బెంగళూరు కాదు నేరుగా అక్కడికే జగన్
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్లాన్ లో ఉన్నారు వచ్చేది కొత్త ఏడాది కాబట్టి వైసీపీ అధినయాకత్వం కూడా సరికొత్తగా యాక్షన్ ప్లాన్ లోకి దిగుతోంది అని అంటున్నారు.
By: Satya P | 11 Dec 2025 3:00 PM ISTవైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్లాన్ లో ఉన్నారు వచ్చేది కొత్త ఏడాది కాబట్టి వైసీపీ అధినయాకత్వం కూడా సరికొత్తగా యాక్షన్ ప్లాన్ లోకి దిగుతోంది అని అంటున్నారు. 2026 నుంచి రంగంలోకి దిగిపోవాలని జగన్ నిర్ణయించుకున్నారు అని చెబుతున్నారు. 2024లో వైసీపీ ఓటమి పాలు అయిన తరువాత ఆరు నెలలు కాదు మూడు ఆరు నెలలు అంటే 18 నెలలు వైసీపీ మొత్తంగా హానీమూన్ పీరియడ్ ని తీసుకుని అని సెటైర్లు ఉన్నారు. అడపా తడపా అధినాయకుడు జనంలోకి వచ్చినా క్యాడర్ అయితే ఇంకా అలాగే సైలెంట్ మోడ్ లో ఉందని అంటున్నారు. దాంతో ఇక లాభం లేదని తలచిన అధినేత జగన్ అయితే కొత్త ఏడాది నుంచి ఫుల్ ఫోకస్ పెట్టడానికి చూస్తున్నారు అని అంటున్నారు.
అక్కడికి టాటా కొట్టి :
వైసీపీ ఓటమి తరువాత జగన్ బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఆయన వారం మొదట్లో తాడేపల్లికి వచ్చి వీకెండ్స్ తిరిగి బెంగళూరు వెళ్ళిపోతున్నారు.. కానీ 2026 తరువాత మాత్రం నేరుగా తాడేపల్లికి చేరుకుంటారు అని అంటున్నారు. ఇక ఎప్పటిమాదిరిగానే ఆయన అక్కడ నుంచే పార్టీ యాక్టివిటీస్ ని పూర్తిగా పర్యవేక్షిస్తారు అని అంటున్నారు. పార్టీ నేతలతో రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టడంతో పాటు ప్రతీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో కూడా ఆయన స్వయంగా తెలుసుకుంటారు అని అంటున్నారు.
జిల్లాల టూర్లు :
జగన్ 2026 మొదటి నుంచి ఒక ఆరు నెలల పాటు అంటే జూలై 8న తన తండ్రి వైఎస్సార్ జయంతి వేళ వరకూ ఆరు నెలల పాటు జిల్లాల టూర్లు చేపడతారు అని అంటున్నారు. ఈ జిల్లాల టూర్లు బస్సు యాత్రగా చేస్తారు అని అంటున్నారు ప్రతీ జిల్లాకు వెళ్ళి అక్కడ కనీసంగా రెండు రోజుల పాటు జగన్ గడుపుతారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆ జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు బేరీజు వేయడమే కాకుండా పార్టీ పరిస్థితి క్యాడర్ ఏమంటోంది, నేతలు ఏ విధంగా పనిచేస్తున్నారు అన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని అధ్యయనం చేస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా ఇంచార్జిల పనితీరు మీద కూడా జగన్ స్వయంగానే క్యాడర్ ని అడిగి తెలుసుకుంటారు అని అంటున్నారు ఇక ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే జగన్ జిల్లాల పర్యటన మొదలవుతుందని అంటున్నారు.
కఠినంగానే ఇక :
వైసీపీకి ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిలలో పనిచేయని వారిని సైలెంట్ గా ఉండే వారిని ఉపేక్షించేది లేదని జగన్ ఒక కీలక సందేశం అయితే పంపిస్తారు అని అంటున్నారు. ఎంతటి వారు అయినా పనితీరు ఆధారంగానే పదవులు అన్న విధానం అమలు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక తాను నేరుగా జనంలోకి వెళ్ళడం వల్ల ఎవరు ఏమిటి అన్నది పూర్తిగా తెలుసుతుంది కాబట్టి నాయకులు పని మీదనే వారి పదవులు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఎవరైనా పనిచేయకపోతే కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారి ప్లేస్ లో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కూడా జగన్ వెనకాడరని అంటున్నారు. మరో వైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలు మూడేళ్ళ వ్యవధికి వస్తున్నందున అన్ని వర్గాలతో మమేకం కావడం వైసీపీకి దూరం అయిన సామాజిక వర్గాలను చేరువ చేయడం కోసం జగన్ కొత్త ఆలోచనలు చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద 2026లో అయితే వైసీపీని పరుగులు పెట్టించాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.
