Begin typing your search above and press return to search.

సీరియస్ గానే జగన్...తేల్చుకుంటారా ?

ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం వైసీపీకి కొత్త ఊపు తెచ్చింది అని అంటున్నారు.

By:  Satya P   |   22 Aug 2026 10:00 AM IST
సీరియస్ గానే జగన్...తేల్చుకుంటారా ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ గానే రంగంలోకి దిగనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మినీ సార్వత్రిక ఎన్నికలు అని చెబుతారు. ఈ ఎన్నికల ద్వరా మరోసారి పూర్వ వైభవం అందుకోవాలని వైసీపీ అధినేత చూస్తున్నారు అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటితే రేపటి రోజున పార్టీ బాగా పుంజుకుంటుందని 2024 ఎన్నికలలో వచ్చిన చేదు ఫలితాల గాయాలు మానుతాయని కూడా వైసీపీ ఆలోచిస్తోంది. అంతే కాదు 2029 ఎన్నికలలో గెలుపునకు ఇది రాచ బాట వేస్తుందని కూడా వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు.

కీలక సమావేశం :

స్థానిక సంస్థల మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టేసింది. దాంతో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఇంచార్జిలతో కీలక సమావేశాన్ని జగన్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో జగన్ పార్టీ ఇంచార్జిలకు స్థానిక ఎన్నికల మీద దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎపుడు రిలీజ్ చేసినా రెడీగా ఉండాలని జగన్ గట్టిగా సూచించనున్నారు. అదే

సమయంలో స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని కోరనున్నారు. లైట్ గా తీసుకుంటే పర్యవసానాలు కూడా వివరించనున్నారు అని అంటున్నారు. సమర్ధవంతంగా ఎన్నికలు ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులను ఆ దిశగా నడిపించాలని జగన్ స్పష్టం చేయనున్నారు అని తెలుస్తోంది.

ఊపు వచ్చిందా :

ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం వైసీపీకి కొత్త ఊపు తెచ్చింది అని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీకి పట్టు ఉన్న చోట్ల మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అని అంటున్నారు. దాంతో అక్కడ పార్టీ గ్రాఫ్ ఇటీవల కాలంలో పెరిగింది అని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని పార్టీ చూస్తోంది అని అంటున్నారు.

మారుతుందని ఆశ :

కేవలం రాయలసీమ మాత్రమే కాకుండా కోస్తా ఉభయ గోదావరి జిల్లాలలో ఉత్తరాంధ్రాలో కూడా పార్టీ తీరు మారుతుంది అన్నది వైసీపీ గట్టి నమ్మకంగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఈ మధ్య కాలంలో ఎక్కడ పర్యటించినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. దాంతో పాటుగా వైసీపీ శ్రేణులు ఇటీవల జనంలోకి వెళ్తున్నారు. అలాగే నాయకులు కూడా రంగంలోకి ఇపుడిపుడే దిగుతున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థలలో గట్టి ఫైట్ ఇవ్వగలమని ఇంతదాకా అనుకున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలు అని ప్రకటించడంతో విజయం మీద ఆశ పెరిగింది అని అంటున్నారు. మొత్తం మీద జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు అని తెలుస్తోంది. అధినాయకత్వం పట్టుదలగా ఉంటే పార్టీ కూడా పరుగులు తీస్తుంది అని అంటున్నారు. సో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక జగన్ సంచలన ప్రకటనలు ఏమైనా చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది.