Begin typing your search above and press return to search.

జగన్ లో నచ్చే క్వాలిటీ అదే...రఘురామ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం గా ఉన్నపుడు ట్రిపుల్ ఆర్ గా సోషల్ మీడియాలో అప్పటికి వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు పెద్ద ఎత్తున ఫ్యామస్ అయ్యారు.

By:  Satya P   |   21 Oct 2026 2:44 PM IST
జగన్ లో నచ్చే క్వాలిటీ అదే...రఘురామ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం గా ఉన్నపుడు ట్రిపుల్ ఆర్ గా సోషల్ మీడియాలో అప్పటికి వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు పెద్ద ఎత్తున ఫ్యామస్ అయ్యారు. నర్సాపురం ఎంపీ సీటుకు రఘురామ 2019 ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ తరఫున గెలిచారు. ఇక జగన్ తో రఘురామకు మంచి సాన్నిహిత్యమే మొదట్లో ఉండేది. వైఎస్సార్ అంటే ఎంతో ఇష్టపడి ఆయన సర్కిల్ లో ఉండే అతి ముఖ్య నాయకులలో ఒకరిగా ఉన్న రఘురామ జగన్ ని కూడా అలాగే అభిమానించారు. ఇక వైసీపీలో రఘురామ జగన్ ల మధ్యన పెద్దగా పొసగలేదు. జస్ట్ ఆరు నెలలు తిరగకుండానే వైసీపీలో రఘురామ రెబెల్ ఎంపీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆయన జగన్ మీద ఢిల్లీ వేదికగా రచ్చబండ పేరుతో ప్రతీ రోజూ మీడియా సమావేశాలు పెట్టి మరీ గట్టిగానే విమర్శలు చేసేవారు. అలా 151 సీట్లతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి తొలి ప్రతిపక్షంగా బలమైన వ్యతిరేక గొంతుకగా రఘురామ మారిన సంగతి తెలిసిందే.

జగన్ మొండితనం :

ఇదిలా ఉంటే రఘురామ జగన్ విషయంలో ఎన్నో విమర్శలు చేశారు. చాలా పెద్ద ఎత్తున హాట్ కామెంట్స్ చేశారు. ఒక కూటమి ప్రభుత్వంలో ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఉప సభాపతిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో రఘురామ మాట్లాడుతూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులుగా జగన్ లో తనకు నచ్చే గుణం ఒకటి ఉందని చెప్పి షాక్ తినిపించారు. అదే జగన్ మొండితనం అని చెప్పారు. జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే కనుక వెనక్కి తగ్గేది ఉండదని రఘురామ చెప్పారు. మంచో చెడ్డో మూడు కాళ్ళు అన్నారంటే దానికే కట్టుబడి పోతారు అని అన్నారు. తప్పు అయింది సారీ అనేది చెప్పరని అన్నారు. ఆయన మంచో చెడ్డో ముందుకే వెళ్తారు అని అన్నారు.

అదే ఆయన క్వాలిటీ :

జగన్ లో ఈ క్వాలిటీ తనకు ఇష్టం అని రఘురామ అన్నారు. జగన్ తాను ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే వెనక్కి తగ్గరని రఘురామ చెప్పారు. మొండితనం గా ఉండడం వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు. అయితే జగన్ మాత్రం ఆ విషయంలో తగ్గేది లేదన్నట్లుగానే ఉంటారు అని అన్నారు. ఆయన దగ్గర తూచ్ అన్న మాటే ఉండదని కూడా చెప్పారు. రాజకీయంగా తనకు జగన్ శత్రువు అయినా మంచి విషయాలు ఉంటే చెప్పుకోవాల్సిందే అని అన్నారు.

జగన్ కి అదే బలం :

అవును రఘురామ చెప్పిందే కరెక్ట్ అని అంతా అంటారు. జగన్ ని దగ్గర ఉండి చూసిన వారు కూడా అదే మాట చెబుతారు. జగన్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత ఆలోచిస్తారో ఎన్ని రోజులు మధనం చేస్తారో ఎవరికీ తెలియదు కానీ ఒక్కసారి కనుక జగన్ నిర్ణయానికి వచ్చారా ఇక ఆపేది ఎవరూ ఉండదని కూడా అంటారు. అది అమలు కావాల్సిందే. దాని వల్ల వచ్చే లాభ నష్టాలు మంచి చెడ్డలు ఆయన భరించడానికే సిద్ధమై ముందుకు పోతారని చెబుతారు. మరి జగన్ పార్టీలో ఎంపీగా పనిచేసి అంతా దగ్గరుండి చూసిన రఘురామ ఈ రకమైన విశ్లేషణ ఆయన గురించి చేశారు అంటే దాని గురించే అంతా ఆలోచిస్తున్నారు. రాజకీయం కానీ ఏ రంగం కానీ తెగువ ముఖ్యం, మొండితనం కూడా అవసరం. అయితే అది ఎంత మేరకు ఉండాలన్నదే చూసుకోవాల్సి ఉంటుంది. వైసీపీ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నది అంటే దానికి కారణం జగన్ లో ఉన్న అతి పెద్ద బలం మొండితనం వల్ల కూడా అని విశ్లేషించేవారూ ఉన్నారు.