కీలక భేటీలో జగన్ సంచలన నిర్ణయాలు ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అన్న చర్చ అయితే సాగుతోంది.
By: Satya P | 22 Sept 2025 9:51 AM ISTవైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అన్న చర్చ అయితే సాగుతోంది. వైసీపీకి సంబంధించి ఇది అత్యంత ముఖ్యమైన భేటీగా తెలుస్తోంది. నిజానికి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఈ నెల 18న శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలోనే మూకుమ్మడి రాజీనామాల చర్చ కూడా వచ్చింది అని అంటున్నారు. సభకు వరుసగా అరవై రోజుల పాటు హాజరు కాని ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వారి ఎత్తుకు పై ఎత్తుగా వైసీపీ వ్యవహరిస్తుంది అని అంటున్నారు.
వెంటనే మరో భేటీ :
ఇక ఈ సమావేశం అయిన వెంటనే మరో కీలక భేటీకి వైసీపీ అధినాయకత్వం ఆహ్వానించడంతో ఏమిటి జరుగుతోంది అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ సారి సమావేశానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జిలు ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించారు అని అంటున్నారు. ఒక విధంగా వైసీపీకి చెందిన మొత్తం పార్టీ అంతా ఈ సమావేశంలో పాల్గొంటుంది అని అంటున్నారు.
చర్చల వరకేనా :
సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో బయట నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉందని అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అన్న కండిషన్ ని కూడా పక్కన పెట్టాలని అనుకున్నా సభకు వెళ్తే ఎంత సమయం ఇస్తారో కూడా తెలియదు అని అంటున్నారు. తమకు మాట్లాడేందుకు అవసరం అయిన సమయం ఇస్తేనే సభకు వస్తామని చెబుతున్నా ఆ విధంగా కూడా భరోసా ఏమీ దక్కకపోవచ్చు అని అంటున్నారు. దాంతో వైసీపీ ముందు ఉన్న ఆప్షన్ సభకు తాముగా హాజరు కావడం లేకపోతే ఏకంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి జనంలోకి వెళ్ళి కొత్తగా తీర్పు కోరడం ఆ విధంగా రాజకీయ సమరం కోసం కూటమి పార్టీలను ముగ్గులోకి లాగడం. దీని మీదనే ఈ భేటీలో చర్చిస్తారా అని అంతా ఆలోచిస్తున్నారు.
సంచలన నిర్ణయం కూడా :
ఒక వేళ రాజీనామాలు చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంటే అది కూడా ఈ సమావేశంలో నేతల ముందు పెట్టి చర్చించి ఆమోదముద్ర వేస్తారా అని కూడా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా ఎలా చూసుకున్నా ఈ భేటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఈ నెల 24న జరిగే ఈ సమావేశం వైసీపీ భవిష్యత్తు రాజకీయాన్నే కాదు ఏపీ రాజకీయాన్ని సైతం ఒక మలుపు తిప్పబోతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా వైసీపీ మాత్రం దూకుడుగానే రాజకీయం చేయాలని నిర్ణయించుకుంది అని అంటున్నారు.
