందరి చూపూ వైసీపీ మీదనే ఉంది. వైసీపీకి సభలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో జగన్ సభకు హాజరై ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తే కచ్చితంగా వైసీపీ గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉండేవని అంటున్నారు. కానీ అలా కాకుండా జగన్ అడపా దడపా మాత్రమే జనంలోకి వస్తున్నారు. ఇక మీడియా మీట్స్ కూడా ఆయన నెలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. దీని వల్ల వైసీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగడం లేదని అంటున్నారు.
ఏమి ఆలోచిస్తుందో :
ఇప్పటికైనా వైసీపీ ఈ షాకింగ్ రిజల్ట్స్ తో కొత్త వ్యూహాలను అమలు చేయాలని అంటున్నారు. కచ్చితంగా జగన్ అసెంబ్లీని వెళ్ళడంతో పాటు జనంలో ఉంటే ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగే చాన్స్ అయితే కచ్చితంగా ఉందని అంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం దీని మీద ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.
